ఇటలీ: రోమ్ ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయిన విద్యార్థులకు ఊరట.. వైద్య పరీక్షలు జరిపిస్తామన్న భారత ప్రభుత్వం

- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇటలీలో చిక్కుకుపోయిన విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.
వారి నుంచి (రక్తం) నమూనాలను తీసుకుంటామని, పరీక్షల్లో కరోనావైరస్ లేదని తేలినవారిని భారతదేశం వచ్చేందుకు అనుమతిస్తామని, భారత్ వచ్చిన తర్వాత 14 రోజుల పాటు నిర్బంధంలో ఉంచుతామని ప్రకటించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అటు.. ఇటలీలోని భారత రాయబార కార్యాలయం కూడా విద్యార్థుల అంశంపై స్పందించింది.
ఇటలీలో ఉన్న, మార్చి 10వ తేదీ, ఆ తర్వాత భారతదేశానికి తిరిగి వెళ్లాలని విమాన టిక్కెట్లు కొనుక్కున్న విద్యార్థులంతా తమ పేరు, మొబైల్ నంబర్, ఈ మెయిల్, పాస్‌పోర్ట్ నంబర్, యూనివర్శిటీ పేరు మొదలైన వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలని ఇటలీలోని భారత రాయబార కార్యాలయం కోరింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
రోమ్‌లో చిక్కుకుపోయిన విద్యార్థుల్లో పలువురు తెలుగువాళ్లు వీడియోల ద్వారా తమ పరిస్థితిని తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు. తమకు సహాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను కోరారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 1
ఈ వీడియోలను కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, ఇటలీలోని భారత రాయబార కార్యాలయానికి ట్యాగ్ చేస్తూ.. విద్యార్థులకు సహాయం చేయాలని కేటీఆర్ కోరారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
‘మొత్తం 84 మంది విద్యార్థులు’
రోమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 84 మంది భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయారని, వీరిలో ఎక్కువమంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారేనని ఇటలీలో నివశిస్తున్న తెలుగువ్యక్తి సిద్ధార్థ్ బీబీసీకి తెలిపారు.
ఇటలీలోని ‘ల సపియన్జ యూనివర్శిటీ’లో అంతర్జాతీయ న్యాయశాస్త్రం అభ్యసిస్తున్నట్లు ఆయన చెప్పారు.
బీబీసీ తెలుగుతో గురువారం ఉదయం ఫోన్‌లో సిద్ధార్థ మాట్లాడుతూ.. ‘‘నేను ఇటలీలోనే ఉంటున్నాను. విమానాశ్రయంలో విద్యార్థులు చిక్కుకుపోయారు. కరోనావైరస్ సోకలేదని మెడికల్ సర్టిఫికెట్ తీసుకురావాలని, అలా సర్టిఫికెట్ ఉన్నవారినే విమానం ఎక్కనిస్తామని అధికారులు అంటున్నారు. ఇక్కడ దేశం మొత్తాన్ని దిగ్బంధించారు. ఇటలీవాసులకే సరైన వైద్యసేవలు అందటం లేదు. పైగా వైద్యం చాలా ఖరీదు. ఇలాంటి పరిస్థితుల్లో వైద్య సర్టిఫికెట్ సంపాదించడం చాలా కష్టం’’ అని చెప్పారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
విజయవాడకు చెందిన వంశి రెండేళ్లుగా ఇటలీలో నివసిస్తున్నారు. మిలాన్‌లో పీజీ చదువుతున్నారు. అయితే, భారత్ తిరిగి వెళ్దామనుకుంటే, విమానయాన సంస్థలు తీసుకెళ్లకపోవడంతో ఆయన అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.
"ఎయిర్ ఇండియా టికెట్లు అమ్ముతుండడంతో నేను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నాను. వెబ్ చెక్-ఇన్ కూడా చేశాను. కానీ, కోవిడ్-19 వైరస్ సోకలేదని మెడికల్ సర్టిఫికేట్ తీసుకొచ్చిన వారినే విమానం ఎక్కనిస్తామని అధికారులు చెబుతున్నారు. మాకు ఆ సర్టిఫికేట్ లేదు, అసలు అలాంటిది ఒకటి ఇస్తారని కూడా మాకు తెలియదు" అంటూ మిలాన్ నుంచి బీబీసీ తెలుగుతో మాట్లాడుతూ చెప్పారు వంశీ.
వంశీ ఒక్కరే కాదు, ఆయనలాగే చాలామంది విద్యార్థులు భారత్ తిరిగి రావడానికి విమానాశ్రయానికి వచ్చారు. వారిలో చెన్నైకి చెందిన స్వాతి ఉన్నారు. కనీసం భోజనం, నీళ్లు కూడా లేకుండా విమానాశ్రయానికి వచ్చామని స్వాతి చెప్పారు.
"ఎయిర్‌పోర్టులో ఉండడం మరింత ప్రమాదకరమన్న ఆలోచనతో మిలాన్‌లోని ఇంటికి వచ్చేశాం. మమ్మల్ని స్వదేశం తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తుందని ఎదురు చూస్తున్నాం" అని అన్నారు స్వాతి.
ఆమె ఏడాదిగా ఇటలీలోని పాలిటెక్నికో ది మిలానో యూనివర్సిటీలో చదువుతున్నారు.

- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ సోకితే మనిషి శరీరానికి ఏమవుతుంది?
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు


ఫొటో సోర్స్, Getty Images
విమానాశ్రయంలో సమాధానం చెప్పేవారు కానీ, సమాచారం ఇచ్చే వారు కానీ లేరని స్వాతి అంటున్నారు. భారత ప్రభుత్వ ప్రతినిధులు కూడా అక్కడ ఎవరూ లేరని ఆమె చెప్పారు.
వంశీ కూడా అదే విషయం చెప్పారు. "బుధవారం ఉదయం ఇక్కడెందుకున్నారని మొదటిసారి విమానాశ్రయం పోలీసులు మమ్మల్ని అడిగారు. మా సమస్య విన్నాక, వెంటనే ఇళ్లకు వెళ్లిపోవాలని, తరువాత సమాచారం ఇస్తామని చెప్పారు. రోమ్‌లో ఉన్న రాయబార కార్యాలయాన్ని సంప్రదించే ప్రయత్నం కూడా చేశాం. వాళ్లూ స్పందించలేదు. ఇదేం న్యాయం? మేం టికెట్లు కొని కూడా వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. కానీ, మాకిప్పుడు మెడికల్ సర్టిఫికెట్లు ఎలా వస్తాయి? ఇప్పటికే ఇక్కడ వ్యవస్థ గందరగోళంగా ఉంది" అని అన్నారు వంశీ.
ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా స్తబ్దుగా, మూసివేయబడి ఉందంటున్నారు వారు.
''ఇక్కడ పరిస్థితేం బాలేదు. మేం భద్రంగా ఉన్నామనిపించడం లేదు. కరోనా వైరస్ వ్యాప్తితో ఈ ప్రాంతం అంతా మూతపడిపోయింది'' అని స్వాతి అన్నారు. ఇంకా భారతీయ అధికారుల స్పందన కోసం చూస్తున్నామని చెప్పారు.
"మేం విమానం ఎక్కలేకపోయాం. భారత ప్రభుత్వం మా మెడికల్ సర్టిఫికేట్ అడుగుతోంది. కానీ, ఇంత గందరగోళం, జనం మధ్య ఆ సర్టిఫికేట్ దొరకడం కష్టం. దానికితోడు భాష సమస్య కూడా ఉంది'' అంటూ వీడియో పంపించిన మరో అమ్మాయి అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, వారిని భారత అధికారులు విద్యార్థులను సంప్రదించినట్టు తెలుస్తోంది.
"మమ్మల్ని పరీక్షించడానికి వైద్య బృందాన్ని పంపిస్తామని భారత అధికారులు చెప్పారు" అన్నారు స్వాతి. భారత అధికారుల తదుపరి ఆదేశాల కోసం వారు ఎదురు చూస్తున్నారు.
వైరస్ ప్రభావం ఉన్న దేశాల నుంచి ప్రయాణికులు వచ్చే విషయంలో భారత ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించింది.
"ఇటలీ, దక్షిణ కొరియాల నుంచి వచ్చే భారతీయులు, ఓసీఐలు కూడా తమకు కోవిడ్- 19 సోకలేదని అక్కడి ల్యాబులు ఇచ్చే సర్టిఫికేట్ తీసుకుని రావాలి" అని ఉత్తర్వులు జారీ చేసింది.
ఈలోపు సోషల్ మీడియాలో ఒక వీడియో వచ్చింది. మలయాళం మాట్లాడుతున్న కొందరు తమను తిరిగి భారత్ తీసుకురావాలని అందులో కోరుతున్నారు.
"మేం ఎవరితోనూ కలవకుండా విడిగా ఉండటానికి ఇబ్బంది లేదు. మేం ఎటూ పారిపోము. మాలో పిల్లలు, గర్భిణీలు కూడా ఉన్నారు" అంటూ ఆ వీడియోలో మాట్లాడిన వారిలో ఒకరు చెప్పారు. తామెటు వెళ్లాలంటూ మరొకరు ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రయాణ ఆంక్షలను భారత ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని కేరళ ముఖ్యమంత్రి విజయన్, ప్రధాని మోదీకి లేఖ రాశారు.
"ఈ ఉత్తర్వుల వల్ల విదేశాల నుంచి రావాలనుకున్న భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యాధి మరింత వ్యాపించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలనడంలో ఎటువంటి భిన్నాభిప్రాయమూ లేదు. కానీ, ఇలాంటి పరిస్థితుల్లో వెనక్కు రావాలనుకున్న భారతీయులను ఇలాంటి ఆంక్షల ద్వారా ఇబ్బంది పెట్టడం అనవసరం. కావాలంటే వాళ్లు రాగానే పరీక్షించి, అవసరమైతే వారిని విడిగా ఉంచవచ్చు. దానికి తగిన సదుపాయాలు మన దేశంలో ఉన్నాయి" అని విజయన్ రాశారు.
"మీరు తక్షణం జోక్యం చేసుకుని ఈ ఉత్తర్వులు వెనక్కు తీసుకోవాలని అధికారులను ఆదేశించగలరు. దాని ద్వారా టికెట్లు కొనుక్కుని కూడా ఇటలీ విమానాశ్రయంలో ఉండిపోయిన భారతీయులు వెనక్కు తిరిగి రాగలుగుతారు'' అని అన్నారాయన.
కరోనావైరస్ విజృంభణ నేపథ్యంలో ఇటలీ దేశవ్యాప్తంగా ఆహారం, మందుల షాపులు మినహా మిగతా అన్ని షాపుల్ని మూసేసింది. యూరప్‌లో అత్యంత కఠినమైన ఆంక్షలు విధించిన దేశం ఇటలీనే. ఈ దేశంలో కరోనావైరస్ కేసులు, మరణాలు కూడా ఆందోళనకరమైన రీతిలో పెరుగుతున్నాయి.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 2
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ 30 రోజుల పాటు యూరప్ నుంచి అమెరికాకు అన్ని రకాల ప్రయాణాలను రద్దు చేశారు.
భారతదేశం సైతం కఠిన చర్యలు తీసుకుంది. ప్రస్తుతం ఉన్న అన్ని వీసాలు (డిప్లొమేటిక్, అఫీషియల్, ఐరాస, అంతర్జాతీయ సంస్థలు, ఉద్యోగ, ప్రాజెక్టు వీసాలు తప్ప) ఏప్రిల్ 15 వరకూ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది మార్చి 13 నుంచి అమల్లోకి వస్తుంది.
అత్యవసరం అయితే తప్ప భారతదేశానికి రావొద్దని విదేశాల్లో ఉన్న భారత పౌరులతో సహా విదేశీయులకు చెప్పింది. అలాగే అత్యవసరం అయితే తప్ప విదేశాలకు వెళ్లొద్దని భారతీయులకు తెలిపింది.
ఇటలీతో పాటు చైనా, ఇరాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీల నుంచి ఫిబ్రవరి 15 తర్వాత వచ్చిన భారతీయులు లేదా విదేశీయులను 14 రోజుల పాటు క్వారంటైన్ చేస్తారు.

ఇవి కూడా చదవండి
- కరోనావైరస్: యూరప్ నుంచి అమెరికాకు అన్ని ప్రయాణాలూ రద్దు చేసిన డోనల్డ్ ట్రంప్
- కరోనావైరస్ ప్రభావంతో విమానయాన సంస్థలు దివాలా తీయనున్నాయా...
- కరోనావైరస్ టెన్షన్: టాయిలెట్ పేపర్లను జనం వేలం వెర్రిగా ఎందుకు కొంటున్నారు?
- కరోనావైరస్: కోట్లాది మంది ప్రాణాలు తీసిన స్పానిష్ ఫ్లూ నుంచి మనం నేర్చుకోగల పాఠాలేమిటి?
- హ్యాండ్‌షేక్ చరిత్ర.. ఎప్పుడు, ఎందుకు, ఎలా పుట్టింది?
- కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా మందుల కొరతకి దారి తీయవచ్చా?
- డబ్ల్యూహెచ్ఓ: కరోనావైరస్ ప్రపంచవ్యాప్త మహమ్మారి.. ఏప్రిల్ 15 వరకు వీసాలు సస్పెండ్ చేసిన భారత్.. ఆ దేశాల నుంచి వచ్చేవారంతా 14 రోజులు నిర్బంధంలోనే
- హాలీవుడ్ నటుడు టామ్ హ్యాంక్స్, ఆయన భార్య రీటా విల్సన్‌కు కరోనా వైరస్
- ప్రపంచంలోనే హెచ్ఐవీని జయించిన రెండో వ్యక్తి.. ఎలా నయమయ్యిందంటే?
- హరియాణా స్కూళ్లలో తెలుగు భాషా బోధన... అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాతయ్య అంటూ మాట్లాడుతున్న విద్యార్థులు
- ఒక వ్యక్తి ఎందుకు ఉన్మాదిగా మారతాడు? మంచి ఉన్మాదులు కూడా ఉంటారా?
- కరోనావైరస్: శశిథరూర్ మెడలోని ఈ గాడ్జెట్ వైరస్‌లను అడ్డుకుంటుందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









