బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు కరోనావైరస్

ఫొటో సోర్స్, Reuters
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు కరోనావైరస్ ఉన్నట్లు నిర్ధరించారని డౌనింగ్ స్ట్రీట్ తెలిపింది.
జాన్సన్‌కు స్వల్పంగా కరోనావైరస్ లక్షణాలు ఉన్నాయని, ఆయన ఇకపై స్వీయ నిర్బంధంలో ఉంటారని తెలిపారు.
"ఇంగ్లండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ క్రిస్ విట్టీ సూచన మేరకు ప్రధానమంత్రికి పరీక్షలు నిర్వహించాం" అని అధికారిక ప్రతినిధి ప్రకటించారు.
కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్ అని తేలిన తరువాత బోరిస్ జాన్సన్ ట్విటర్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. "నాలో కరోనావైరస్ లక్షణాలను స్వల్పంగా ఉన్నాయి. శరీర ఉష్ణోగ్రత పెరగడంతో పాటు ఆగకుండా దగ్గు వస్తోంది. చీఫ్ మెడికల్ ఆఫీసర్ సలహా మేరకు నేను పరీక్ష చేయించుకున్నాను. పాజిటివ్ అని తేలింది. నేను స్వీయ నిర్బంధం విధించుకుని ఇంటి నుంచే పని చేస్తాను" అని ఆ వీడియోలో బోరిస్ తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బ్రిటన్‌లో 11,600లకు పైగా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 578 మంది చనిపోయారు.
ఒకవేళ ప్రధానమంత్రి ఆరోగ్యం బాగా లేకపోతే విదేశాంగ మంత్రి డామినిక్ రాబ్ ఆయన బాధ్యతలు చూసుకోవడానికి ఎంపికయ్యారని ఈ వారం మొదట్లో ప్రధాని కార్యాలయం అధికార ప్రతినిధి తెలిపారు.
ఇంతకు ముందే వేల్స్ యువరాజు చార్లెస్‌కు కరోనావైరస్ సోకినట్లు నిర్ధరణ అయిన సంగతి తెలిసిందే. "ప్రిన్స్ చార్లెస్‌లో స్వల్పంగా కరోనావైరస్ లక్షణాలున్నాయి. అది మినహా ఆయన చక్కని ఆరోగ్యంతో ఉన్నారు" అని రాచకుటుంబ అధికార ప్రతినిధి తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- గర్భిణికి వైరస్ సోకితే ఎలా? : కరోనా కల్లోలంలో ఓ డాక్టర్ అనుభవం
- కరోనావైరస్కు భయపడని ఏకైక యూరప్ దేశం ఇదే
- కరోనావైరస్: భారతదేశం కోవిడ్ నిర్థరణ పరీక్షలు తగిన స్థాయిలో ఎందుకు చేయలేకపోతోంది?
- 'కరోనావైరస్ కన్నా ముందు ఆకలి మమ్మల్ని చంపేస్తుందేమో'
- కరోనావైరస్: 'కశ్మీర్లో 7 నెలలుగా హైస్పీడ్ ఇంటర్నెట్ లేదు, వైరస్ వార్తలు, జాగ్రత్తలు తెలుసుకునేదెలా?'
- కరోనావైరస్ నివారణకు గోమూత్రం పని చేస్తుందా
- కరోనావైరస్: రోగుల ప్రాణాలను కాపాడుతున్న త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ
- ‘నేను చనిపోయినా ఫరవాలేదు.. ఈ వ్యాధిని ఆఫ్రికాకు మోసుకెళ్లకూడదని చైనాలోనే ఉండిపోయాను’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








