కరోనావైరస్- పారాసిటమాల్: ఏపీ సీఎం వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్స్

సోషల్ మీడియా పోస్టు

ఫొటో సోర్స్, Twitter

కరోనావైరస్ చికిత్సకు పారాసిటమాల్ మాత్రలే ఉపయోగిస్తారంటూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. సినిమా సీన్లతో పోలుస్తూ కొందరు విభిన్నమైన మీమ్స్ వేస్తున్నారు. జగన్ చెప్పింది నిజమేనంటూ కూడా చాలా మంది పోస్ట్‌లు చేస్తున్నారు.

మహేంద్ర నాయుడు అనే యూజర్ ట్విట్టర్లో 'మా సీఎం శాస్త్రవేత్త' అంటూ లక్ష్మీ సినిమాలో సన్నివేశంతో ట్రోల్ చేశారు.

ఇదొక్కటే కాదు... 'కరోనావైరస్‌కే పారాసిటమాల్ అనే మందును కనిపెట్టిన యవ శాస్త్రవేత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి' అంటూ మరో పోస్ట్ పెట్టారు.

"పారాసిటమాల్ ఇట్ ఈజ్ నాట్ జస్ట్ ఏ వర్డ్.. ఇట్స్ యాన్ ఎమోషన్" అంటూ కార్తీక్ రెడ్డి అనే యూజర్ ట్వీట్ చేశారు.

సోషల్ మీడియా పోస్టు

ఫొటో సోర్స్, Twitter

వినోద్ కుమార్ అనే మరో యూజర్ మన్మథుడు సినిమాలో నాగార్జున కాపీ కొట్టేసిన కాన్సెప్ట్ ప్రదర్శించే సీన్ తీసుకుని... "పారాసిటమాల్... రిమూవ్స్ కరోనా ఫ్రమ్ యువర్ లైఫ్" అనే క్యాప్షన్ రాసిన ఫోటో పోస్ట్ చేశారు.

సోషల్ మీడియా పోస్టు

ఫొటో సోర్స్, Twitter

పారాసిటమాల్ కంపెనీకి భారీగా ఆర్డర్లు వచ్చాయని... దీంతో పారాసిటమాల్ కంపెనీ యజమాని హాయిగా డబ్బుల మీద నిద్రిస్తున్నట్లుగా వరంగల్ ప్రభాస్ ఫ్యాన్స్ అనే పేరుతో ఉన్న యూజర్ పోస్ట్ పెట్టారు.

సోషల్ మీడియా పోస్టు

ఫొటో సోర్స్, Twitter

"జగనన్న కరోనా కానుక రెండు పారాసిటమాల్ బాక్సులు, నాలుగు బ్లీచింగ్ పొట్లాలు" అంటూ కింగ్ కళ్యాణ్ ఫ్రీక్స్ ట్వీట్ చేశారు.

సోషల్ మీడియా పోస్టు

ఫొటో సోర్స్, Twitter

శివాజీ సినిమాలో సీన్‌తో "మీకు కరోనా తగ్గకపోతే ఏపీకి రండి... ఇక్కడ మాస్కులుండవ్, హాస్పటల్‌కి పంపం. కానీ, పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ అనే రెండు కరోనాను ఖండించే రెండు ఆయుధాలు నా దగ్గరున్నాయి" అని చెప్పుకొచ్చారు.

సోషల్ మీడియా పోస్టు

ఫొటో సోర్స్, Twitter

ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ కరోనాకు పారాసిటమాల్ వాడాలని చెప్పిన మాటల్ని ప్రస్తావిస్తూ... మన్మథుడులో బ్రహ్మానందం షూ కొనే సీన్ మీద పోస్ట్ చేశారు. ఈ విషయం తెలియక చైనా, ఇటలీ, యూఎస్ఏ వాళ్లు చచ్చిపోతున్నారు సార్ మెడిసిన్ కోసం అన్న పోస్ట్ ట్వీట్ చేశారు.

సోషల్ మీడియా పోస్టు

ఫొటో సోర్స్, Twitter

జగన్, కేసీఆర్‌లు సీఎంలే కాదు.. సైంటిస్టులు కూడా అంటూ ఆన్‌లైన్లో వచ్చిన వార్తను సాయి అనే యూజర్ పోస్ట్ చేశారు.

ఇక అంజలి అనే యూజర్ పారాసిటమాల్ మాత్రకు వైసీపీ జెండా రంగులు వేసిన ఫోటోను పోస్ట్ చేశారు. దీనికి ఏపీ గవర్నమెంట్ రిలీజెస్ పారాసిటమాల్ ట్యాబ్లెట్ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు.

మల్లికా పరుచూరి అనే యూజర్... పారాసిటమాల్ మాత్ర వాడకం మీద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన మార్గదర్శకాలను పేర్కొంటూ పోస్ట్ పెట్టారు.

సోషల్ మీడియా పోస్టు

ఫొటో సోర్స్, Twitter

ఇలా ట్రోల్స్ మాత్రమే కాదు... కరోనాకు పారాసిటమాల్ చక్కగా పనిచేస్తుందంటూ పాజిటివ్ పోస్టులు కూడా పెడుతున్నారు.

సంజు అనే యూజర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన మార్గదర్శకాలతో పాటు, గగనదీప్ అనే భారతీయ శాస్త్రవేత్త చెప్పిన మాటల్ని ప్రచురించిన పేపర్ కటింగ్ కలిపి ట్విట్ చేశారు.

సోషల్ మీడియా పోస్టు

ఫొటో సోర్స్, Twitter

సురేంద్ర అనే యూజర్.. కోవిడ్ 19చికిత్స లో పారాసిటమాల్ వాడుతున్న డాక్టర్లు చేసిన ట్విట్లను పేర్కోంటూ..... చాలా మంది కేసీఆర్, జగన్‌లను విమర్శిస్తున్నారు. కానీ వాస్తవాలు కూడా తెలుసుకోండి అంటూ... వాటిని ఈ ట్వీట్ చేశారు.

సోషల్ మీడియా పోస్టు

ఫొటో సోర్స్, Twitter

కరోనా మీద వైసీపీని విమర్శించడమే కాదు.. మరో టీడీపీని, చంద్రబాబును కూడా ట్రోల్ చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు. కరోనా అనేది కమ్మ కులానికి చెందినదని, దాని శాస్త్రీయ నామం చౌదరి అని, చంద్రబాబు రమ్మంటేనే అది ఆంధ్రకు వచ్చిందని. అదీ ఎన్నికలు వాయిదా వేయించడానికి అంటూ శివ అనే యూజర్ ట్వీట్ చేశారు.

సోషల్ మీడియా పోస్టు

ఫొటో సోర్స్, Twitter

ఫేస్ బుక్‌లో కూడా ఈ ట్రోలింగ్ ఆగటం లేదు.

మురళీ సతీశ్ కుమార్ బెవేరా అనే యూజర్.... శివాజీ సినిమాలో సీన్ ప్రస్తావించేలా రజనీకాంత్ మాస్క్ తీసి పారేసి పారాసిటమాల్ మాత్ర కోసం పరిగెడుతున్నట్లుగా పోస్ట్ చేశారు.

సోషల్ మీడియా పోస్టు

ఫొటో సోర్స్, fb

ఇదే యూజర్ చైనాలో అందరికీ చెప్పండి అన్న వస్తున్నాడని, పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ తెస్తున్నాడని చెప్పండి. అంటూ ఓ పోస్ట్ క్రియేట్ చేసి పెట్టారు.

సోషల్ మీడియా పోస్టు

ఫొటో సోర్స్, fb

అనిల్ నాగిశెట్టి అనే యూజర్... ఠాగూర్ సినిమా సన్నివేశాన్ని బేస్ చేసుకుని "ప్రపంచాన్ని కాపాడేశావ్ కదయ్యా" అంటూ చెప్పడం, దానికి జగన్ ఫోటోతో ఉన్న వ్యక్తి మా డాడీ డాక్టర్ అని సమాధానమిచ్చేలా చేసిన పోస్ట్ పెట్టారు.

సోషల్ మీడియా పోస్టు

ఫొటో సోర్స్, fb

గోపీనాథ్ అల్లాడి అనే యూజర్ ఒక ఫోటోలో జగన్ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ... కింద చైనా వాళ్లు ఇది తెలియక వేల కోట్లు వేస్ట్ చేసుకుంటున్నారంటూ ఉండే ఫోటోను పోస్ట్ చేశారు.

సోషల్ మీడియా పోస్టు

ఫొటో సోర్స్, fb

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

కరోనావైరస్

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)