కరోనావైరస్: నిమ్మరసంతో కరోనా ఆగుతుందా? ఇటలీలో ఫేక్ న్యూస్ వెల్లువ

ఫొటో సోర్స్, EPA
- రచయిత, రియాలిటీ చెక్ టీమ్, బీబీసీ మానిటరింగ్
- హోదా, బీబీసీ న్యూస్
ఇటలీలో కరోనావైరస్ మహమ్మారిలా వ్యాపిస్తుండటంతో.. ఫేక్ న్యూస్‌తో పాటు ఆ వైరస్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండంటూ తప్పుడు సమాచారం కూడా విస్తృతంగా చలామణీ అవుతోంది.
ఇటీవల దేశంలో వైరల్‌గా మారిన కొన్ని కథలను మేం పరిశీలించాం. అందులో నిజం ఏమైనా ఉందా అనేది తెలుసుకునేందుకు ప్రయత్నించాం.
1. సైన్యం వీధుల్లో పహరా కాస్తోంది
రోడ్ల మీద సైనిక వాహనాలు తిరుగుతున్నట్లు చూపుతూ ట్విటర్లో పోస్టయిన ఒక వీడియోను 2.50 లక్షల మందికి పైగా వీక్షించారు. దక్షిణాది నగరమైన ఫాగియాలో సైన్యం పహరా కాస్తోందని ఆ వీడియో చెప్తోంది. అయితే.. అది సిసిలీలోని పాలెర్మో నగరంలోని వీడియో అని సవరించారు.
కరోనావైరస్ను నియంత్రించటంలో భాగంగా పాలెర్మోలో జైళ్ల సందర్శన మీద పరిమితులు విధించటాన్ని ఉటంకిస్తూ.. జైళ్లలో అలజడుల కారణంగా సైనికులు రోడ్లపై పహరా కాస్తున్నారని ఈ ట్వీట్‌తో పాటు మరికొన్ని పోస్టులు పేర్కొన్నాయి.
అయితే.. పాలెర్మోలో సైన్యం వీధుల్లో తిరుగుతున్న మాట నిజమే. కానీ.. దానికి, జైళ్లలో అలజడులకు సంబంధం లేదు.

ఆ వాహనాలు పాలెర్మోలోనే ఉండే ఆరో లాన్సీరీ డి-ఓస్టో రెజిమెంట్‌కు చెందిన వాహనాలని ఇటలీ సైన్యం నిర్ధారించింది.
సార్డీనియాలో ఒక సైనిక విన్యాస కార్యక్రమం నుంచి ఆ వాహనాలు తిరిగి వస్తున్నాయి. అంతేకానీ.. జైళ్లలో ఖైదీల మధ్య అలజడిని నియంత్రించటానికి కానీ, కరోనావైరస్కు సంబంధించి ఇతరత్రా ఎటువంటి కారణం వల్ల కానీ ఆ సైన్యాన్ని మోహరించలేదు.
2. వ్యాక్సిన్ కొనుక్కోవచ్చంటూ నకిలీ న్యూస్
వెనిస్ ప్రాంతంలో కొన్నిచోట్ల.. కరోనావైరస్కు వ్యాక్సిన్ కొనండి అంటూ షాపులు, ఇళ్లకు ఇటాలియన్ భాషలో రాసిన ఈ కరపత్రం పంపిణీ చేసినట్లు చెప్తున్నారు.
కోవిడ్-19 మీద పోరాడటానికి ఆస్ట్రేలియాలో ఈ వ్యాక్సిన్‌ను తయారు చేశారని, దీనిని ప్రపంచంలో కేవలం ఒక్క స్విట్జర్లాండ్ మాత్రమే కొనుగోలు చేసిందని అందులో పేర్కొన్నారు.
ఈ వ్యాక్సిన్ ఆరు డోసులు తీసుకుంటే.. ఏడాది పాటు కరోనావైరస్ నుంచి రక్షణ లభిస్తుందని.. దీని ధర 50 యూరోలని, ఇది కావాలంటే కరపత్రంలో ఇచ్చిన ఈ-మెయిల్‌ను సంప్రదించాలని చెప్పారు.
అయితే.. ఈ వైరస్‌కు ప్రపంచంలో ఎక్కడా ఎటువంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. నిజానికి వచ్చే ఏడాది మధ్య కాలం వరకూ కరోనావైరస్ వ్యాక్సిన్ సిద్ధం కాదని బీబీసీ హెల్త్ అండ్ సైన్స్ కరెస్పాండెంట్ జేమ్స్ గళగర్ పేర్కొన్నారు.
ఈ అంశం మీద కథనం రాసిన ఒక ఇటాలియన్ ఫ్యాక్ట్-చెక్ వెబ్సైట్.. ''వ్యాక్సిన్ అనేది ఎక్కడా లేదు.. కానీ అబద్ధాలు ప్రచారం చేస్తూ ఆనందించే వారు ఉన్నారు'' అని వ్యాఖ్యానించింది.
Sorry, your browser cannot display this map


- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- 123 ఏళ్ల నాటి ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ (అంటువ్యాధుల నివారణ చట్టం)-1897 ఏం చెబుతోంది?
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ సోకితే మనిషి శరీరానికి ఏమవుతుంది?
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్: ఇది మీ జేబుపై, మీరు కొనే వస్తువులపై ఇలా ప్రభావం చూపుతోంది..
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు


ఫొటో సోర్స్, Getty Images
3. నిమ్మ రసం కథ...
వైరస్‌ను నిరోధించటానికి ఇతర మార్గాలు ఉన్నాయంటూ తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో పంపిణీ అవుతోంది.
చైనాలోని జాన్జాన్ యూనివర్సిటీకి చెందిన ఒక పరిశోధకుడు చెప్పాడంటూ.. ఈ వైరస్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికి సాధ్యమైనంత ఎక్కువ మోతాదులో విటమిన్-సి తీసుకోవాలని సూచిస్తున్న కథనం అందులో ఒకటి.
వైరల్మేగజీన్.ఇట్ అనే న్యూస్ పోర్టల్‌లో ఇది ప్రచురితమైంది. ఆ కథనాన్ని 5,76,000 సార్లు చూశారని, 30,000 సార్లు షేర్ చేశారని సంబంధిత లెక్కలు చెప్తున్నాయి.
నిమ్మరసం కలిపిన వేడి నీళ్లు తాగితే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చునని 'బీజింగ్ మిలటరీ హాస్పిటల్ సీఈఓ ప్రొఫెసర్ చెన్ హోరిన్' చెప్పారని కూడా ఆ పోస్ట్ ఉటంకిస్తోంది.
కానీ.. ఇందులో చాలా విషయాలు తేడాగా ఉన్నాయి:
- చైనా రీసెర్చర్ అంటూ చెప్పిన పేరు నకిలీదిగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆ పేరును ఇంగ్లిష్‌లోకి అనువదిస్తే ''నీ పేరు ఏమిటి?' అనే అర్థం వస్తుంది.
- ఇక చైనాలో జాన్జాన్ యూనివర్సిటీ అనేది ఏదీ లేదు.
- ఇక్కడ ప్రస్తావించిన ప్రొఫెసర్ పేరు గతంలోనూ క్యాన్సర్‌కు సంబంధింది వచ్చిన తప్పుడు సలహాల్లో కూడా కనిపించింది.
ఇక.. నిమ్మ రసం కానీ, విటమిన్-సి ఎక్కువ మోతాదులో తీసుకోవటం వల్ల కానీ వైరస్ సోకకుండా నివారిస్తుందనేందుకు ఎటువంటి ఆధారాలూ లేవు.
ఈ ప్రైవేటు మెసేజీల్లో ఒక లక్షణం ఏమిటంటే.. ఇవి కొన్నిసార్లు ఒక మంచి సలహాను తప్పుడు సమాచారంతో కలిపి చెప్తుంటాయి.
జనం తమ చేతులను తరచుగా శుభ్రంగా కడుక్కోవాలంటూ (మంచి సలహా) సూచిస్తూనే.. వైరస్ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించకుండా నివారించటానికి క్రిమినాశినితో పుక్కిలించాలని (ఇది పనిచేస్తుందనే ఆధారం లేదు) కూడా చెప్తున్న మెసేజీలు మేం చూశాం.
పరిశోధన: ఓల్గా రాబిన్సన్, లారా గోజీ, థామస్ పాబ్రీ
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది

ఇవి కూడా చదవండి
- ప్రపంచంలోనే హెచ్ఐవీని జయించిన రెండో వ్యక్తి.. ఎలా నయమయ్యిందంటే?
- హరియాణా స్కూళ్లలో తెలుగు భాషా బోధన... అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాతయ్య అంటూ మాట్లాడుతున్న విద్యార్థులు
- జ్యోతిరాదిత్య సింధియా: గ్వాలియర్ రాకుమారుడు, అత్యంత సంపన్న రాజకీయవేత్త గురించి తెలుసుకోవలసిన 10 విషయాలు
- ఒక వ్యక్తి ఎందుకు ఉన్మాదిగా మారతాడు? మంచి ఉన్మాదులు కూడా ఉంటారా?
- డబ్ల్యూహెచ్ఓ: కరోనావైరస్ ప్రపంచవ్యాప్త మహమ్మారి.. ఏప్రిల్ 15 వరకు వీసాలు సస్పెండ్ చేసిన భారత్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









