కరోనావైరస్: ‘నేను చనిపోయినా ఫరవాలేదు.. ఈ వ్యాధిని ఆఫ్రికాకు మోసుకెళ్లకూడదని చైనాలోనే ఉండిపోయాను’ - కోవిడ్-19 బారిన పడి కోలుకున్నవారి అనుభవాలు

కరోనావైరస్

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, కరోనావైరస్ బారిన పడి తిరిగి కోలుకున్న కెమరూన్ విద్యార్థి

ఇది చైనాలో జింగ్జో నగరంలో నివసిస్తూ కరోనావైరస్ బారిన పడి తిరిగి కోలుకున్న ఓ కెమరూన్ విద్యార్థి కథ.

21 ఏళ్ల వయసున్న కెమ్ సెనౌ పావెల్ దర్యల్ తనకు దేశం విడిచి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ తనకేం జరిగినా తనకొచ్చిన ఈ వ్యాధిని ఆఫ్రికాకు మోసుకెళ్లకూడదన్న ఉద్ధేశంతో చైనాలోనే ఉండిపోయారు.

ప్రస్తుతం తన యూనివర్శిటి డార్మెటరీలో ఐసోలేషన్‌లో ఉంటున్నారు. జ్వరం, పొడి దగ్గు, ఫ్లూ లక్షణాలతో ఆయన బాధపడ్డారు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, PAVEL DARYL KEM SENOU

ఫొటో క్యాప్షన్, చైనాలో ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకున్న కెమెరూన్ విద్యార్థి

నా చావు గురించే ఆలోచించా

అనారోగ్యం బారిన పడినవెంటనే దర్యల్‌కు చిన్నతనంలో కెమెరూన్‌లో ఉండగా తనకు వచ్చిన మలేరియా గుర్తొచ్చింది. పరిస్థితి విషమిస్తుందన్న భయం ఆయనలో మొదలైంది

"మొదటి సారి నేను ఆసుపత్రికి వెళ్లినప్పుడు నా చావు గురించే ఆలోచించా. అది ఎలా సంభవిస్తుందన్న దిశగానే నా ఆలోచనలు సాగాయి."

Sorry, your browser cannot display this map