డబ్ల్యూహెచ్ఓ: కరోనావైరస్ ప్రపంచవ్యాప్త మహమ్మారి.. ఏప్రిల్ 15 వరకు వీసాలు సస్పెండ్ చేసిన భారత్.. ఆ దేశాల నుంచి వచ్చేవారంతా 14 రోజులు నిర్బంధంలోనే

ఫొటో సోర్స్, BSIP
కరోనావైరస్‌ను ప్రపంచవ్యాప్త మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
చైనా బయట కరోనావైరస్ కేసులు గత రెండువారాల్లో 13 రెట్లు పెరిగాయని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ డాక్టర్ టెడ్రాస్ అద్నామ్ గ్యాబ్రియేసస్ తెలిపారు.
వైరస్ నియంత్రణలో నిష్క్రియాపరత్వం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు.
ఈ వైరస్‌ను సమర్థంగా అరికట్టవచ్చని, నియంత్రించవచ్చని చాలా దేశాలు నిరూపించాయని ఆయన తెలిపారు. అత్యవసరంగా తీవ్ర చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాలను కోరారు.
ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూనే వినాశనాన్ని తగ్గిస్తూ, మానవ జీవితాలను కాపాడాలంటూ ఆయన పిలుపునిచ్చారు.
"మనం ప్రపంచంలోని పౌరులందరినీ కాపాడాలి. మనం ఆ పని చేయగలం" అని ఆయనన్నారు.
మహమ్మారి అంటే..
ఏకకాలంలో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రజలకు ముప్పుగా పరిణమించే అంటు రోగాల తీవ్రతను చెప్పడానికి ఈ పదాన్ని వాడతారు.
ఇటీవలి కాలంలో చూస్తే 2009లో ఒక్కసారిగా విజృంభించిన స్వైన్ ఫ్లూను మహమ్మారిగా చెప్పవచ్చు. అప్పుడు ఈ వ్యాధి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
అంతవరకు గుర్తించని కొత్త వైరస్‌లు, ఒకరి నుంచి మరొకరికి సులభంగా సోకేవి మహమ్మారులుగా మారతాయి. కరోనా వైరస్ ఈ కోవలోకే వస్తోంది.
దీన్ని నివారించడానికి ఇంకా వ్యాక్సిన్లు కానీ, నయం చేయడానికి సమర్థమైన చికిత్సలు కానీ ఇంకా అందుబాటులోకి రానందున దీని వ్యాప్తిని అరికట్టలేకపోతున్నారు.

- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ సోకితే మనిషి శరీరానికి ఏమవుతుంది?
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు


ఫొటో సోర్స్, Getty Images
మహమ్మారి అని ఎప్పుడు ప్రకటిస్తారు?
ఇది ప్రజల్లో ఒకరి నుంచి మరొకరికి వేగంగా సోకుతుండడమే కాకుండా చైనా పొరుగు దేశాలంతటా, వాటిని దాటి ఇతర దేశాలకూ వ్యాపించింది.
ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో, అక్కడి సమాజాల్లో ఇది తరచూ ప్రబలుతున్నట్లుగా గుర్తిస్తే మహమ్మారిగా పేర్కొంటారు.
ప్రతి మహమ్మారీ దేనికది భిన్నమని.. దాని ప్రభావాన్ని అంచనా వేయడం అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు. గతంలో ప్రబలిన సార్స్ వంటి వైరస్‌లతో పోల్చితే కరోనా అంత ప్రాణాంతకమైనది కాదన్నది నిపుణుల మాట.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
భారత ప్రభుత్వం ఏం చేసింది?
కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు భారత ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొన్ని మార్గదర్శకాలు, ఆదేశాలను జారీ చేసింది.
1. ప్రస్తుతం ఉన్న అన్ని వీసాలు (డిప్లొమేటిక్, అఫీషియల్, ఐరాస, అంతర్జాతీయ సంస్థలు, ఉద్యోగ, ప్రాజెక్టు వీసాలు తప్ప) ఏప్రిల్ 15 వరకూ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది మార్చి 13 నుంచి అమల్లోకి వస్తుంది.
2. ఓసీఐ కార్డుదారులకు ఉన్న వీసా-ఫ్రీ ప్రయాణ సౌకర్యాన్ని ఏప్రిల్ 15 వరకు నిలుపివేసింది. 13 మార్చి 2020 నుంచి ఇది అమల్లోకి వస్తుంది.
3. అత్యవసరంగా భారత్ సందర్శించాలనుకునే ఏ విదేశీయుడైనా తమ సమీప భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలి.
4. చైనా, ఇటలీ, ఇరాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీల నుంచి ఫిబ్రవరి 15 తర్వాత వచ్చిన భారతీయులు లేదా విదేశీయులను 14 రోజుల పాటు క్వారంటైన్ చేస్తారు.
5. భారత పౌరులతో సహా భారత్‌కు వచ్చే విదేశీయులు అత్యవసరం కాని తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. అలా ఎవరైనా భారత్‌కు వస్తే వారిని కనీసం 14 రోజుల పాటు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచుతారు.
6. భారత పౌరులు అత్యవసరం కాని విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి. వారు తిరిగివచ్చిన తర్వాత కనీసం 14 రోజుల పాటు ప్రత్యేక పర్యవేక్షణలో ఉండాల్సి వస్తుంది.
7. అంతర్జాతీయ సరిహద్దుల ద్వారా దేశంలోకి ప్రవేశించడానికి కొన్ని ప్రత్యేక చెక్ పోస్టుల వద్ద మాత్రమే అనుమతిస్తారు. అక్కడ కూడా భారీ స్క్రీనింగ్ ఏర్పాట్లు ఉంటాయి. వీటిని హోంమంత్రిత్వ శాఖ వెల్లడిస్తుంది.
8. ఇటలీలో ఉన్న విద్యార్థులు, కారుణ్య కేసులను పర్యవేక్షించడానికి ఏర్పాట్లు చేసింది. నమూనాల సేకరణ తదనుగుణంగా జరుగుతుంది. ఈ పరీక్షల్లో నెగటివ్ వచ్చినవారు భారత్‌కు తిరిగిరావచ్చు. కానీ వారు కూడా కనీసం 14రోజుల పాటు ప్రత్యేక పర్యవేక్షణలో ఉండాలి.

కరోనావైరస్ లక్షణాలు
కరోనా వైరస్ చాలా సాధారణంగా ఉంటుంది.
శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది, దగ్గు లేదా ముక్కు కారడం లాంటి ప్రారంభ లక్షణాలతో దానిని గుర్తించవచ్చు.
కానీ కరోనా కుటుంబానికే చెందిన సార్స్(సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్), మర్స్(మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వంటి కొన్ని వైరస్‌లు చాలా ప్రమాదకరం.
ఇది కరోనా కుటుంబానికి చెందిన కొత్త జాతి వైరస్. దీనిని ఇంతకు ముందు వరకూ మనుషుల్లో గుర్తించలేదు.
కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కేసుల వల్ల ఇది జ్వరంతో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. తర్వాత పొడి దగ్గు తీవ్రంగా ఉంటుంది.
వారం వరకూ అదే పరిస్థితి కొనసాగితే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మొదలవుతాయి.
కానీ సీరియస్ కేసుల్లో ఇన్ఫెక్షన్ న్యుమోనియా లేదా సార్స్‌గా మారుతుంది.
కిడ్నీలు ఫెయిలై రోగి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.
కరోనా రోగుల్లో ఎక్కువగా వృద్ధులే ఉన్నారు. ముఖ్యంగా పార్కిన్సన్, డయాబెటిస్ లాంటి వ్యాధులు ఉన్నవారు దీనికి గురవుతున్నారు.
ఈ ఇన్ఫెక్షన్ వదిలించుకోడానికి ప్రస్తుతం ఎలాంటి ప్రత్యేక చికిత్సలూ లేవు.
ఇన్ఫెక్షన్ వచ్చిన రోగులకు డాక్టర్లు ప్రస్తుతం వారి లక్షణాల ఆధారంగా చికిత్సలు అందిస్తున్నారు.

రాకుండా ఏం చేయవచ్చు
ఇది రాకుండా ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారు సాధారణ ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే సూచించింది.
వీటిలో చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, మాస్క్ ధరించడం, ఆహార జాగ్రత్తలు ఉన్నాయి.
శ్వాస ఇబ్బందులు ఎదుర్కుంటున్న రోగులకు దగ్గరగా ఉండకూడదని సూచించారు.
తరచూ చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలని, ముఖ్యంగా ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి, పెంపుడు జంతువులు, లేదా ఇతర జంతువులకు దూరంగా ఉండాలని చెప్పింది.
పచ్చిగా ఉన్నవి లేదా సగం ఉడికిన మాంసం, గుడ్లు తినకుండా ఉండాలని సూచించింది.
కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినవారు తుమ్ముతున్న సమయంలో ఎదురుగా ఉన్నవారికి అది రాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పింది.
అంటే ముక్కుకు టిష్యూ లేదా బట్ట పెట్టుకోవడం, ఎదురుగా ఉన్న వ్యక్తికి దూరంగా జరగడం లాంటివి చేయాలి.

ఎవరికైనా ఇన్ఫెక్షన్ వస్తే...
చైనా ప్రభుత్వం గతంలో సార్స్ వ్యాపించినపుడు తీసుకున్న చర్యలనే కరోనావైరస్ ఇన్ఫెక్షన్‌కు కూడా పాటిస్తోంది.
అంటే, దేశంలో ఈ వైరస్ ఎవరికైనా వచ్చినట్టు ధ్రువీకరిస్తే, వారిని మిగతా అందరికీ దూరంగా ఉంచుతారు.
కరోనాఇన్ఫెక్షన్ వచ్చిన రోగులను 'లైట్, మీడియం, సీరియస్ అనే మూడు కేటగిరీలుగా విభజించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ వైద్యులకు సూచించింది.
రోగులకు చికిత్స అందించే ఆరోగ్య సిబ్బంది ఈ వైరస్ ఇన్ఫెక్షన్‌కు గురికాకుండా అన్నిరకాల జాగ్రత్తలూ తీసుకుంటున్నారు.
ఆరోగ్య సిబ్బంది గౌన్, మాస్క్, గ్లౌజ్ ఉపయోగించడంతోపాటు ఆస్పత్రుల్లో ఇన్ఫెక్షన్ వచ్చిన రోగుల కదలికలను నియంత్రించాలని కూడా సలహా ఇచ్చారు.
ఇవి కూడా చదవండి.
- భారత్లో యువత క్యాన్సర్ బారిన ఎందుకు పడుతోంది
- కరోనావైరస్: వుహాన్లో షీ జిన్పింగ్, కోవిడ్-19 అదుపులోకి వచ్చిందంటున్న చైనా
- కరోనావైరస్: ఇటలీలో విజృంభించిన ఇన్ఫెక్షన్... దేశమంతటా అత్యవసర పరిస్థితి
- దిల్లీలో 'స్కామ్' కాల్సెంటర్ గుట్టు రట్టు చేసిన బీబీసీ... ఇద్దరు హైటెక్ మోసగాళ్ళ అనుభవాలు
- రాజధాని రగడ-రాజకీయ క్రీడ!: ఎడిటర్స్ కామెంట్
- సొమాలియాలో మిడతల దండయాత్ర.. అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వం
- మునిగిపోతున్న రాజధాని.. రూ.2.52 లక్షల కోట్లతో కొత్త రాజధాని నగరం నిర్మాణానికి ప్రణాళికలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









