కరోనావైరస్: యూరప్ నుంచి అమెరికాకు అన్ని ప్రయాణాలూ రద్దు చేసిన డోనల్డ్ ట్రంప్; ఖండించిన ఈయూ

ఫొటో సోర్స్, Getty Images
యూరప్‌లో ఒక్క బ్రిటన్ మినహా మిగతా అన్ని దేశాల నుంచి అమెరికాకు రాకపోకల్ని 30 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.
విజృంభిస్తున్న కరోనావైరస్‌ను అడ్డుకునే చర్యల్లో భాగంగానే ఈ తాజా ఆంక్షలు విధిస్తున్నట్లు ఆయన తెలిపారు.
బుధవారం ఆయన టీవీలో ప్రసంగిస్తూ.. యూరప్ నుంచి అమెరికాకు 30 రోజుల పాటు ప్రయాణాలను రద్దు చేస్తున్నట్లు వివరించారు.
అయితే ట్రంప్ నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు యూరోపియన్ యూనియన్‌లోని 26 దేశాలు ప్రకటించాయి. తమతో సంప్రదించకుండా ఈ నిర్ణయం తీసుకోవడం తగదని ఆక్షేపించాయి.
కోవిడ్-19 ఓ ప్రపంచవ్యాప్త సంక్షోభం అని ఈయూ కమనిషన్ అధ్యక్షులు ఉర్సులా వాన్ డెర్ లీయెన్, చార్లెస్ మైకేల్ తెలిపారు. దీన్ని అడ్డుకోవడానికి ఏకపక్ష చర్యలు కాదు, సహకారం కావాలి అని వారన్నారు.

ఈ నియంత్రణలు చాలా కఠినమే అయినప్పటికీ, తప్పనిసరి అని ట్రంప్ చెప్పారు. అయితే, ఈ ప్రయాణాల రద్దు ఆదేశాలు బ్రిటన్‌కు వర్తించబోవని వెల్లడించారు. బ్రిటన్‌లో ఇప్పటి వరకూ 460 కరోనావైరస్ (కోవిడ్-19) కేసులు నమోదయ్యాయి.
ఈయూ దేశాల అధ్యక్షులకు వివరించి, నిర్ణయం తీసుకునేంత సమయం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అమెరికాలో ఇప్పటి వరకూ 1135 కేసులు నమోదు కాగా, ఈ వైరస్ సోకిన వారిలో 38 మంది మరణించారు.
‘‘మన దేశంలోకి మరిన్ని కొత్త కేసులు ప్రవేశించకుండా, రాబోయే 30 రోజుల పాటు యూరప్ నుంచి అమెరికాకు అన్ని రకాల ప్రయాణాలను రద్దు చేస్తున్నాం’’ అని ట్రంప్ చెప్పారు.
‘‘ఈ కొత్త నిబంధనలు శుక్రవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి’’ అని ఆయన తెలిపారు.
కాగా, అమెరికా ఆర్థిక రంగంపై కరోనావైరస్ మహమ్మారి ప్రభావాన్ని అడ్డుకునేందుకు పన్ను ఉపశమన చర్యలు తీసుకునేందుకు వీలుగా చట్టాన్ని ఆమోదించాలని కాంగ్రెస్‌ను ట్రంప్ కోరారు.

- కరోనా వైరస్: లక్షణాలేంటి? ఇది సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ సోకితే మనిషి శరీరానికి ఏమవుతుంది?
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

అమెరికాలో ప్రస్తుత పరిస్థితి ఏంటి?
అమెరికాలోని సామాన్య ప్రజలకు కరోనావైరస్ సోకే ప్రమాదం తక్కువ అని అధికారులు చెప్పారు. అయితే, ఈ నెలలో నమోదైన కొత్త కేసుల్ని బట్టి చూస్తే మాత్రం ఆందోళనలు పెరుగుతున్నాయి.
ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టారు. న్యూ రోకెల్లె, న్యూయార్క్ నగరాల నుంచే ఈ వైరస్ మొదలైందని భావిస్తున్నారు. దీంతో ఇక్కడ ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు.
తమంతటతాముగా గృహ దిగ్బంధనంలో ఉన్న వారికి నేషనల్ గార్డ్ సిబ్బంది ఆహారాన్ని సరఫరా చేయనున్నారు.
భారీగా ప్రజలు గుమికూడటాన్ని రద్దు చేస్తున్నట్లు వాషింగ్టన్ గవర్నర్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సోకి 38 మంది చనిపోగా.. అందులో ఈ ఒక్క రాష్ట్రానికి చెందినవారే 24 మంది ఉన్నారు.
జాతీయ అలర్జీ, అంటు రోగాల సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆంతోనీ ఫాకీ అమెరికాలో కరోనా వైరస్ ప్రభావం గురించి కాంగ్రెస్‌లో మాట్లాడుతూ.. ‘‘ఇది ఇంకా ముదురుతోంది’’ అని చెప్పారు. ఇప్పటికే వ్యాధి సోకిన వారికి నయం చేయడం, వారి నుంచి ఇతరులకు వ్యాపించకుండా అడ్డుకోగలగడంపైనే ఇదంతా ఆధారపడి ఉందని వెల్లడించారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
అమెరికాలో డాక్టర్ వద్దకు వెళ్లి వైద్యం పొందేందుకు చాలా డబ్బు ఖర్చవుతుంది. దీంతో ప్రజలు వైద్య సేవలు పొందేందుకు వెనకడుగువేస్తున్నారు. ఈ అధిక వ్యయం కూడా వైరస్ వ్యాప్తికి కారణమవుతోంది.
వైరస్ సోకినవారికి పెయిడ్ సిక్ లీవ్ (అనారోగ్యానికి గురైన ఉద్యోగులకు జీతం చెల్లిస్తూనే సెలవు తీసుకునే వెసులుబాటు) లేకపోవడం, అవసరమైన పరీక్షలు అందుబాటులో లేవనే భయాలు కూడా ఇతర కారణాలు.
‘‘ఏ అమెరికన్ అయినా పరీక్ష చేయించుకోవచ్చు, దానికి అడ్డేమీ లేదు, అయితే డాక్టర్ నుంచి ఆదేశాలు ఉండాలి’’ అని ప్రస్తుత సంక్షోభాన్ని నివారించే టాస్క్ ఫోర్స్‌కి ఇన్‌ఛార్జిగా ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రకటించారు. రోగులపై ఈ చార్జీల భారం పడకుండా చూస్తామని వైద్య బీమా కంపెనీలు హామీ ఇచ్చాయని తెలిపారు.

ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ గురించి ఈ సినిమా 10 ఏళ్ల కిందే చెప్పిందా?
- డబ్ల్యూహెచ్ఓ: కరోనావైరస్ ప్రపంచవ్యాప్త మహమ్మారి.. ఏప్రిల్ 15 వరకు వీసాలు సస్పెండ్ చేసిన భారత్.. ఆ దేశాల నుంచి వచ్చేవారంతా 14 రోజులు నిర్బంధంలోనే
- ప్రపంచంలోనే హెచ్ఐవీని జయించిన రెండో వ్యక్తి.. ఎలా నయమయ్యిందంటే?
- జ్యోతిరాదిత్య సింధియా: గ్వాలియర్ రాకుమారుడు, అత్యంత సంపన్న రాజకీయవేత్త గురించి తెలుసుకోవలసిన 10 విషయాలు
- కరోనావైరస్: బ్రిటన్ ఆరోగ్య మంత్రి నదీన్ డోరిస్‌కు కోవిడ్-19 నిర్థరణ
- విచ్ఛిన్న యుగంలో విశ్వసనీయ వార్తలు: బీబీసీ అనుసరిస్తున్న మార్గాల గురించి సంస్థ డైరెక్టర్ జనరల్ టోనీ హాల్ ఏం చెప్పారంటే...
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- ఇక్కడ బడికి పంపితే అమ్మ ఒడి... అక్కడ పంపకపోతే జైలే గతి
- మునిగిపోతున్న రాజధాని.. రూ.2.52 లక్షల కోట్లతో కొత్త రాజధాని నగరం నిర్మాణానికి ప్రణాళికలు
- కరోనావైరస్: ఇటలీలో విజృంభించిన ఇన్ఫెక్షన్... దేశమంతటా అత్యవసర పరిస్థితి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








