ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో కరోనావైరస్ వ్యాప్తి ఎలా ఉంది?

కరోనావైరస్ హెల్ప్ డెస్క్

తెలంగాణలో సోమవారం మరో కరోనా కేసు నిర్ధరణ అయింది. దీంతో తెలంగాణలో కరోనా వచ్చిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. అయితే, అందులో మొట్టమొదటి వ్యక్తికి చికిత్స ఫలించి వ్యాధి తగ్గడంతో ఇప్పటికే ఇంటికి పంపేశారు. మిగతావారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

క్వారంటైన్ కేంద్రంగా గచ్చిబౌలి స్టేడియంను మార్చబోతున్నారు. ఒకవేళ వ్యాధిగ్రస్తులు పెద్ద సంఖ్యలో వచ్చినా ఇబ్బంది లేకుండా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కేసులు నమోదు కాలేదు. ఇటీవల నెల్లూరులో బయటపడిన కేసులో వ్యక్తికి చికిత్స అందిస్తున్నారు.

తెలంగాణలో పలుచోట్ల ఫలానా వారికి కరోనా వచ్చిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి.

ఎవరితోనూ కలవకుండా ఉంచడం కోసం కాస్త అనుమానం ఉన్న వారిని వైద్య ఆరోగ్య శాఖ అంబులెన్సుల్లో తీసుకువెళ్లి ఆసుపత్రుల్లో చేరుస్తోంది. దీంతో అలా తీసుకువెళ్లిన అందరికీ కరోనా ఉందేమోనన్న భావనతో ఈ వార్తలు వ్యాపింపచేస్తున్నారు.

వాట్సప్, టిక్‌టాక్‌లలో ఫోటోలు, వీడియోలు, మెసేజీలూ పెడుతున్నారు. కొందరైతే ఏకంగా అనుమానితుల పేర్లను కూడా బాధితుల్లాగా ప్రకటించేస్తున్నారు. ఇలాంటివి సహించేది లేదనీ, వారిపై కేసులు నమోదు చేస్తామనీ అధికారులు తెలిపారు.

ఆంధ్రలో కరోనా వల్ల స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారు. ఇది వివాదాస్పదం అయింది. తాము కరోనాను ఎదుర్కోగలమని, ఎన్నికలు నిర్వహించవచ్చనీ, ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఇక కరోనాను సులువుగా ఎలా ఎదుర్కోవచ్చో ఆదివారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విలేకర్ల సమావేశంలో చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో వివాదాస్పదం అవుతోంది.

అటు హైదరాబాద్ నగరంలో మార్చి 31 వరకూ అన్ని బడులకూ, సినిమా హాళ్లకూ, జనం పోగయ్యే అవకాశం ఉన్న కార్యక్రమాలకూ అనుమతులు రద్దు చేశారు. పెళ్లిళ్లు తక్కువ మందితో చేసుకోవాలని సూచించింది ప్రభుత్వం. కొత్తగా ఫంక్షన్ హాల్ బుకింగ్‌లను అనుమతించవద్దని సూచించింది.

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి

తెలంగాణలో కరోనా పరిస్థితి

ఆసుపత్రుల్లో అబ్జర్వేషన్లలో ఉంచిన వారు: 395 (సోమవారం - 19)

ఇంట్లో అబ్జర్వేషన్లో ఉంచిన వారు: 868 (సోమవారం 35)

ఇప్పటి వరకూ పరీక్షించిన శాంపిళ్లు: 395 (సోమవారం 19)

వ్యాధి నిర్ధరణ అయిన వారు: 4 (సోమవారం 1)

వ్యాధి లేదని తేలిన వారు: 369

ఫలితాలు రావాల్సినవి: 22

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

విదేశాల నుంచి స్క్రీనింగ్

శంషాబాద్ విమానాశ్రయంలో: మొత్తం ఆదివారం వరకు 63,181 మందిని పరీక్షించారు. ఆదివారం ఒక్క రోజే 3,151 మందిని పరీక్షించారు.

స్వచ్ఛందంగా వచ్చిన వారు మొత్తం 850 మంది, ఆదివారం ఒక్క రోజు 22 మంది.

ఇతర ప్రభుత్వ సంస్థలు రిఫర్ చేసిన వారు మొత్తం 412 మంది, ఆదివారం ఒక్క రోజు 63 మంది.

ఇప్పటి వరకూ ఉన్న అనుమానితులు: మొత్తం 1262, ఆదివారం ఒక్క రోజు 85 మంది.

ఇన్హేలర్ పీలుస్తున్న అమ్మాయి

ఫొటో సోర్స్, Getty Images

ఆంధ్రలో కరోనా పరిస్థితి

అబ్జర్వేషన్‌లో ఉంచిన మొత్తం సంఖ్య: 837

ఇరవై ఎనిమిది రోజుల అబ్జర్వేషన్ పూర్తి చేసుకున్నవారు: 250

ఆసుపత్రుల్లో అబ్జర్వేషన్లలో ఉంచిన వారు: 35

ఇంట్లో అబ్జర్వేషన్లో ఉంచిన వారు: 552

ఇప్పటి వరకూ పరీక్షించిన శాంపిళ్లు: 89

వ్యాధి నిర్ధారణ అయిన వారు: 1

వ్యాధి లేదని తేలిన వారు: 75

ఫలితాలు రావాల్సినవి: 13

విదేశాల నుంచి వచ్చిన వారి స్క్రీనింగ్ వివరాలు ఇంకా అందాల్సి ఉంది.

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)