కరోనావైరస్: డాక్టర్ల మీద దాడులు... ఉమ్మి వేస్తూ అవమానాలు

డాక్టర్లు

ఫొటో సోర్స్, MajorityWorld

    • రచయిత, వికాస్ పాండే
    • హోదా, బీబీసీ న్యూస్

భారతదేశంలో కరోనావైరస్ విజృంభణను నివారించటానికి పోరాడుతున్న పలువురు వైద్య సిబ్బంది మీద దాడులు జరిగాయి.

డాక్టర్ల మీద ఉమ్మటం, తరిమివేయటం వంటి సంఘటనలు జరిగాయని, ఒక చోట అయితే చికిత్స పొందుతున్న రోగులు మహిళా నర్సులను అసభ్య పదజాలంతో తిట్టారని వార్తలు వచ్చాయి.

కోవిడ్-19 సోకిన రోగులకు చికిత్స అందిస్తున్నందున, కొందరు వైద్యుల కుటుంబాలను ఇరుగుపొరుగు వారు సామాజికంగా బహిష్కరించిన ఉదంతాలూ ఉన్నాయి.

దేశంలో ఇప్పటివరకూ 3 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 75 దాటింది.

ఇండోర్ నగరంలో వ్యక్తిగత భద్రత పరికరాలు ధరించిన మహిళా డాక్టర్ల మీద ఒక గుంపు రాళ్లు విసురుతున్న వీడియో వైరల్‌గా మారింది.

ఆ డాక్టర్లు కోవిడ్-19 ఉన్నట్లు అనుమానం ఉన్న ఒక మహిళను తనిఖీ చేయటానికి జనం అధికంగా నివసించే ఒక ప్రాంతానికి వెళ్లినపుడు ఈ దాడి జరిగింది.

ఆ దాడిలో గాయపడినా కూడా, ‘‘నా బాధ్యతను నిర్వర్తించకుండా అది నన్ను భయపెట్టదు’’ అని ఆ వీడియోలో కనిపించిన జాకియా సయ్యద్ అనే ఒక డాక్టర్ చెప్పారు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

‘‘అనుమానిత కేసులను ప్రాథమికంగా పరీక్షించటానికి ఎప్పటిలాగానే వెళ్లాం. కానీ, మా మీద దాడి జరుగుతుందని మేం ఊహించలేదు’’ అని ఆమె బీబీసీకి తెలిపారు.

‘‘ఇటువంటి దృశ్యాలు ఎప్పుడూ చూడలేదు. అది భయం కలిగించింది. ఎలాగోలా ఆ గుంపు నుంచి తప్పించుకున్నాం. నేను గాయపడ్డాను కానీ.. నా పని చేయటానికి భయమేమీ లేదు’’ అన్నారామె.

‘‘ప్రజలను సురక్షితంగా ఉంచటం కోసం మేం పనిచేస్తున్నాం. ఒక వ్యక్తి ఓ కోవిడ్-19 రోగిని కలిసినట్లు మాకు సమాచారం వచ్చింది. మేం ఆ వ్యక్తితో మాట్లాడుతున్నపుడు స్థానికులు ఆగ్రహిస్తూ మా మీద దాడి చేశారు’’ అని వివరించారు.

ఆ సంఘటనకు సంబంధించి ఏడుగురిని అరెస్ట్ చేశారు.

ఇండోర్‌లోని కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ సభ్యుడైన డాక్టర్ ఆనంద్ రాయ్ బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘వైద్య బృందం మీద ఇటువంటి దాడి ఏ విధంగానూ సమర్థనీయం కాదు. కానీ.. ప్రభుత్వం మీద అపనమ్మకం ఉండే ముస్లింలు అధికంగా గల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది’’ అని పేర్కొన్నారు.

ఈ ప్రాంతంలో ఇటీవల వివాదాస్పద పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయని ఆయన చెప్పారు.

‘‘కాబట్టి ఆ ఆగ్రహం ఈ దాడి రూపంలో వ్యక్తమయింది. కారణం ఏదైనా కానీ హింస సమర్థనీయం కాదు. ప్రత్యేకించి జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్ల మీద దాడులు చేయటం ఏమాత్రం మంచిది కాదు’’ అన్నారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

ఇదిలావుంటే, ఘాజియాబాద్‌లోని ఒక ఆస్పత్రిలో గురువారం అవాంఛిత సంఘటనలు చోటుచేసుకున్నాయి.

దేశవ్యాప్తంగా వందలాది కరోనావైరస్ పాజిటివ్ కేసులతో సంబంధం ఉందని చెప్తున్న తబ్లీగీ జమాత్ మత కార్యక్రమానికి హాజరైన వారిలో 21 మందిని ఈ ఆస్పత్రిలో క్వారంటైన్‌లో ఉంచారు. వారిలో కొందరు.. వైద్య సిబ్బందిని దుర్బాషలాడారని ఆరోపిస్తున్నారు.

‘‘ఆస్పత్రి వార్డులో కొందరు నగ్నంగా నడుస్తూ, మహిళా డాక్టర్లు, నర్సులను వేధించారు. సిగరెట్లు, పొగాకు కావాలని అదే పనిగా అడిగారు’’ అని ఆ ఆస్పత్రిలో పనిచేసే ఒక డాక్టర్ బీబీసీతో చెప్పారు.

వైద్యులు ఫిర్యాదు చేయటంతో కొందరి మీద కేసులు నమోదు చేసినట్లు నగర సీనియర్ పోలీస్ అధికారి ఒకరు బీబీసీకి తెలిపారు. అయితే.. పరిస్థితి తీవ్రతను వారికి అర్థమయ్యేలా చెప్పటానికి పోలీసులు ఇంకా ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

దిల్లీ నగరంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినట్లు వార్తలు వచ్చాయి.

తబ్లీగా జమాత్‌కు హాజరైన వారిలో కొందరిని రైల్వే విభాగం నడుపుతున్న క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు. వారిలో కొందరు డాక్టర్ల మీద ఉమ్మి, అసభ్యంగా ప్రవర్తించారని చెప్తున్నారు.

వారికి కౌన్సిలింగ్ ఇచ్చామని, వారిప్పుడు సిబ్బందికి సహకరిస్తున్నారని, పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉందని నార్తరన్ రైల్వేస్ అధికార ప్రతినిధి దీపక్ కుమార్ తెలిపారు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, SOPA IMAGES

ఫొటో క్యాప్షన్, కరోనావైరస్

వైద్య సిబ్బందికి మరింత భద్రత అందించాలని కోరుతూ దిల్లీ ప్రభుత్వం పోలీసులకు లేఖ రాసినట్లు కూడా వార్తలు వచ్చాయి.

హైదరాబాద్ నగరంలో, సూరత్ నగరంలోనూ డాక్టర్లు, నర్సుల మీద దాడులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. గాంధీ ఆస్పత్రిలో కరోనావైరస్ రోగులకు చికిత్స చేస్తున్న ఒక డాక్టరు మీద బుధవారం దాడి జరిగింది.

దోషుల మీద కఠిన చర్యలు చేపడతామని పోలీసులు సదరు డాక్టరుకు హామీ ఇచ్చారు.

అయితే, వైద్య సిబ్బందికి ఇటువంటి చేదు అనుభవాలు కేవలం పనిచేసే చోటులోనే కాదు.. వారి ఇళ్ల దగ్గరా ఎదురవుతున్నాయి.

‘‘మేం నివసిస్తున్న భవనంలో నన్ను, నా కుటుంబాన్ని ఉండనివ్వకూడదని మా ఇరుగుపొరుగు వారు భావిస్తున్నట్లు నాకు తెలిసి చాలా మనోవేదనకు గురయ్యాను’’ అని పేరు వెల్లడించటానికి ఇష్టపడని ఒక డాక్టర్ తెలిపారు.

‘‘మేం మా కుటుంబాలను కూడా కలవటం లేదు. మా కుటుంబాలు క్షేమంగా ఉండాలని మేం కోరుకుంటున్నాం. కానీ మేం మా విధులు నిర్వర్తిస్తున్నందుకు మా పట్ల వివక్ష చూపుతున్నారు’’ అన్నారు.

దేశ వ్యాప్తంగా కోవిడ్-19 రోగులకు చికిత్స చేస్తున్న డాక్టర్లలో అనేక మందికి కరోనావైరస్ సోకింది. ఈ సమయంలో మా వృత్తి ఎంత కఠినమైనదో ఇది చెప్తోంది. వైరస్ మీద యుద్ధంలో గెలవాలంటే మాకు అందరి మద్దతూ అవసరం. కానీ ఇంత బాహాటంగా మా పట్ల వివక్ష చూపుతోంటే చాలా బాధగా ఉంది. కానీ మాకు వేరే దారి లేదు’’ అని చెప్పారామె.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)