కరోనావైరస్: బ్రిటన్ ఆరోగ్య మంత్రి నదీన్ డోరిస్‌కు కోవిడ్ 19 నిర్థరణ

బ్రిటన్ ఆరోగ్య మంత్రి, కన్సర్వేటివ్ పార్టీ పార్లమెంట్ సభ్యురాలు నదీన్ డోరిస్‌కు కరోనా వైరస్ (కోవిడ్ 19) సోకినట్టు వైద్యులు గుర్తించారు.
వైరస్ సోకిందని తెలియగానే ఆమె వైద్య పరమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఇంటి దగ్గరే స్వచ్చందంగా నిర్బంధంలో ఉన్నట్లు చెప్పారు.
యు కె లో ఇప్పటికే 382 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా ఆరుగురు మరణించారు. ఇటీవల కరోనా వైరస్ బారిన పడి మరణించినవారిలో 80 ఏళ్ల వృద్ధుడు ఉన్నారు.
యు కె లో కరోనావైరస్ కేసులు పెరుగుతుండటంతో కరోనా వైరస్ బారిన పడేవారిని గుర్తించేందుకు నేషనల్ హెల్త్ సర్వీస్ చర్యలు త్వరితగతిన చర్యలు తీసుకుంటోంది. దీంతో రోజుకి 10000 మందికి పరీక్షలు నిర్వహించవచ్చు. ప్రస్తుతం 1500 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కరోనా వైరస్ పరీక్షల ఫలితాలను 24 గంటల లోగా తెలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
మిడ్ బెడ్‌ఫోర్డ్‌షైర్ పార్లమెంట్ సభ్యురాలు డోరిస్ కలిసిన వ్యక్తులకి , ఆమె ఆఫీసులో ఇతర సభ్యులకి కూడా ఇంగ్లండ్ పబ్లిక్ హెల్త్ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తోందని, ఆమె ఆఫీస్ కూడా వైద్య సలహాలను జాగ్రత్తగా పాటిస్తోందని తెలిపారు.
62 ఏళ్ల డోరిస్ నర్స్‌గా తన కెరీర్‌ని ప్రారంభించారు. " ఇది వినడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నా నేను దీని తీవ్రత నుంచి బయట పడినట్లే ఉన్నాను" అని ఆమె ట్వీట్ చేశారు.
తనతో పాటే ఉంటున్న తన 84 ఏళ్ల తల్లి మంగళవారం నుంచి దగ్గడం ప్రారంభించారని, ఆమె గురించి తనకు విచారంగా ఉందని, ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఆమె వెస్ట్ మినిస్టర్ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్ని సమావేశాల్లో పాల్గొన్నారో ఇంకా తెలియవలసి ఉంది.
బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ గురువారం ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో పాల్గొన్న తర్వాత డోరిస్‌కి కరోనా వైరస్ లక్షణాలు బయట పడ్డాయని బ్రిటన్ వైద్య విభాగం చెప్పింది. ఆమె శుక్రవారం నుంచి స్వీయ నిర్బంధంలో ఉన్నారు.
బోరిస్ జాన్సన్ పై కరోనా వైరస్ పరీక్షలు జరిపారా లేదా అన్న వివరాలు 10 డౌనింగ్ స్ట్రీట్ వెల్లడించలేదు.
బ్రిటన్ లో ఆరోగ్య శాఖ మంత్రులు, ఆరోగ్య కార్యదర్శి మాట్ హాన్‌కోక్ తో సహా, డోరిస్ కలిసిన ఇతర వ్యక్తులందరికి కూడా కరోనావైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
తనని తాను స్వీయ నిర్బంధంలో పెట్టుకుని ఆమె మంచి పని చేశారని , ఆమె త్వరగా కోలుకోవాలని హాన్ కాక్ ట్వీట్ చేసారు.
ప్రజలు కరోనావైరస్ అంటే ఎందుకు భయ పడుతున్నారో అర్ధమవుతోందని, అత్యుత్తమ వైద్య పద్ధతులు అవలంబించి వ్యాధిని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి
- కరోనావైరస్: ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19 గురించి మీ పిల్లలకు ఎలా చెప్పాలి?
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- ప్రెస్ రివ్యూ: ‘‘మోదీజీ... మీరిచ్చే గౌరవాన్ని నిరాకరిస్తున్నా!’’ - ట్విటర్‌లో ఎనిమిదేళ్ల ఉద్యమకారిణి
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు, ఎందుకు, ఎలా మొదలైంది?
- పీతల నీలి రంగు రక్తం ప్రతి ఏటా లక్షలాది ప్రాణాలను కాపాడుతోందని మీకు తెలుసా?
- కరోనావైరస్: శశిథరూర్ మెడలోని ఈ గాడ్జెట్ వైరస్‌లను అడ్డుకుంటుందా
- కరోనావైరస్లు ఎక్కడి నుంచి వస్తాయి... ఒక్కసారిగా ఎలా వ్యాపిస్తాయి?
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు, ఎందుకు, ఎలా మొదలైంది?
- పోలీసులమంటూ వాహనం ఆపి యువతిపై గ్యాంప్ రేప్; అలా ఎవరైనా ఆపితే ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









