123 ఏళ్ల నాటి ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ (అంటువ్యాధుల నివారణ చట్టం)-1897 ఏం చెబుతోంది?

మాస్క్ ధరించిన మహిళ

ఫొటో సోర్స్, Getty Images

కోవిడ్-19 వ్యాధికి గురైన బాధితులు వైద్యం తీసుకోకుండా పారిపోకుండా ఉండేందుకు లేదా నిర్బంధంలో ఉండటానికి నిరాకరించినపుడు వారిని అదుపులోకి తీసుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ (అంటువ్యాధుల నివారణ చట్టం)-1897ని అమలు చేసింది. ఇది 123 ఏళ్ల నాటి చట్టం.

కర్ణాటకలోని మంగళూరులో కరోనా‌వైరస్ లక్షణాలు గుర్తించిన ఒక రోగి హాస్పిటల్ నుంచి ఆదివారం రాత్రి పారిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేసింది.

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్‌లో కూడా కరోనా లక్షణాలు కన్పించిన ఒక వ్యక్తి హాస్పిటల్ నుంచి పారిపోయారు. ఆ వ్యక్తిని హాస్పిటల్ సిబ్బంది పట్టుకుని చికిత్స కోసం హైదరాబాద్‌కి తరలించారు. అయన దుబాయ్ నుంచి 15 రోజుల క్రితం తన సొంత ఊరికి వచ్చినట్లు ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం‌లో పేర్కొంది.

News image

ఈ చట్టం ఏం చెబుతుంది?

ఈ చట్టం భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది.

అమలులో ఉన్న చట్టాల ద్వారా ఏదైనా మహమ్మారిని అరికట్టడం సాధ్యం కాని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని వాడి వ్యాధుల్ని అరికట్టే చర్యలు చేపట్టవచ్చు.

ఈ చట్టాన్ని అనుసరించి రాష్ట్రంలో అన్ని స్థాయుల్లో విద్యా సంస్థల్ని మూసి వేయడానికి, సరిహద్దు ప్రాంతాలని సీజ్ చేయడానికి, రోగులని హాస్పిటల్‌లో కానీ, నిర్బంధం‌లో కానీ ఉంచడానికి ఈ చట్టం అధికారులకి వీలు కల్పిస్తుంది.

అయితే, నవంబర్ 01, 1956 ముందు పార్ట్-బి లో ఉన్న రాష్ట్రాలకి ఇది వర్తించదు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు

రైలు లేదా ఇతర మార్గాల ద్వారా ప్రయాణించే వారికి వైద్య పరీక్షలు నిర్వహించే హక్కు అధికారులకి ఉంటుంది.

వ్యాధి సోకిన రోగులను హాస్పిటల్లో విడిగా ఉంచవచ్చు.

పరీక్షలు నిర్వహించే అధికారి ఎవరికైనా వ్యాధికి గురైన అనుమానితులను అదుపు‌లోకి తీసుకుని వైద్యం అందించే హక్కు ఉంటుంది.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

కేంద్ర ప్రభుత్వ అధికారాలు

ఈ చట్టాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఏదైనా ఓడలో కానీ, దేశంలో వివిధ ఓడరేవులలో ఉన్న షిప్‌లలో ప్రయాణించే ప్రయాణికులు, సిబ్బందికి వైద్య పరీక్షలు జరిపే హక్కు ఉంటుంది.

ఎవరికైనా వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉన్నట్లయితే వారిని అదుపులోకి తీసుకుని నిర్బంధంలో పెట్టే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది.

కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఈ చట్టాన్ని అతిక్రమిస్తే శిక్ష ఏమిటి

ఈ చట్టాన్ని ధిక్కరించిన వారికి భారతీయ శిక్షా స్మృ తి‌లోని సెక్షన్ 188 ప్రకారం శిక్ష విధించవచ్చు.

చట్టాన్ని అమలు చేసే ప్రక్రియలో అధికారులపై చట్టపరమైన కేసులు నమోదు చేసేందుకు వీలులేదు.

ఈ చట్టం ప్రకారం... ఎవరైనా రోగి వైద్యం తీసుకోవడానికి గాని, అది మరింత వ్యాప్తి చెందకుండా నిర్బంధంలోకి వెళ్ళడానికి నిరాకరించినా అటువంటి వారిని నిర్బంధంలోకి తీసుకుని చికిత్స అందించే అధికారం ఉంటుంది. వైద్య పరీక్షల ఫలితాలు వచ్చిన రోజు నుంచి 14 రోజుల వరకు రోగిని అదుపులో ఉంచవచ్చు.

సెక్షన్ 188 ప్రకారం... ఎవరి ప్రాణానికైనా భంగం వాటిల్లే విధంగా ప్రవర్తిస్తే ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా 1000 రూపాయల వరకు జరిమానా విధించవచ్చు.

కరోనా వైరస్

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం

తెలంగాణలో తొలి కరోనావైరస్ కేసు బయటపడిన తర్వాత అప్రమత్తమైన ప్రభుత్వం అనేక చర్యల్ని చేపడుతోంది.

అందులో భాగంగా ఇప్పటి వరకు 47 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 45 మందికి కోవిడ్-19కి సంబంధించి ఎలాంటి లక్షణాలు లేవని తేలినట్టు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

సోషల్ మీడియాలో అనవసరపు ప్రచారాలు చెయ్యవద్దని మంత్రి సూచించారు. రాష్ట్రంలో ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ వార్డుల దగ్గర కూడా చికిత్స తీసుకునేందుకు అనుమతి ఇచ్చామని చెప్పారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్-19ని ప్రపంచవ్యాప్త మహమ్మారిగా ప్రకటించింది.

భారత ప్రభుత్వ కేబినెట్ కార్యదర్శి ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్-1897, సెక్షన్-2ని అమలు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్ర పాలిత ప్రాంతాలకి ఆదేశాలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)