పీతల నీలి రంగు రక్తం ప్రతి ఏటా లక్షలాది ప్రాణాలను కాపాడుతోందని మీకు తెలుసా?

ఫొటో సోర్స్, Getty Images
చాలా మందికి వాళ్ళ ఆరోగ్యం ఒక నీలి రంగు రక్తం కలిగిన పీత మీద ఆధారపడి ఉంటుందని తెలియదు. ఈ పీత సాలె పురుగుకు, భారీ జలగకు మధ్యలో శిలువ ఆకారంలో ఉంటుంది.
హార్స్ షూ పీతలు ప్రపంచంలోనే మనుగడలో ఉన్న అతి పురాతన జీవరాసులు. ఇవి 45 కోట్ల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద ఉన్నట్లు అంచనా.
అట్లాంటిక్, ఇండియన్, పసిఫిక్ సముద్ర ప్రాంతాలలో కనిపించే ఈ జీవరాసులు కొన్ని మిలియన్ జీవితాలని కాపాడటం మన అదృష్టం అని చెప్పవచ్చు.


బ్లడ్ హార్వెస్టింగ్
వైద్య పరికరాలు, నరాలలోకి వాడే సూది మందులు వైద్యానికి అనువుగా ఉన్నాయో లేదో పరీక్షించేందుకు శాస్త్రవేత్తలు 1970 నుంచి హార్స్ షూ పీత నుంచి వచ్చే నీలి రంగు రక్తాన్ని వాడుతున్నారు.
వైద్య పరికరాల పై హానికారక బాక్టీరియాని ఈ హార్స్ షూ రక్తం నాశనం చేస్తుంది. బాక్టీరియాలో ఉండే హానికారక పదార్ధాలకి ఇది చాలా తీవ్రంగా స్పందిస్తుంది.
మానవ శరీరంలోకి పంపించే టీకా మందులు, నరాల ద్వారా ఎక్కించే మందులు, లేదా శరీరంలోకి అమర్చే ఇంప్లాంటెడ్ పరికరాల తయారీ సమయంలో ఏమైనా కల్తీ ఉందో లేదో పరీక్షించడానికి ఈ బ్లూ బ్లడ్ ఉపయోగపడుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
పెద్ద వ్యాపారం
ప్రతి సంవత్సరం 5 లక్షల అట్లాంటిక్ హార్స్ షూ పీతలని బయో-మెడికల్ అవసరాల కోసం వాడుతున్నారని అట్లాంటిక్ స్టేట్స్ మెరైన్ ఫిషరీస్ కమిషన్ చెప్పింది.
హార్స్ షూ రక్తం ప్రపంచంలోనే అతి ఖరీదైన ద్రవాల్లో ఒకటి
ఒక లీటర్ రక్తం సుమారు 15000 డాలర్ల ఖరీదు చేస్తుంది.
నీలి రక్తం ఎందుకు?
పీతల రక్తంలో ఉండే రాగి ఖనిజం వలన అది నీలం రంగుని సంతరించుకుంటుంది. మానవ రక్తంలో ఉండే ఇనుము మనుషుల రక్తాన్ని ఎరుపు రంగులో ఉంచుతుంది.
కానీ, శాస్త్రవేత్తలని ఆసక్తి పరిచేది ఈ పీతల రక్తపు రంగు కాదు.
వీటి రక్తంలో రాగితో పాటు బాక్టీరియాని గడ్డ కట్టించగలిగే ఒక ప్రత్యేక రసాయనం ఉంటుంది.
ఈ రసాయనం ఎలాంటి బ్యాక్తీరియా నైనా క్షణాల్లో పసి గట్టగలదు. అమెరికన్ జీవ జాతులతో లభించే రసాయనంతో లిములుస్ ఎమ్బో కైట్ లైసెట్ (ఎల్ ఏ ఎల్) పరీక్షని, ఆసియన్ జీవ జాతులతో ఎమ్బో కైట్ లైసెట్ పరీక్షని నిర్వహించవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
తర్వాత పీతలు ఏమవుతాయి?
ఒక సారి పీతల గుండె దగ్గర ఉండే పై భాగాన్ని తీసేసాక 30 శాతం రక్తాన్ని పీతల్లో హార్వెస్ట్ చేస్తారు. తర్వాత ఆ పీతలు వాటి ఆవాసాలకు వెళ్లిపోతాయి.
అయితే ఈ ప్రక్రియ లో 10నుంచి 30 శాతం పీతలు చనిపోతాయి. దీంతో, మిగిలిన ఆడ పీతలు మళ్ళీ గుడ్లు పెట్టడం కష్టం అవుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
ప్రత్యామ్నాయం ఉందా?
ప్రపంచంలో ప్రస్తుతం నాల్గు రకాల హార్స్ షూ పీతల జాతులు మనుగడలో ఉన్నాయి.
బయో- మెడికల్ వాడకానికి వీటిని అత్యధికంగా వేటాడటంతో పాటు, పెద్ద చేపల తాకిడితో వీటి మనుగడకి ముప్పు పొంచి ఉంది. ఆవాసాల కొరత, కాలుష్యం కూడా వీటికి ముప్పుగా ఉన్నాయి.
వైద్య పరికరాల పై ఉండే హానికారక పదార్ధాలని గుర్తించేందుకు సింథటిక్ పద్ధతులని అవలంబించాలని వీటి సంరక్షకులు విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ మందుల కంపెనీల ఉత్పత్తిదారులు మాత్రం ఈ సింథటిక్ పద్ధతులు కేవలం పైకి కనిపించే హానికారకాలను మాత్రమే గుర్తించగలవని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ ఎంత వేగంగా విస్తరిస్తోంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనా వైరస్: పిల్లలపై ప్రభావం చూపలేకపోతున్న వైరస్.. కారణాలు చెప్పలేకపోతున్న వైద్య నిపుణులు
- కరోనావైరస్: శశిథరూర్ మెడలోని ఈ గాడ్జెట్ వైరస్లను అడ్డుకుంటుందా
- కరోనా వైరస్: 'తుమ్మినా, దగ్గినా ఇతరులకు సోకుతుంది.. దగ్గు, జ్వరంతో మొదలై అవయవాలు పనిచేయకుండా చేస్తుంది'
- ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుంది? హ్యాంగోవర్ దిగాలంటే ఏం చేయాలి
- కరోనావైరస్: జంతువుల నుంచి మనుషులకు సోకింది ఇలాగేనా? శాస్త్రవేత్తల ‘డిటెక్టివ్ కథ’
- దిల్లీలో అలర్లు చేయించేందుకు ముస్లింలకు డబ్బులు పంచారా? : Fact Check
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









