కరోనా వైరస్: పిల్లలపై ప్రభావం చూపలేకపోతున్న వైరస్.. కారణాలు చెప్పలేకపోతున్న వైద్య నిపుణులు

కరోనా వైరస్ ఇన్ఫెక్షన్‌కు గురైన వారిలో పిల్లలు తక్కువమంది ఉన్నారు, నిపుణులు దీనిపై పరిశోధన చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కరోనా వైరస్ ఇన్ఫెక్షన్‌కు గురైన వారిలో పిల్లలు తక్కువమంది ఉన్నారు, నిపుణులు దీనిపై పరిశోధన చేస్తున్నారు
    • రచయిత, ఫెర్నాండో డ్యూయర్ట్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పుట్టిన 30 గంటల్లోగా కరోనా వైరస్ బారిన పడిన చిన్నారి కేసు చైనాలో ఫిబ్రవరి 5న నమోదైంది. ఈ వార్త ప్రపంచమంతా కలకలం రేపింది.

ఇప్పటి వరకు కరోనా వైరస్ బారిన పడ్డ వారిలో అత్యంత చిన్న వయసు ఈ చిన్నారిదే.

ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి వెయ్యికి పైగా ప్రజలు మరణించారు. ముఖ్యంగా చైనాలో, మరో 30 దేశాలలో కలిపి సుమారు 40,000 మంది ఇన్ఫెక్షన్‌కి గురయ్యారు.

అయితే, ఇన్ఫెక్షన్‌కి గురైన వారిలో పిల్లల సంఖ్య చాలా తక్కువగా ఉంది.

అడ్డగీత
News image
అడ్డగీత

వుహాన్‌లోని జిన్యింటాన్ హాస్పిటల్లో రోగులకు నిర్వహించిన పరీక్షల ఆధారంగా విడుదల చేసిన నివేదికను జర్నల్ అఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ఇటీవల ప్రచురించింది. "పిల్లల్లో ఈ ఇన్ఫెక్షన్ అరుదు" అని ఈ పరిశోధన పత్రంలో పేర్కొన్నారు.

నిజంగానే పిల్లలకు కరోనా వైరస్ రాదా?

మైక్రోస్కోపులో కరోనా వైరస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కరోనా వైరస్‌కి పిల్లలు గురయ్యే అవకాశాలు తక్కువా?

పిల్లల్లో ఇన్ఫెక్షన్ కేసులు తక్కువ

పిల్లల్లో ఇన్ఫెక్షన్ కేసులు తక్కువ అనే అంశంపై చాలా సిద్ధాంతాలు ఉన్నప్పటికీ, దీనికి కారణాలు ఏమిటనే విషయంపై వైద్య నిపుణులు కచ్చితమైన సమాధానం చెప్పలేకపోతున్నారు.

కారణాలు తెలియక పోయినా పిల్లలు ఈ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా తప్పించుకోవడం గాని, లేదా తీవ్రంగా ఇన్ఫెక్షన్‌కి గురవకుండా ఉండటం కానీ జరుగుతుందని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్‌లో వైరాలజీ ప్రొఫెసర్ ఇయాన్ జోన్స్ బీబీసీకి తెలిపారు.

పిల్లలకు ఇన్ఫెక్షన్ తీవ్ర స్థాయిలో సోకటంలేదని జోన్స్ అభిప్రాయపడ్డారు. కేసులు నమోదవ్వకపోవడానికి, హాస్పిటల్‌కి వచ్చి పరీక్షలు చేయించుకోకపోవడానికి ఇది కూడా ఓ కారణం కావచ్చని చెప్పారు.

యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్‌లో పని చేస్తున్న క్లినికల్ లెక్చరర్ నథాలి మెక్ డెర్మాట్ ఈ వాదనని సమర్ధించారు.

"ఐదేళ్ల నుంచి టీనేజ్ మధ్య వయసు ఉన్న వారిలో వైరస్‌ని ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. వాళ్లకి ఇన్ఫెక్షన్ సోకినా కూడా వాటి లక్షణాలు నిర్ధారణ పరీక్షల్లో బయటపడే స్థాయిలో ఉండవు" అని తెలిపారు.

2003లో చైనాని కబళించి 800 మందిని పొట్టన పెట్టుకున్న సార్స్ వైరస్ సమయంలో కూడా నమోదైన పిల్లల కేసులు తక్కువ. (నమోదైన 800 కేసులలో 10 శాతం పిల్లలు ఉన్నారు)

యూఎస్‌లో ప్రజా ఆరోగ్య సంస్థ 'సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్' 2007లో 135 మంది పిల్లల్లో సార్స్ కేసులు గుర్తించినప్పటికీ పిల్లల్లో కానీ యుక్త వయసువారిలో కానీ మరణాలు నమోదు కాలేదని పేర్కొంది.

చైనీస్ కొత్త సంవత్సరం సెలవులు పిల్లల్ని కాపాడాయా?

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనీస్ కొత్త సంవత్సరం సెలవులు పిల్లల్ని కాపాడాయా?

కొత్త సంవత్సరం సెలవులు పిల్లల్ని కాపాడాయా?

చైనా కొత్త సంవత్సరం కారణంగా స్కూళ్లకు సెలవులు రావడం వలన పిల్లలు ఈ వైరస్ బారిన పడకుండా ఉండటానికి ఓ కారణం కావచ్చని మెక్ డెర్మాట్ అభిప్రాయపడ్డారు.

చైనాలో కొన్ని ప్రాంతాల్లో స్కూళ్లను మూసేయాలని, కొన్ని స్కూళ్లు ఫిబ్రవరి నెల అంతా సెలవులు ఇవ్వాలని నిర్ణయించాయి.

ఇంట్లో ఎవరైనా ఇన్ఫెక్షన్‌కి గురైతే, ఆ ఇంట్లో ఉండే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడమో, సురక్షిత ప్రాంతాలకి పంపడమో చేయవచ్చని మెక్ అన్నారు. కానీ ఈ ఇన్ఫెక్షన్ ప్రభావం పెరుగుతున్న కొద్దీ పరిస్థితి మారొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ ఇన్ఫెక్షన్ తీవ్రంగా ప్రబలుతున్న ప్రస్తుత దశలో పిల్లల్లో నమోదైన ఎక్కువ కేసులు లేవు.

సార్స్ మహమ్మారి సమయంలో కూడా 12 సంవత్సరాల లోపు పిల్లలు హాస్పిటల్లో వైద్యం తీసుకున్న దాఖలాలు చాలా తక్కువ అని పిల్లల కేసులను పరిశీలించిన సీడీసీ పరిశోధకులు పేర్కొన్నారు.

సర్జికల్ మాస్క్ ధరించిన వ్యక్తి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కరోనా వైరస్ బారిన పడిన వారిలో 40 నుంచి 59 మధ్య వయసు వారు ఎక్కువ

ఈ వైరస్ పిల్లల కన్నా పెద్దలపై ఎక్కువ ప్రభావం చూపుతుందా?

కొంత మంది పిల్లలు ఇన్ఫెక్షన్ బారిన పడినప్పటికీ, పిల్లల కంటే కూడా పెద్దవాళ్లపై దీని ప్రభావం ఎక్కువ ఉంటుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పిల్లల్లో రోగ నిరోధక శక్తి ఉండటం సహజమని కార్డిఫ్ యూనివర్సిటీలో ఇన్ఫెక్టియస్ డిసీజెస్ విభాగ నిపుణుడు ఆండ్రూ ఫ్రీమన్ బీబీసీతో అన్నారు.

అధికారులు ఈ లక్షణాలు లేని పిల్లలకి వైద్య పరీక్షలు నిర్వహించకపోవడం కూడా కేసులు బయటపడకపోవడానికి ఒక కారణం అని ఆయనంటున్నారు.

లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అండ్ ఇంపీరియల్ కాలేజీలో పని చేస్తున్న స్టాటిస్టికల్ ఎపిడెమియాలజీ నిపుణుడు క్రైస్ట్ డొనెల్లి ఈ వాదనని సమర్ధించారు. హాంకాంగ్‌లో తలెత్తిన సార్స్ విపత్తుని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

పిల్లల్లో ఈ ఇన్ఫెక్షన్ తీవ్రం అయ్యే అవకాశం తక్కువ కావడం వలన దీని ప్రభావం వారి మీద తక్కువ అని అభిప్రాయపడ్డారు.

హాంకాంగ్ ఎయిర్‌పోర్ట్‌లో మాస్క్‌లు ధరించి క్యూ కట్టిన ప్రజలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హాంకాంగ్ ఎయిర్‌పోర్ట్‌లో మాస్క్‌లు ధరించి క్యూ కట్టిన ప్రజలు

ముందుగా ఉన్న లక్షణాలు

"ముందుగానే డయాబెటిస్, గుండె జబ్బు లాంటి లక్షణాలున్న వ్యక్తులు ఈ ఇన్ఫెక్షన్‌కి గురయ్యే అవకాశం ఎక్కువ. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే నిమోనియాకి గురయ్యే అవకాశం ఎక్కువ" అని ఇయాన్ జోన్స్ తెలిపారు. జలుబు, ఊపిరితిత్తులకి సంబంధించిన రోగాలతో ఇది మొదలవుతుందని జోన్స్ అంటున్నారు.

జిన్యింటన్ హాస్పిటల్లో చేరిన రోగులపై చేసిన పరిశోధనలలో ఈ ఇన్ఫెక్షన్ బారిన పడిన వారిలో ఎక్కువ మంది తీవ్రమైన జబ్బులతో అప్పటికే బాధపడుతున్నవారని తేలింది.

చైనా నుంచి రష్యా కి వెళుతున్న పిల్లలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పిల్లల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందా లేదా అనేందుకు ఆధారాలు లేవు

పిల్లల ద్వారా వైరస్ వ్యాప్తి చెందదా?

సాధారణంగా పిల్లలు ఏదైనా వైరస్‌కి త్వరగా గురవడం కానీ, వారి ద్వారా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే అవకాశాలు కానీ చాలా ఎక్కువ.

ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధులు పిల్లల ద్వారా చాలా తొందరగా వ్యాప్తి చెందుతాయని ఇయాన్ జోన్స్ అన్నారు.

కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో పిల్లలు కూడా ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ వైరస్ వ్యాప్తి, ప్రభావాన్ని అర్ధం చేసుకునేందుకు ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉందన్నారు.

స్పోర్ట్స్ ఉమెన్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)