కరోనావైరస్: శశిథరూర్ మెడలోని ఈ గాడ్జెట్ వైరస్‌లను అడ్డుకుంటుందా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అరుణ్ శాండిల్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
బీజేపీ ఎంపీ హేమామాలినితో మాట్లాడుతున్న కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను చూశారా..
పార్లమెంటు ఆవరణలో వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో ఏమో కానీ ఆయన మెడలో ఉన్న గాడ్జెట్‌ను ఓసారి చూడండి.
కొద్ది నెలలుగా శశి థరూర్ ఆ గాడ్జెట్ లేకుండా బయటకు అడుగుపెట్టడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలకూ ఆయన ఈ గాడ్జెట్ మెడలో వేసుకునే హాజరవుతున్నారు.
చూడ్డానికి సెల్‌ఫోన్‌లా కనిపిస్తున్న ఈ గాడ్జెట్ మీలో కొందరికి తెలిసి ఉండొచ్చు.. కానీ, ఎంతోమంది ఇదేంటో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.
కొందరైతే ఏకంగా ఆయన్నే అడుగుతున్నారు సోషల్ మీడియాలో. దానికి ఆయన సమాధానం ఇచ్చారు కూడా.

ఫొటో సోర్స్, Getty Images
శశిథరూర్ మెడలో కనిపిస్తున్న ఈ గాడ్జెట్ ఎయిర్ ప్యూరిఫయర్. దీన్నే నెగటివ్ అయోనైజర్ అని కూడా పిలుస్తారు.
ఒక్క మాటలో చెప్పాలంటే పర్సనల్ ఎయిర్‌ప్యూరిఫయర్. దీన్ని తయారుచేసిన సంస్థ పేరుతో ఎయిర్ టేమర్ అని కూడా అంటున్నారు.
అవును, పెరుగుతున్న వాయుకాలుష్య ప్రభావం నుంచి రక్షించుకోవడానికి ఇటీవల కాలంలో ఇళ్లలో, ఆఫీసుల్లో, చివరికి కార్లలో కూడా ఎయిర్‌ప్యూరిఫయర్ల వాడకం పెరిగింది.
కానీ, మనది కాని ప్రదేశానికి వెళ్లినప్పుడో, బహిరంగ ప్రదేశాలకు వెళ్తున్నప్పుడో ఈ ఎయిర్‌ప్యూరిఫయర్లను వెంట తీసుకెళ్లడం కుదరదు కదా. ఆ సమస్యకు పరిష్కారమే ఈ ఎయిర్ టేమర్లు.
ల్యాండ్ ఫోన్ల తరువాత మొబైల్ ఫోన్లు వచ్చి ప్రతి ఒక్కరి చేతికి చేరినట్లే ఇప్పుడీ ఎయిర్ టేమర్ల వాడకం కూడా మెల్లమెల్లగా పెరుగుతోంది.

ఫొటో సోర్స్, facebook/shashiTharoor
ముఖ్యంగా వాయు కాలుష్యం అధికంగా ఉండే ఆసియా దేశాల్లోని నాయకుల మెడల్లో ఇవి కనిపిస్తున్నాయి. వైరస్‌లు సోకకుండా ఇది కాపాడుతుందన్న ఉద్దేశంతోనూ వీటిని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో దీని వినియోగం ప్రాధాన్యం సంతరించుకుంటోంది.
ఫిబ్రవరిలో పార్లమెంటు సమావేశాలు జరిగిన సమయంలోనే @MATTSMATTS అనే ఒక నెటిజన్ ట్విటర్ వేదికగా శశిథరూర్‌ను దీని గురించి అడిగారు.
మెడలో ఈ గాడ్జెట్ వేసుకున్న శశిథరూర్ ఫొటోను ట్వీట్ చేసి 'ఈ గాడ్జెట్ ఏమిటి థరూర్ గారూ' అంటూ ఆయన్నే ట్యాగ్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
దానికి స్పందించిన థరూర్ ''అది ఎయిర్ ప్యూరిఫయర్(నెగటివ్ అయోనైజర్). దిల్లీ గాలిలో శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది. తిరువనంతపురంలో ఉంటే నాకిది అవసరం లేదు'' అని సమాధానం ఇచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఇతర దేశాలకు చెందిన కొందరు నాయకులూ ఇలాంటివి వినియోగించిన దాఖలాలు కనిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
భారత రాష్ట్రపతి, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి భేటీ సమయంలో..
గత ఏడాది(2019) అక్టోబరు మూడో వారంలో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఫిలిప్పీన్స్‌లో అయిదు రోజులు పర్యటించారు. అందులో భాగంగా రాష్ట్రపతి కోవింద్, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్ట్ భేటీ అయ్యారు.
ఆ సందర్భంగా మీడియాకు విడుదల చేసిన ఫొటోల్లో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు డ్యూటెర్ట్ మెడలో ఎయిర్ టేమర్ కనిపించింది.
రోడ్రిగో అంతకు కొద్ది రోజుల ముందు నుంచి దీన్ని వాడుతుండడం.. భారతదేశ అధ్యక్షుడి రాక సందర్భంలోనూ ఈ పరికరంతో కనిపించడంతో మీడియా దృష్టి పడింది. దీంతో రోడ్రిగో అధికార ప్రతినిధి సాల్వడార్ పానెలో దీనిపై వివరణ ఇచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
అది ఒక ఎయిర్ ప్యూరిఫయర్ అని.. జలుబు, దగ్గు ఉన్నవారెవరైనా తన చుట్టూ ఉంటే వారి నుంచి వైరస్, బ్యాక్టీరియా అధ్యక్షుడికి సోకకుండా ఇది కాపాడుతుందని సాల్వడార్ పానెలో మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆ తరువాత కూడా రోడ్రిగో ఈ పరికరంతో కనిపిస్తున్నారు.
‘వైరస్, బ్యాక్టీరియాల నుంచి రక్షణ’
ఎయిర్‌టేమర్ సంస్థ వెబ్‌సైట్ ప్రకారం ఈ 'పర్సనల్ ఎయిర్ ప్యూరిఫయర్', దాన్ని వినియోగించేవారి చుట్టూ ఉన్న గాల్లోని కలుషితాలను తొలగిస్తుంది. ధూళితో పాటు, పొగ, దుర్వాసనలు, వైరస్, బ్యాక్టీరియాలనూ ఇది తొలగిస్తుంది.
2019లో నిర్వహించిన కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో(సీఈఎస్-2019)లో దీన్ని ప్రదర్శించారు.
ఈ పరికరం ఉన్న మూడు అడుగుల పరిధిలో ఇది పనిచేస్తుందని సంస్థ చెబుతోంది.
దీన్ని ఒక ట్యాగ్ సహాయంతో మెడలో వేసుకోవచ్చు. ఇది తేలిగ్గానే ఉంటుంది.
ఒక సారి చార్జింగ్ చేస్తే 40 గంటల కంటే ఎక్కువ సమయం పనిచేస్తుంది. దీని ధర అందులోని ఫీచర్లను బట్టి మారుతుంది.
ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో ఉన్న ఈకామర్స్ వెబ్‌సైట్లలోనూ రూ.8 వేలు, ఆపైన ధరల్లో దొరుకుతోంది.
కరోనా నుంచి కాపాడుతుందా?
అయితే, ఈ గాడ్జెట్ కరోనా వైరస్ నుంచి కాపాడుతుందా అన్న కోణంలో ఇంతవరకు వైద్యపరమైన అధ్యయనాలేమీ జరగలేదు.
వైరస్, బ్యాక్టీరియాలను దరిచేరనివ్వదని విక్రయ సంస్థ ఎయిర్‌టేమర్ చెబుతున్నప్పటికీ ఎలాంటి వైరస్‌లను అడ్డుకోగలదు.. ఏ స్థాయి వరకు అడ్డుకోగలదన్న విషయంలో స్పష్టత ఇవ్వలేదు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌ను భయపెడుతున్న వాయు కాలుష్యం
భారత్‌లో వాయు కాలుష్య తీవ్రత అధికంగా ఉంది. ముఖ్యంగా చలికాలంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటోంది.
2019 నవంబరులో దిల్లీలో వాయుకాలుష్యం తారస్థాయికి చేరడంతో ముఖ్యమంత్రే ఆ నగరాన్ని గ్యాస్ చాంబర్‌తో పోల్చారు.
ఊపిరితిత్తుల క్యాన్సర్, హృద్రోగాల వల్ల కలిగే మరణాల్లో 33 శాతం వాయు కాలుష్యం వల్లే సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
దిల్లీలో వాయునాణ్యత పూర్తిగా క్షీణించడంతో 2019 నవంబరులో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించారు.
వాయు కాలుష్యం హానికర స్థాయిని దాటిపోవడంతో ప్రజలు వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని.. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం సమయాల్లో బయటకు రావొద్దని, కాలుష్య నివారణ మాస్కులు ధరించాలని, కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాలకు వెళ్లొద్దని.. ఇళ్లలో ఉన్నప్పుడు కూడా తలుపులు, కిటికీలు మూసి ఉంచాలని అధికారులు, ప్రభుత్వంలోని నాయకులు సూచించారు.
స్కూళ్లకు సెలవులిచ్చారు.. సామాజిక ఎయిర్ ప్యూరిఫయర్లు అమర్చారు.. ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు.. హెలికాప్టర్లతో చెట్లపై నీళ్లు చల్లారు.. ఆడ్-ఈవెన్ విధానం మళ్లీ అమలు చేసి వాహన కాలుష్యాన్ని నివారించే యత్నం చేశారు. ఇలా, ఎన్నో చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఫొటో సోర్స్, Getty Images
ఒక్క దిల్లీ మాత్రమే కాదు దాని చుట్టూ ఉన్న గుర్‌గావ్, నోయిడా, ఫరీదాబాద్, ఘజియాబాద్, భివాడిలు కూడా ప్రపంచంలోని అత్యంత కలుషిత ప్రాంతాల జాబితాలో ఉన్నాయి.
2018లో గ్రీన్‌పీస్ అధ్యయనం ప్రకారం, ప్రపంచంలోని 30 అత్యంత కలుషితమైన నగరాల్లో 22 భారత్‌లోనివే.

ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- దిల్లీలో అలర్లు చేయించేందుకు ముస్లింలకు డబ్బులు పంచారా? : Fact Check
- దిల్లీ హింస: వదంతులు ఎంత భయంకరమైనవంటే...
- కరోనావైరస్ నుంచి రక్షణ కల్పిస్తామంటూ తప్పుడు ప్రచారం.. లక్షలాది ఉత్పత్తుల్ని తొలగించిన అమెజాన్
- నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- బాంబే డక్: ‘భారతదేశ చేపల్లో అద్భుతమైన చేప’
- అండర్-19 ప్రపంచకప్ సెమీస్ హీరో యశస్వి జైశ్వాల్... పగలంతా ప్రాక్టీస్, రాత్రి పానీపూరీ అమ్మకం
- పిల్లల్ని కనడానికి సరైన వయసు ఏది?
- కరోనావైరస్ ఎఫెక్ట్: పడిపోతున్న బీర్ల అమ్మకాలు... డెటాల్‌కు పెరుగుతున్న గిరాకీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









