కరోనావైరస్ నివారణకు గోమూత్రం పని చేస్తుందా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రియాలిటీ చెక్ టీం
- హోదా, బీబీసీ న్యూస్
భారతదేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనావైరస్ కేసులు తక్కువ సంఖ్యలోనే ఉన్నప్పటికీ ఈ వైరస్ నివారణ కోసం ప్రజలను తప్పుదారి పట్టించే సమాచారం మాత్రం అనేక రకాలుగా ప్రచారం అవుతోంది.
ఇలా ప్రచారంలో ఉన్న సమాచారంలో వాస్తవమెంత? అనే విషయాలను బీబీసీ ఫ్యాక్ట్ చెక్ బృందం పరిశీలించింది.
గోమూత్రం, పేడ
భారతదేశంలో ఎప్పటి నుంచో గోమూత్రం, పేడ అనేక రకాల రోగాలకు ఔషధంగా పని చేస్తాయనే వాదన ఉంది.
ఇవి కరోనావైరస్‌కు ఔషధాలుగా వాడవచ్చని మధ్యప్రదేశ్ బీజేపీ పార్లమెంట్ సభ్యురాలు సుమన్ హరిప్రియ సూచించారు.

ఫొటో సోర్స్, FACEBOOK
ఆవు మూత్రంలోని ఔషధ గుణాల గురించి గతంలో అనేక అధ్యయనాలు జరిగాయి.
కరోనావైరస్ నివారణకు గోమూత్రం ఎలా పని చేస్తుందో ప్రచారం చేసేందుకు దేశ రాజధాని దిల్లీలో ఒక హిందూ జాతీయవాద సంస్థ భారీ కార్యక్రమం కూడా నిర్వహించింది.
అయితే, "గోమూత్రానికి వైరస్‌ని హరించే లక్షణాలు ఉన్నట్లు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు" అని డాక్టర్ శైలేంద్ర సక్సేనా బీబీసీకి చెప్పారు.
"ఆవు పేడని వాడటం వలన ఒక వేళ అందులో కరోనావైరస్ ఉంటే అది మనుషులకు సోకి మరింత ప్రమాదానికి గురిచేసే అవకాశం ఉంది" అని శైలేంద్ర అన్నారు.

ఫొటో సోర్స్, COWPATHY
ఆవు పేడతో తయారు చేసిన సబ్బుతో పాటు, గోమూత్రంతో తయారు చేసిన ఆల్కహాల్ రహిత శానిటైజర్లు కూడా కౌపతి అనే సంస్థ 2018 నుంచి ఆన్‌లైన్‌లో అమ్ముతోంది.
"పెరిగిన డిమాండ్ కారణంగా సరుకు అందుబాటులో లేదని ఆ వెబ్‌సైట్ పేర్కొంది. ఎక్కువ మందికి ఈ ఉత్పత్తిని అందించేందుకు వీలుగా వినియోగదారులు కొనుక్కునే సంఖ్యకు పరిమితి విధించాం" అని ఆ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.
ఇంతలో యోగా గురువు రామ్‌దేవ్ బాబా కూడా ఒక ప్రముఖ హిందీ టీవీ చానల్‌లో ప్రసారమైన కార్యక్రమంలో ఇంట్లో హ్యాండ్ శానిటైజర్లు తయారు చేసుకోవచ్చని సూచించారు.
ఇంట్లో లభించే తమలపాకు, తులసి, పసుపుతో తయారు చేసిన కషాయాన్ని తాగితే కరోనావైరస్ రాకుండా కాపాడుకోవచ్చని చెప్పారు.
కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మాత్రం ఆల్కహాల్ ఉన్న శానిటైజెర్లు వాడాలని సూచిస్తోంది.
ఇంట్లో తయారు చేసిన ఎటువంటి శానిటైజెర్లు పని చేయవని, వొడ్కాలో కూడా కేవలం 40 శాతం మాత్రమే ఆల్కహాల్ ఉంటుందని లండన్ స్కూల్ అఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ప్రొఫెసర్ సాలీ బ్లూమ్ ఫీల్డ్ చెప్పారు.

- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్‌కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు

శాఖాహారం
గతవారం హరియాణా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ మాంసాహారం తినవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
"శాఖాహారులుగా ఉండండి" అని ట్వీట్ చేశారు.
"రకరకాల జంతువుల మాంసం తినడం ద్వారా కరోనావైరస్ లాంటి కొత్త వైరస్‌లని సృష్టించవద్దు" అని అయన అన్నారు.
మాంసాహారులను శిక్షించడానికే కరోనావైరస్ వచ్చిందని ఒక హిందూ జాతీయవాద సంస్థ వ్యాఖ్యానించింది.

ఫొటో సోర్స్, PIB
కోళ్లు, గుడ్లు అమ్మకాలు తగ్గినట్లు పశు సంవర్ధక మంత్రిత్వ శాఖ సమాచారం ఇవ్వగానే... చికెన్ తినడం వలన కరోనావైరస్ వస్తుందనే ఆధారాలు లేవని ప్రభుత్వ నిజ నిర్ధారణ కమిటీ ప్రకటన చేసింది.
ఇటువంటి వాదనలకు భారత ఆహార నియంత్రణ సంస్థ ఆధారాలు ఏమీ ఇవ్వలేదని మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కరోనా వైరస్ నివారణ పరుపులు
కొన్ని వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తులు వాడితే కరోనావైరస్ రాదనే ప్రచారాన్ని కూడా మొదలు పెట్టాయి.
15,000 రూపాయిలు ఖరీదు చేసే ఒక పరుపు వైరస్‌ని దరి చేరనివ్వదని ప్రకటన చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
"ఈ పరుపులు వైరస్‌ని, క్రిములని దరి చేరనివ్వవు, మట్టి, నీరు అంటుకోవు" అని అరిహంత్ మ్యాట్రెస్ మేనేజింగ్ డైరెక్టర్ చెప్పారు.
కానీ, తర్వాత ఆ ప్రకటనను తొలగించారు.
"ఎవరికీ హాని చేసే ఉద్దేశం నాకు లేదు" అని అయన చెప్పారు. అందరూ విమర్శించడం మొదలుపెట్టాక ఆ ప్రకటనను తొలగించినట్లు తెలిపారు..

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి
- కరోనావైరస్ వ్యాక్సీన్ అభివృద్ధిలో ముందడుగు, ఓ మహిళకు ప్రయోగాత్మకంగా ఇంజెక్ట్ చేసిన శాస్త్రవేత్తలు
- కరోనావైరస్ అనుమానిత రోగులు ఆసుపత్రుల నుంచి ఎందుకు పారిపోతున్నారు?
- కరోనావైరస్- పారాసిటమాల్: ఏపీ సీఎం వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్స్
- ప్రపంచంలోనే హెచ్ఐవీని జయించిన రెండో వ్యక్తి.. ఎలా నయమయ్యిందంటే?
- కరోనావైరస్ గురించి ఈ సినిమా 10 ఏళ్ల కిందే చెప్పిందా?
- కరోనావైరస్: శశిథరూర్ మెడలోని ఈ గాడ్జెట్ వైరస్‌లను అడ్డుకుంటుందా
- కరోనావైరస్లు ఎక్కడి నుంచి వస్తాయి... ఒక్కసారిగా ఎలా వ్యాపిస్తాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








