కరోనావైరస్ టెన్షన్: టాయిలెట్ పేపర్లను జనం వేలం వెర్రిగా ఎందుకు కొంటున్నారు?

టాయిలెట్ పేపర్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఫ్రాన్సెస్ మావో
    • హోదా, బీబీసీ న్యూస్, సిడ్నీ

ప్రపంచం అంతమయ్యే పరిస్థితుల్లో అత్యంత దారుణమైన దుస్థితి.. టాయిలెట్‌లో చిక్కుకుపోయి.. అక్కడి నుంచి అడుగు బయటపెట్టలేని పరిస్థితి కావచ్చు.

ఇప్పుడు ఆస్ట్రేలియన్లు చాలా మందిని ఈ పీడకల పీడిస్తున్నట్లు కనిపిస్తోంది. వీళ్లు కరోనావైరస్ భయంతో టాయిలెట్ పేపర్‌ను పెద్ద ఎత్తున కొని ఇళ్లలో గుట్టలుగా పెట్టేసుకుంటున్నారు.

టాయిలెట్ పేపర్‌కి ఎలాంటి కొరతా లేదని అధికారులు గట్టిగా చెప్తున్నా కూడా ఈ కొనుగోళ్లు తగ్గటం లేదు.

దేశంలోని అతి పెద్ద నగరమైన సిడ్నీలోని సూపర్‌మార్కెట్లలో టాయిలెట్ పేపర్ అరలు నిమిషాల్లో ఖాళీ అయిపోతున్నాయి. దీంతో ఒక మార్కెట్ చైన్.. మనిషికి నాలుగు టాయిలెట్ పేపర్ ప్యాకెట్లు మాత్రమే అమ్ముతామనే నిబంధన కూడా పెట్టాల్సి వచ్చింది.

ఇక సోషల్ మీడియాలో సైతం బుధవారం నాడు #toiletpapergate, #toiletpapercrisis హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండయ్యాయి. టాయిలెట్ పేపర్ రోల్స్‌ను ఆన్‌లైన్‌లో వందల డాలర్లకు అమ్ముతున్నారు. ఇంకొంతమంది ఈ రోల్స్ గెలవటానికి రేడియో స్టేషన్లకు ఫోన్‌లు చేసే పోటీల్లో పాల్గొంటున్నారు.

పరిస్థితి గత 48 గంటల్లో ఎలా మారిపోయిందంటే.. పబ్లిక్ టాయిలెట్లలోని పేపర్‌ని కూడా జనం దొంగిలిస్తున్నారు.

ఎందుకిలా? అసలు ఏం జరుగుతోంది? జనం ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు?

ఆస్ట్రేలియాలో టాయిలెట్ పేపర్ కొనుగోళ్లు

ఫొటో సోర్స్, KATHERINE QUIRKE/TWITTER

ఫొటో క్యాప్షన్, ఆస్ట్రేలియా మార్కెట్లలో టాయిలెట్ పేపర్ కొనుగోళ్లు అమాంతం పెరిగిపోయాయి

భయం.. భయం...

ఈ టాయిలెట్ పేపర్ సమస్య ఒక్క ఆస్ట్రేలియాకు మాత్రమే పరిమితమైనది కాదు. వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉన్న సింగపూర్, జపాన్, హాంగ్ కాంగ్ వంటి ఇతర దేశాల్లోనూ ఇటువంటి పరిస్థితి తలెత్తింది.

గత నెలలలో హాంగ్ కాంగ్‌లో జనం భయంతో వెర్రిగా కొనుగోళ్లు చేయటంతో టాయిలెట్ పేపర్ కొరత తలెత్తింది. దీంతో సాయుధ దుండగులు దోపిడీకి దిగి టాయిలెట్ పేపర్ దోచుకున్నారు. అమెరికాలోనూ టాయిలెట్ పేపర్ల కొనుగోళ్లు పెరిగాయనే వార్తలు వస్తున్నాయి.

ఆస్ట్రేలియాలో గత వారాంతంలో కొత్తగా కోవిడ్-19 కేసులు బయటపడటం, దేశంలో ఈ వ్యాధి వల్ల తొలి మరణం సంభవించిందన వార్తలు రావటంతో భయం దావానలంలా వ్యాపించి.. వెర్రిగా కొనుగోళ్లు మొదలయ్యాయి.

ఆస్ట్రేలియాలో బుధవారం నాటికి 41 కేసులు కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఒకరు చనిపోయారు. ఇతర దేశాలతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువే.

ప్రజలు మంచి పరిశుభ్రత పాటించాలని, చేతులు శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. జనం అవసరమని భావిస్తే రెండు వారాలకు సరిపడా ఆహారం, మంచినీళ్లు, ఇతరత్రా అవసరమైన సరుకులను నిల్వ చేసుకోవచ్చునని కూడా సూచించింది.

దీంతో, ఎక్కువ కాలం నిల్వ చేసుకోగల ఆహారం, సరకుల కన్నా ముందుగా టాయిలెట్ పేపర్‌కి డిమాండ్ పెరిగిపోయింది.

జనం టాయిలెట్ పేపర్లను లాక్కుంటున్న, ట్రాలీల మీద గుట్టలుగా పెట్టుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్టుల్లో కనిపించాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఈ వార్తల నేపథ్యంలో భయాందోళనలతో కొనుగోళ్లు చేయవద్దంటూ ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు.

''ఈ సమయంలో సూపర్‌మార్కెట్లలో లావెటరీ పేపర్ మొత్తం ఖాళీ చేయటం తగిన, తెలివైన పని కాదని ప్రజలకు భరోసా ఇవ్వటానికి నేను ప్రయత్నిస్తున్నాను'' అని ఆస్ట్రేలియా ప్రధాన వైద్యాధికారి డాక్టర్ బ్రెండన్ మర్ఫీ పార్లమెంటులో వ్యాఖ్యానించారు.

కోల్స్, వూల్స్‌వర్త్స్ సూపర్‌మార్కెట్లు తమ వద్ద చాలా నిల్వలు ఉన్నాయని చెప్పాయి. క్లీనెక్స్ టాయిలెట్ పేపర్ తయారీ సంస్థ.. డిమాండ్ తీర్చటం కోసం తాము 24 గంటలూ ఉత్పత్తి కొనసాగిస్తున్నామని తెలిపింది.

వైరస్‌ను నియంత్రించటానికి దేశం సంసిద్ధంగా ఉందని, అన్ని చర్యలూ చేపడుతోందని ప్రభుత్వం పేర్కొంది. స్థానికంగా వైరస్ వ్యాపిస్తున్న కేసులు ఇప్పటివరకూ చాలా అరుదుగానే ఉన్నాయి.

అయినా, కానీ టాయిలెట్ పేపర్ వేలం వెర్రి కొనుగోళ్లు కొనసాగుతూనే ఉన్నాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

మంద మనస్తత్వం...

ఇది ఆస్ట్రేలియన్లు పుట్టించిన అతి తెలివితక్కువ సంక్షోభం అని కొంతమంది అభివర్ణిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని నిరోధించటానికి తోడ్పడేది మెడిసిన్, మాస్కులు, హ్యాండ్ సానిటైజర్లని.. టాయిలెట్ పేపర్‌తో వైరస్ మీద ఎలా పోరాడతారని ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ ప్రవర్తన అవివేకమైనదేననటంలో సందేహం లేదని వినియోగదారుల మనస్తత్వ నిపుణులు చెప్తున్నారు. ఇది సోషల్ మీడియా, వార్తా కథనాలు ప్రేరేపించిన 'మూక మనోప్రవృత్తి'కి స్పష్టమైన ఉదాహరణ అని పేర్కొన్నారు.

ఫోమో సిండ్రోమ్ - ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ - అంటే.. తమకు మిగలకుండా పోతుందనే భయం చాలా తీవ్రంగా పనిచేస్తోందని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ అసోసియేట్ ప్రొఫెసర్ నితికా గార్గ్ విశ్లేషించారు.

''ఈ మనిషి దీనిని కొంటున్నారు.. నా పొరుగువారు కొంటున్నారు. అంటే, దానికి ఏదో కారణం ఉండి ఉంటుంది. నేను కూడా కొనాలి' అనే ఆలోచన వస్తుందని ఆమె బీబీసీతో చెప్పారు.

టాయిలెట్ పేపర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆస్ట్రేలియా సూపర్‌మార్కెట్లలో టాయిలెట్ పేపర్లు నిమిషాల్లోనే ఖాళీ అవుతున్నాయి

చాలా ఆసియా దేశాల్లోనూ ఇదే తరహా వెర్రి కొనుగోళ్లు జరిగాయని ప్రొఫెసర్ గార్గ్ ఉదహరించారు. చైనాలో కూడా టాయిలెట్ పేపర్‌ను నిల్వ చేసుకుంటున్నారని.. టిష్యూలు, నాప్కిన్లకు ప్రత్యామ్నాయంగా దీనిని ఉపయోగించవచ్చుననే ఆలోచన ఇందుకు కారణమని చెప్పారు. ఈ పేపర్‌తో తాత్కాలిక మాస్కులను కూడా తయారు చేసుకోవచ్చునని భావిస్తారన్నారు.

అయితే.. ఆస్ట్రేలియాలో టాయిలెట్ పేపర్‌కు డిమాండ్ పెరిగిపోవటానికి కారణం దానిని వైద్య వనరుగా ఉపయోగించుకోవచ్చుననే ఆలోచన కాదన్నారు. ఇక్కడ కొనుగోళ్లు భయంతో జరుగుతున్నాయని.. ఇది మునుపెన్నడూ కనిపించని పరిస్థితని ఆమె చెప్పారు.

ఆస్ట్రేలియన్లు గతంలో దావానలం, తుపాను వంటి ప్రకృతి విపత్తుల కారణంగా ఇంటి సరకులు కొని నిల్వ చేసుకున్నారు. అదికూడా కొన్ని సమాజాలకు పరిమితమైంది.

''కానీ కరోనావైరస్ విషయానికి వస్తే.. పరిస్థితులు ఎలా మారతాయి.. ఎంత తీవ్రంగా దిగజారుతాయి అనేది జనానికి తెలియదు. అలాంటి పరిస్థితులకు సంసిద్ధంగా ఉండాలని భావిస్తారు'' అంటారు ప్రొఫెసర్ గార్గ్.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

ఈ కొనుగోళ్లు.. పట్టణీకరణ చెందిన సమాజానికి, ఆధునిక సౌకర్యాలకు అత్యంత ప్రాధాన్యం ఉండే జీవనశైలికి ప్రతిఫలనమని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీకి చెందిన వినియోగదారుల నిపుణుడు డాక్టర్ రోహన్ మిల్లర్ భావిస్తున్నారు.

''కొరతలు, కరవులు మనకు అలవాటు లేదు. మనకు ఎప్పుడు, ఏది కావాలనుకుంటే దానిని ఎంచుకుని తెచ్చుకోవటానికి అలవాటుపడ్డాం. ఆ పరిస్థితిని కొనసాగించాలనే మూక మనోప్రవృత్తే ఇలా వెర్రిగా టాయిలెట్ పేపర్ కొనటం'' అని ఆయన వ్యాఖ్యానించారు.

''ఆహారం, తాగునీరు వంటి ఇతర నిత్యావసరాలతో పోలిస్తే టాయిలెట్ పేపర్ అనేది నిజంగా లెక్కలోకి రాదు. కానీ.. జనం అది కనీస జీవన ప్రమాణంగా పరిగణిస్తున్నారు'' అని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)