కరోనావైరస్: కొనసాగుతున్న స్టాక్ మార్కెట్ల పతనం

ఫొటో సోర్స్, Getty Images
ఐరోపా, ఆసియాలో స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతోంది. కరోనావైరస్‌ను అరికట్టేందుకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, మార్కెట్ ఉద్దీపన ప్రయత్నాలూ ఏవీ స్టాక్ మార్కెట్లను కోలుకునేలా చేయలేకపోతున్నాయి.
లండన్, ఫ్రాంక్‌ఫర్ట్, పారిస్ ఎక్స్చేంజ్‌లు 4 శాతం నష్టపోయాయి.
అనవసర ప్రయాణాలు మానుకోవాలని బ్రిటన్ తమ దేశస్థులకు సూచించింది. దేశ ప్రజలు అన్నిరకాల అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, లేదా రద్దు చేసుకోవాలని బ్రిటన్ విదేశాంగ శాఖ సూచించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ప్రయాణాలు రద్దు లేదా మార్చుకోవాలని అనుకునేవారికి తమ వెబ్‌సైట్‌లో కొన్ని సూచనలు అందించింది.

బీబీసీపై కరోనావైరస్ ప్రభావం
కరోనావైరస్ ప్రభావం బీబీసీ న్యూస్‌పై కూడా పడింది. ఉద్యోగులు చాలామంది ఇప్పటికే ఇళ్ల నుంచి పనిచేస్తుండగా, మరికొందరు అందుకు సిద్ధమవుతున్నారు.
ఈ పరిస్థితికి తగినట్లు తమ న్యూస్ అవుట్‌పుట్‌లో కూడా చాలా మార్పులు చేస్తున్నట్లు బీబీసీ ప్రకటించింది.
కానీ, ప్రస్తుతానికి టీవీ కార్యక్రమాలు మాత్రం ఒక స్టూడియో నుంచి ప్రసారం చేస్తున్నారు.
ఇలా ముందెప్పుడూ జరగలేదు, ఇది కష్టకాలం అని బీబీసీ డైరెక్టర్ ఆఫ్ న్యూస్ ఫ్రాన్ అన్స్‌వర్త్ అన్నారు.
"ప్రజా ఆరోగ్య అత్యవసర స్థితిలో విశ్వసనీయమైన, కచ్చితత్వంతో కూడిన సమాచారం చాలా ముఖ్యం. బీబీసీకి అందులో కీలక పాత్ర ఉంది" అని ఫ్రాన్ అన్నారు.
బీబీసీలో ప్రసారం అయ్యే కొన్ని కార్యక్రమాలు నిలిపివేశారు, కొన్ని కార్యక్రమాల సమయం మార్చారు. కరోనా వార్తలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బోసిపోయిన శాన్‌ఫ్రాన్సిస్కో వీధులు
శాన్‌ఫ్రాన్సిస్కో వీధులు ఎప్పుడూ లేనంత నిర్మానుష్యంగా మారాయి. ఎక్కువ మంది ఇళ్లలోనే ఉంటున్నారు.
కానీ, కొంతమంది ఇదే సమయంలో బయటకు వస్తున్నారు. ఖాళీగా ఉన్న రోడ్లపై పరుగులు తీస్తున్నారు.
జాగింగ్ లేదా వాకింగ్ చేసేవారు బయటకు వెళ్లవచ్చని నగర మేయర్ కూడా చెప్పారు. కానీ ఒకరికొకరు కాస్త దూరాన్ని పాటించాలని అన్నారు.
వ్యాపారాలు జరిగే వీధులు, రెస్టారెంట్లు, దుకాణాలు చాలావరకూ మూతపడ్డాయి. చాలా రెస్టారెంట్ల దగ్గర 'డెలివరీ ఓన్లీ' బోర్డులు పెట్టారు.
తీర ప్రాంతంలో ఉండే చాలా టెక్నాలజీ సంస్థలు తమ ఉద్యోగులకు ఇళ్ల నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించాయి. కానీ అందరూ తమ ఇళ్లలోనే ఉండాలని సూచించాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఆగిన సీఎన్ఎన్ ఫిలిప్పీన్స్ ప్రసారాలు
ఫిలిప్పీన్స్‌లో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు 'వర్క్ ఫ్రం హోమ్' చేయమని చెప్పాయి.
తమ ఉద్యోగుల్లోని ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో ఫిలిప్పీన్స్‌లోని సీఎన్ఎన్ చానల్ ప్రసారాలు ఆగిపోయాయి.

ఫొటో సోర్స్, EPA
ఆస్ట్రేలియాలో కొత్త చర్యలు
ఆస్ట్రేలియాలో ప్రస్తుతం 450కి పైగా కేసులు ఉన్నాయి. వారంలో ఈ కేసులు రెట్టింపు అయ్యాయి.
ప్రధాని స్కాట్ మారిసన్ ఉదయం తాము తీసుకున్న చర్యల గురించి మాట్లాడుతూ "మొదటి ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుంచి ఆస్ట్రేలియా ఇలాంటి జాతీయ అత్యవసర స్థితి ఎప్పుడూ చూడలేదు" అన్నారు.
వంద మందికి పైగా గుమిగూడే కార్యక్రమాలు నిషేధిస్తున్నట్లు చెప్పిన ఆయన, ఆస్ట్రేలియా వాసులు విదేశాలకు ప్రయాణించవద్దని కోరారు.
దేశానికి తిరిగి వచ్చే ఆస్ట్రేలియా వాసులు 14 రోజుల పాటు తమకు తాముగా విడిగా ఉండాలని ఆయన ఆదేశించారు.
మిగతా దేశాలన్నీ తమ సరిహద్దులు వేగంగా మూసేస్తూ ఉండడంతో తక్షణం స్వదేశానికి చేరుకోవాలని తమ దేశస్థులను కోరారు.
హాంకాంగ్‌లో పత్రికల కార్యాలయాలు మూత
తమ ఉద్యోగుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో చైనా ప్రముఖ పత్రికల్లో ఒకటైన ది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ హాంకాంగ్‌లో ఉన్న కార్యాలయాలు మూసివేసింది.
"ప్రస్తుతానికి మా ఉద్యోగులందరూ ఇంటి నుంచే పనిచేస్తున్నారు, మా ఆపరేషన్స్ అన్నీ ఆన్‌లైన్ అయ్యాయి" అని ఆ పత్రిక చెప్పింది.
ఆగ్నేయాసియాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
మంగళవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
"పరిస్థితి వేగంగా పెరుగుతోంది. వైరస్ మరింత ఎక్కువ మందికి సోకకుండా అడ్డుకోడానికి మనం వెంటనే అన్ని రకాల ప్రయత్నాలూ పెంచాలి" అని రీజనల్ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
వ్యాక్సిన్ తయారీ ప్రయత్నాలు వేగవంతం
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో దీనికి వ్యాక్సీన్ తయారీ ప్రయత్నాలు కూడా వేగవంతం అయ్యాయి. అమెరికాలోని పరిశోధకులు ప్రయోగాత్మక కరోనావైరస్ వ్యాక్సీన్ తొలి షాట్‌ను ఓ వ్యక్తికి ఇచ్చారు.
ప్రపంచం అంతా ఉత్సుకతతో ఎదురుచూస్తున్న, వేగంగా అభివృద్ధి చేసిన కరోనావైరస్ టీకా మొదటి దశ అధ్యయనం ప్రారంభమైందని సీటిల్‌లోని కైజర్ పర్మనెంటె వాషింగ్టన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు తెలిపినట్లు ఏపీ వార్త సంస్థ వెల్లడించింది.
ఓ పరీక్షా గదిలో 43ఏళ్ల జెన్నిఫర్ హాలర్ అనే మహిళ ఈ తొలి ఇంజెక్షన్ తీసుకున్నారు. జెన్నిఫర్ ఓ టెక్ కంపెనీలో ఆపరేషన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.
ఈ సమాజానికి ఉపయోగపడే పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఇదో అద్భుత అవకాశమని ఇద్దరు బిడ్డల తల్లైన హాలర్ అన్నారు.
ఎంఆర్ఎన్ఏ-1273 అని పిలుస్తున్న ఈ ప్రయోగాత్మక వ్యాక్సీన్‌ను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్), మసాచుసెట్స్‌కు చెందిన బయోటెక్నాలజీ కంపెనీ మోడర్నా ఇంక్ సంయుక్తంగా రూపొందించాయి.
"కరోనావైరస్‌ను ఎదుర్కోవడానికి మనందరం కలిసి పనిచేయాలి. ఆ అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు అందరూ తమ వంతు బాధ్యత నిర్వహించాలి" అని కైజర్ పెర్మనెంటె అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ లిసా జాక్సన్ అన్నారు.

అనవసరంగా ఇల్లు వదిలి బయటకు రావద్దు: ఇజ్రాయెల్ ఆదేశం
ఇజ్రాయెల్ ప్రభుత్వం దేశ ప్రజల మీద కొత్త ఆంక్షలు విధించింది. ఆహారం లేదా మందులు తెచ్చుకోవటానికి, వైద్య సేవల కోసం, అత్యవసర పనుల నిమిత్తం మినహా అనవసరంగా ఇళ్లు వదిలి బయటకు రావద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.
పార్కులు, ఆటస్థలాలు, బీచ్‌లు, ఈతకొలనులకు వెళ్లటాన్ని నిషేధించింది.
మరోవైపు ఉత్తర ఇజ్రాయెల్‌లోని ఒక ఆస్పత్రి నుంచి పారిపోయిన ఒక పురుష రోగి కోసం పోలీసులు రైళ్లను ఆపి కూడా తనిఖీలు చేసి ఎట్టకేలకు అతడిని అరెస్ట్ చేసి మరో ఆస్పత్రికి తరలించారు.
దేశంలో ఇప్పటివరకూ 324 కోవిడ్-19 కేసులు నిర్ధారితమయ్యాయి. అయితే ఎటువంటి మరణాలూ సంభవించలేదు.
ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో 41 కేసులు ఉన్నట్లు పాలస్తీనా అధికారులు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆఫ్రికా దేశాలకు విరాళంగా కరోనావైరస్ పరీక్ష కిట్లు ఇస్తానన్న జాక్ మా
చైనా బిలియనీర్, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా.. ఆఫ్రికాలోని ప్రతి దేశానికీ 20,000 కరోనావైరస్ టెస్ట్ కిట్లు, 1,00,000 మాస్కులు, 1,000 రక్షణ సూట్లు చొప్పున విరాళంగా ఇస్తానని ప్రకటించారు.
ఆయన ఈ నెల ఆరంభంలో అమెరికాకు వైద్య సరఫరాలు పంపించారు. యూరప్ వ్యాప్తంగా 20 లక్షల మాస్కులు పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు.
జర్మనీలో 50,000 ఫేస్ మాస్కులు దోపిడీ చేసిన దొంగలు
జర్మనీలోని ఒక ఆస్పత్రి క్లినిక్‌లకు సరఫరా చేయటానికి ఉద్దేశించిన 50,000 మాస్కులను దొంగలు దోపిడీ చేశారు.

ఫొటో సోర్స్, Reuters
స్పెయిన్‌లో విపరీతంగా పెరిగిన కొత్త కేసులు..
యూరప్‌లో ఇటలీ తర్వాత కరోనావైరస్ తీవ్రంగా విజృంభిస్తున్న స్పెయిన్‌లో గత 24 గంటల్లో దాదాపు 2,000 కొత్త కేసులు నిర్ధారితమయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11,178కి పెరిగాయి.
కరోనావైరస్ మరణాలు కూడా గణనీయంగా పెరిగాయి. సోమవారం నాటికి 342 మంది చనిపోతే మంగళవారం నాటికి ఆ సంఖ్య 491కి పెరిగింది.
ఇప్పటివరకూ ఈ వైరస్ సోకిన వారిలో 1,028 మంది కోలుకున్నట్లు అధికారులు చెప్పారు.
ప్రధానంగా మాడ్రిడ్ ప్రాంతంలోనే 43 శాతం కేసులు కేంద్రీకృతమై ఉన్నాయి. అక్కడే 355 మంది చనిపోయారు. దేశం మొత్తం అత్యవసర ప్రయాణాలు, కొనుగోళ్లకు మినహా అన్ని రకాలుగా దిగ్బంధనంలో ఉంది.

ఫొటో సోర్స్, PA Media
నేను పబ్‌కి వెళతాను: బ్రిటన్ ప్రధాని తండ్రి
కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించటానికి పబ్‌లు, క్లబ్‌లు, థియేటర్ల తదితర బహిరంగ ప్రదేశాలకు వెళ్లవద్దని, ప్రత్యేకించి 70 ఏళ్ల వయసు దాటిన వారికి ఎక్కువ ప్రమాదమని బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ చేసిన విజ్ఞప్తిని తాను పట్టించుకోనని ఆయన తండ్రి స్టాన్లీ జాన్సన్ సూచనప్రాయంగా చెప్పారు.
ఆయన వయసు 79 సంవత్సరాలు. ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నాకు అవసరమైతే నేను పబ్‌కి వెళతాను’’ అని స్టాన్లీ చెప్పారు. జనం పబ్‌లకు రాకూడదని భూస్వాములు కోరుకుంటారనీ ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, ANI
అమెరికా ఆర్థిక వ్యవస్థ సంక్షోభం దిశగా పయనిస్తున్నట్లుందని అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. చైనాలో పుట్టి, ప్రబలిన కరోనావైరస్ దీనికి కారణం అని ఆయన అభిప్రాయపడ్డారు.
"చూస్తుంటే అలానే ఉంది, స్టాక్ మార్కెట్‌లో, ఆర్థిక వ్యవస్థలో తీవ్రమైన డిమాండ్ నెలకొని ఉంది. దీన్ని అధిగమించగలిగితే, అనూహ్య మార్పులు చూడొచ్చు" అని ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ట్రంప్ అన్నారు.
అమెరికా ఆర్థిక వ్యవస్థ సంక్షోభం దిశగా వెళ్తోందా అని అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు.
కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు రెస్టారెంట్లు, ఇతర వ్యాపార సముదాయాలను మూసి ఉంచారు. ఈ చర్యల వల్ల నిరుద్యోగం పెరుగుతుందని, వినియోగదారుల కొనుగోళ్లు తగ్గాయని, దీనివల్ల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
డౌజోన్స్ సోమవారం 3000 పాయింట్లు నష్టపోయింది. అమెరికా స్టాక్ మార్కెట్ చరిత్రలోనే భారీ నష్టాల్లో ఇదొకటి.

ఫొటో సోర్స్, ANI
21ఏళ్ల స్పానిష్ ఫుట్‌బాల్ కోచ్ ఫ్రాన్సిస్కో గార్షియా కరోనావైరస్‌తో మరణించారు.
అథ్లెటికో పోర్టాడా అల్టా యువ జట్టుకు 2016 నుంచి ఫ్రాన్సిస్కో మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ దేశంలో కరోనావైరస్ బారినపడిన అత్యంత పిన్నవయస్కుడు ఈయనే.
"మా కోచ్ ఫ్రాన్సిస్కో మృతిపై ఆయన కుటుంబానికి, స్నేహితులకు మా సంతాపం వ్యక్తం చేస్తున్నాం. ఫ్రాన్సిస్కో, మీరు లేకుండా మేం ఇప్పుడు ఏం చేయాలి? మాకు ఎప్పుడు అవసరమైనా మీరు మా వెంట నిలబడ్డారు. మేం ఇప్పుడు మిగిలిన పనిని ఎలా పూర్తిచేయాలి? ఎలా చేయగలమో మాకు తెలియదు, కానీ మీకోసం మేం సాధిస్తాం. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేం" అని అథ్లెటికో పోర్టాడా అల్టా ఓ ప్రకటనలో తెలిపింది.
పాకిస్తాన్‌లో కరోనావైరస్ కేసులు 183కు చేరుకున్నాయి. సోమవారం సింధ్ ప్రాంతంలో 115, ఖైబర్ పక్తుంఖ్వాలో 15 కొత్త కేసులు నమోదయ్యాయి. పాకిస్తాన్‌లో ఒకరోజులో ఇన్ని కేసులు పాజిటివ్ రావడం ఇదే మొదటిసారి.
టఫ్తాన్ సరిహద్దుల నుంచి యాత్రికులను వెనక్కి తీసుకురావడమే కేసుల సంఖ్యలో పెరుగుదలకు కారణమైందని సింధ్ అధికారులు వెల్లడించారు.

- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు

కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఫ్రాన్స్ ప్రయాణ నిబంధనలు అమలుచేయాలని నిర్ణయించింది.
మంగళవారం నుంచి 30 రోజులపాటు యూరోపియన్ యూనియన్ దేశాలతో సరిహద్దులు, షెంజెన్ జోన్‌ను మూసివేస్తున్నట్లు అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మేక్రాన్ తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు 1,50,000 దాటాయి. 6500 మంది మరణించారు.


ఇవి కూడా చదవండి.
- కరోనావైరస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు- ఎలా సోకుతుంది? లక్షణాలు ఏంటి? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ అనుమానిత రోగులు ఆసుపత్రుల నుంచి ఎందుకు పారిపోతున్నారు?
- ఆంధ్రప్రదేశ్: ఎన్నికల కోడ్ వచ్చాక సర్వాధికారాలు ఎన్నికల సంఘం చేతుల్లోనే ఉంటాయా?
- డెబిట్-క్రెడిట్ కార్డులతో ఆన్‌లైన్ లావాదేవీలకు కొత్త నిబంధనలు... ఇవాళ్టి నుంచే అమలు
- తెలంగాణ శాసనసభ: సీఏఏ వ్యతిరేక తీర్మానానికి ఆమోదం
- కరోనావైరస్- పారాసిటమాల్: ఏపీ సీఎం వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్స్
- పెళ్లికి ముందు అమ్మాయిని మళ్లీ కన్యగా మార్చే సర్జరీలు ఎందుకు?
- వాస్ప్-76బి: ఇనుము వర్షంలా కురిసే ఈ గ్రహం ఓ నిప్పుకణిక.. పగటి ఉష్ణోగ్రత 2,400 సెంటీగ్రేడ్లు
- ఆంధ్రప్రదేశ్: మాన్సాస్ ట్రస్ట్ వివాదం ఏంటి? సంచయిత నియామకంపై అశోక్ గజపతిరాజు న్యాయపోరాటానికి నేపథ్యం ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









