హాలీవుడ్ నటుడు టామ్ హ్యాంక్స్, ఆయన భార్య రీటా విల్సన్‌కు కరోనా వైరస్

ఫొటో సోర్స్, EPA
తనకు, తన భార్య రీటా విల్సన్‌కు కరోనావైరస్ సోకినట్లు నిర్ధరణ అయ్యిందని హాలీవుడ్ నటుడు టామ్ హ్యాంక్స్ తెలిపారు. ఆస్ట్రేలియాలో తామిద్దరం కోవిడ్-19 వ్యాధికి గురయ్యామని ఆయన వెల్లడించారు.
క్వీన్స్‌ల్యాండ్‌లో జలుబు లక్షణాలు కనిపించాయని, దీంతో వైద్యం కోసం వెళితే కరోనావైరస్ సోకినట్లు తెలిసిందని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొన్నారు.
ఈ భార్యాభర్తలు ఇద్దరి వయను 63 ఏళ్లు. ఇప్పుడు తాము ఇద్దరం ఇతరులు ఎవ్వరితో కలవకుండా వేరుగా ఉంటున్నట్టు టామ్ హ్యాక్స్ తెలిపారు.
ప్రఖ్యాత అమెరికన్ సింగర్ ఎల్విస్ ప్రెస్లీ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ కోసం ఈ భార్యాభర్తలు ఆస్ట్రేలియా వచ్చారు. ఈ సినిమా షూటింగ్ ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ నగరంలో జరుగుతోంది.
‘‘మేం ఇద్దరం అలసటకు గురయ్యాం. ఇద్దరికీ జలుబు, ఒళ్లంతా నొప్పులు. రీటా కొద్దిసేపు ఒణికిపోయింది. మాకు కొంచెం జ్వరంగా కూడా ఉంది. పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అవసరమైనట్లుగా.. మేం కరోనావైరస్ పరీక్షలు చేయించుకున్నాం. మాకు వైరస్ సోకినట్లు నిర్థరణ అయ్యింది’’ అని టామ్ హ్యాంక్స్ పేర్కొన్నారు.
తమ ఆరోగ్య పరిస్థితి గురించి అందరికీ ఎప్పటికప్పుడు తెలియజేస్తామని ఆయన అన్నారు.
‘‘ప్రజారోగ్యం, భద్రత కోసం అవసరమైనన్ని రోజులు మేం పరీక్షలు చేయించుకుని, వైద్యుల పర్యవేక్షణలో ఇతరులతో కలవకుండా ఒంటరిగా ఉంటాం’’ అని వివరించారు.
ఉత్తమ నటుడిగా రెండు సార్లు ఆస్కార్ అవార్డు పొందిన టామ్ హ్యాంక్స్ మరో ఆరు సార్లు ఆస్కార్ అవార్డు కోసం పోటీపడ్డారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డులు సహా పలు ప్రతిష్టాత్మక అవార్డులు, పురస్కారాలు పొందారు. అలాగే, ఆయన నటించిన చాలా సినిమాలు ఆస్కార్ అవార్డులు పొందాయి.
కాగా, టామ్ హ్యాంక్స్ నటిస్తున్న తాజా చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ ఈ అంశంపై స్పందిస్తూ.. ‘‘మా కంపెనీ సభ్యుల ఆరోగ్యం, భద్రత మాకు చాలా ముఖ్యమైన అంశం. ప్రపంచవ్యాప్తంగా మా సంస్థ తరపున పనిచేస్తున్న అందరినీ రక్షించేందుకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం’’ అని ప్రకటించింది.
ఆస్ట్రేలియాకు చెందిన దర్శకుడు బాజ్ లుహ్ర్‌మన్ దర్శకత్వం వహిస్తున్న, ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడిందని స్థానిక మీడియా తెలిపింది.
టామ్ హ్యాంక్స్ భార్య రీటా విల్సన్ కూడా నటి, గాయకురాలు. గత వారం బ్రిస్బేన్ ఎంపోరియం హోటల్, సిడ్నీ ఒపెరా హౌస్‌ల్లో జరిగిన ప్రదర్శనల్లో ఆమె పాల్గొన్నారు.

- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ సోకితే మనిషి శరీరానికి ఏమవుతుంది?
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు

కరోనావైరస్‌ను ప్రపంచవ్యాప్త మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్ఓ) బుధవారం ప్రకటించింది.
ఆస్ట్రేలియాలో 130కి పైగా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.
కరోనావైరస్ విజృంభణ నేపథ్యంలో ఇటలీ దేశవ్యాప్తంగా ఆహారం, మందుల షాపులు మినహా మిగతా అన్ని షాపుల్ని మూసేసింది. యూరప్‌లో అత్యంత కఠినమైన ఆంక్షలు విధించిన దేశం ఇటలీనే. ఈ దేశంలో కరోనావైరస్ కేసులు, మరణాలు కూడా ఆందోళనకరమైన రీతిలో పెరుగుతున్నాయి.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ 30 రోజుల పాటు యూరప్ నుంచి అమెరికాకు అన్ని రకాల ప్రయాణాలను రద్దు చేశారు.
భారతదేశం సైతం కఠిన చర్యలు తీసుకుంది. ప్రస్తుతం ఉన్న అన్ని వీసాలు (డిప్లొమేటిక్, అఫీషియల్, ఐరాస, అంతర్జాతీయ సంస్థలు, ఉద్యోగ, ప్రాజెక్టు వీసాలు తప్ప) ఏప్రిల్ 15 వరకూ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది మార్చి 13 నుంచి అమల్లోకి వస్తుంది.
అత్యవసరం అయితే తప్ప భారతదేశానికి రావొద్దని విదేశీయులకు చెప్పింది. అలాగే అత్యవసరం అయితే తప్ప విదేశాలకు వెళ్లొద్దని భారతీయులకు తెలిపింది.

ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: యూరప్ నుంచి అమెరికాకు అన్ని ప్రయాణాలూ రద్దు చేసిన డోనల్డ్ ట్రంప్
- కరోనావైరస్ గురించి ఈ సినిమా 10 ఏళ్ల కిందే చెప్పిందా?
- డబ్ల్యూహెచ్ఓ: కరోనావైరస్ ప్రపంచవ్యాప్త మహమ్మారి.. ఏప్రిల్ 15 వరకు వీసాలు సస్పెండ్ చేసిన భారత్.. ఆ దేశాల నుంచి వచ్చేవారంతా 14 రోజులు నిర్బంధంలోనే
- ప్రపంచంలోనే హెచ్ఐవీని జయించిన రెండో వ్యక్తి.. ఎలా నయమయ్యిందంటే?
- జ్యోతిరాదిత్య సింధియా: గ్వాలియర్ రాకుమారుడు, అత్యంత సంపన్న రాజకీయవేత్త గురించి తెలుసుకోవలసిన 10 విషయాలు
- కరోనావైరస్: బ్రిటన్ ఆరోగ్య మంత్రి నదీన్ డోరిస్‌కు కోవిడ్-19 నిర్థరణ
- విచ్ఛిన్న యుగంలో విశ్వసనీయ వార్తలు: బీబీసీ అనుసరిస్తున్న మార్గాల గురించి సంస్థ డైరెక్టర్ జనరల్ టోనీ హాల్ ఏం చెప్పారంటే...
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- ఇక్కడ బడికి పంపితే అమ్మ ఒడి... అక్కడ పంపకపోతే జైలే గతి
- మునిగిపోతున్న రాజధాని.. రూ.2.52 లక్షల కోట్లతో కొత్త రాజధాని నగరం నిర్మాణానికి ప్రణాళికలు
- కరోనావైరస్: ఇటలీలో విజృంభించిన ఇన్ఫెక్షన్... దేశమంతటా అత్యవసర పరిస్థితి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









