కరోనావైరస్: రోజుల బిడ్డ ఉన్నా.. కోవిడ్-19 సమయంలో విధుల్లో చేరిన ఓ ఐఏఎస్ ఆఫీసర్ అనుభవం

- రచయిత, గుమ్మళ్ల సృజన, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్
- హోదా, బీబీసీ కోసం
దగ్గరుండి సంరక్షించుకోవాల్సిన రోజుల బిడ్డ ఉన్నప్పటికీ, కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో తన ప్రసూతి సెలవును రద్దుచేసుకుని విధుల్లో చేరిన ఆంధ్ర ప్రదేశ్‌లోని విశాఖపట్నం నగర మున్సిపల్ కమిషనర్ గుమ్మళ్ల సృజన బీబీసీతో పంచుకున్న అనుభవాలివీ.
"బహుశా మీరందరూ.. మీరేంటి, దేశంలోని అందరూ లాక్ డౌన్‌లో హోం క్వారంటైన్‌లో గడుపుతున్న సమయం.
నాకూ ఇది ఓ ప్రత్యేక సందర్భమే...!
మహిళగా, ప్రభుత్వ అధికారిగా నా బాధ్యతలు, హక్కుల వినియోగంలో 'విచక్షణ' పాటించాల్సిన సమయం.
బహుశా, ఈ వ్యావహారిక ప్రపంచంలో అందరూ ఎప్పుడో ఒకప్పుడు మానసిక ఉద్వేగాల సంఘర్షణకు గురికాక తప్పదు.

ప్రసూతి సెలవు హక్కును విధిగా వినియోగించుకోవాల్సిందేనా?
నిజమే, ఎన్నో చారిత్రక పోరాటాల ఫలితంగా, ప్రసూతి సెలవు హక్కును తల్లులుగా మనం సాధించుకున్నాం. దానిమీద నాకు అపారమైన గౌరవం ఉంది. అయితే, మనకు సంక్రమించే హక్కులనన్నింటినీ, అన్ని సందర్భాల్లో, సమయాల్లో విధిగా అనుభవించక తప్పదా? ఆ హక్కును వినియోగించుకోకుండా ఉండే స్వేచ్ఛ మనకు లేదా? ఇదే నా ప్రశ్న.
ఆ స్ధాయి దాటి ముందడుగు వేయాలని భావించా. సాధించిన హక్కు వినియోగంపై స్వేచ్ఛ ఉండాలని నేను భావిస్తాను.
నా విషయానికే వస్తే, అధికారిగా నాకు ప్రభుత్వం అనేక మౌలిక సౌకర్యాలను అందిస్తోంది. దురదృష్టం ఏమిటంటే, ఎవరి కోసం ప్రభుత్వం పనిచేస్తోందో వారికి మాత్రం ఈ రకమైన సౌకర్యాలు అందుబాటులో ఉండవు. ఇక నా కుటుంబం కూడా ఎంతో సహకరిస్తోంది. బిడ్డ స్నానం తదితర పనులు మా అమ్మ చూసుకుంటే, బిడ్డ డైపర్లను నా భర్త మారుస్తారు. బిడ్డ పట్ల వారి ప్రేమ నిర్వచనాలకు అందనిది.

ప్రసూతికి ముందూ తరువాతా కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా ఆరోగ్యం గురించి, బిడ్డ బాగోగుల గురించి ప్రత్యేకంగా కనుక్కుని, వృత్తి రీత్యా అనేక వెసులుబాట్లు కల్పించారు.
ఇప్పుడిక, కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తున్న సందర్భంలో నేను ప్రసూతి సెలవు కొనసాగిస్తే, వేరే ఒకరు మహా విశాఖ నగరపాలక సంస్ధకు కమిషనర్‌గా రావాలి. నూతన అధికారికి విశాఖ నగర ప్రత్యేకతలు అర్థం కావడం, అధికారులు, సిబ్బందితో సమన్వయం ఏర్పడడానికి మరికొంత సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో 22 రోజుల పసిబిడ్డను ఇంటి దగ్గర వదిలి, 6 నెలలు తీసుకోవాల్సిన ప్రసూతి సెలవులను రద్దు చేసుకుని, పై అధికారుల అనుమతితో విధుల్లో చేరాలని నిశ్చయించుకున్నా.

- కరోనావైరస్ గురించి ఇంకా మనకెవరికీ తెలియని 9 విషయాలు..
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్: ఈ మహమ్మారి ఎప్పుడు ఆగుతుంది? జనజీవనం మళ్లీ మామూలుగా ఎప్పుడు మారుతుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు


నిజమే, ప్రసూతి కాలం ఓ మానసిక ఉద్విగ్న సమయమే!
అలాగే, ప్రతి శిశువూ భావి సమాజ సంపదే!
ఈ సమాజం నాకందించిన అపురూప కానుకకు ప్రతిగా, సమాజ సంరక్షణ కోసం, నా హక్కుల విచక్షణ పాటించాలని అడుగేస్తున్నా.
ప్రసూతి సెలవును పరిరక్షించుకోవాలని చాలామంది భావిస్తారు. కానీ ఈ సెలవు వృత్తి పరంగా ఎదగడానికి ప్రతిబంధకం కారాదు, దాన్ని నేను అధిగమించాలనుకుంటున్నాను. నేను స్వేచ్ఛ కలిగిన వ్యక్తినని, ఎదగాలని ఆకాంక్షిస్తాను, నా ఆకాంక్షను సాకారం చేసుకుంటాననే నమ్మకం నాకు ఉంది. నా బిడ్డ అంటే నాకెంతో ఇష్టం, ప్రేమ. వాడికి కూడా అన్ని సౌకర్యాలు అందించాలి.

ఇప్పుడు నా రోజు ఎలా గడుస్తోందంటే...
ఉదయం 5 గంటలకే నా కుటుంబ, వృత్తి జీవితాలు జమిలిగా మొదలవుతాయి.
ముందుగా నా బిడ్డ అవసరాలు చూసుకుంటాను.
తర్వాత వివిధ అధికారులతో ఫోన్ సంభాషణ, మెసేజ్‌లు, రోజువారీ పనిపై ప్రణాళిక రూపకల్పన వంటి అంశాలపై దృష్టి పెడతాను.
ఉదయం 8.30 గంటలకు బ్రేక్‌ఫాస్ట్ ముగిస్తాను.
మెషీన్ ద్వారా బాటిల్‌లో పాలు నింపుతాను. అవసరమైనపుడు బిడ్డకోసం పాలు పట్టేందుకు మెషీన్ వాడడం తప్పుకాదని నా నమ్మకం.
తర్వాత ఆఫీస్‌కు చేరుకుని రోజువారీ కార్యకలాపాల్లో నిమగ్నమవుతా.
అక్కడి నుంచి నగరంలోని వివిధ వార్డుల పర్యటన, కరోనావైరస్ వ్యాప్తి పరిశీలన, బాధితులను గుర్తించడం, రేపటి కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళిక రూపకల్పనపై దృష్టి పెడతా.

మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి చేరుకుంటా.
స్నానం చేసి, శానిటైజర్‌తో చేతులు శుభ్రపరచుకొని బిడ్డ దగ్గరకి వెళ్లి పాలు ఇస్తాను.
తర్వాత సాయంత్రం 4 గంటల వరకూ టెలీ కాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సులు కొనసాగుతాయి.
4 గంటలకు చాయ్ టైం.
బిడ్డ కోసం మెషీన్ ద్వారా పాలు బాటిల్‌లో పంప్ చేస్తా, అనంతరం నగర పర్యటనకు బయలుదేరతాను.
నగర పాలక సంస్థ విభాగాల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తాను
తిరిగి టెలీ, వీడియో కాన్ఫరెన్సులకు హాజరవుతాను.
రాత్రి 9-10 గంటల మధ్యలో ఇంటికి చేరుకుంటా. మళ్లీ ఫ్రెష్ అయ్యి, భోజనం చేసి, బాబుకి పాలిస్తా.
రేపటి పని ప్రణాళిక కోసం ఇతర అధికారులతో టెలిఫోన్‌లో చర్చలు నిర్వహిస్తా.
ఇదీ ప్రస్తుతం నా రోజువారీ జీవితం... ఇదే నేను కోరుకున్న జీవితం.
ఒక్కమాట!
అధికారిగా ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు, కుటుంబం అందిస్తున్న సహకారంతో ఈ ప్రసూతి సెలవు హక్కును వినియోగించుకోకుండా ఉండే స్వేచ్ఛను పొందుతున్నాను. హక్కును ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉండాలన్నది నా నిశ్చితాభిప్రాయం.
పిల్లల సంరక్షణలో (ప్రసూతి సమయంలో) మగవారికి కూడా సమాన బాధ్యత ఉంటుందని సమాజం గుర్తించాలి.
ఎన్నో సందర్భాల్లో మగవారి సెలవు దరఖాస్తులను తిరస్కరించినా, ప్రసూతి సమయంలో సెలవులు మంజూరుచేయాలి. ప్రసూతి సెలవు మహిళ వృత్తిపరంగా ఎదిగేందుకు ప్రతిబంధకం కారాదు. బిడ్డపై ప్రేమాభిమానాలను పంచుతునే, ఎదిగేందుకు మహిళకు సమాజం, కుటుంబం అవకాశం కల్పించాలి. అప్పుడే సాధించుకున్న హక్కుల వినియోగంలో విచక్షణ పాటించే వీలు, అవకాశం కలుగుతాయి."
ఇవి కూడా చదవండి.
- కరోనావైరస్: సామాజిక దూరం, స్వీయ నిర్బంధం అంటే ఏంటి? ఎవరిని ఒంటరిగా ఉంచాలి?
- తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయానికి ‘లాక్డౌన్’.. పంటను కోయలేరు, అమ్మలేరు..
- కరోనావైరస్: రోజూ పేపర్ తెప్పించుకోవచ్చా? కూరలు పళ్లు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
- ఈ దేశాల్లో ఒక్క కరోనావైరస్ కేసు కూడా నమోదు కాలేదు, ఎందుకు?
- ఇండియా లాక్డౌన్: వలస కార్మికుల కష్టాలు.. తప్పెవరిది? మోదీ ఎందుకు క్షమాపణ చెప్పారు?
- కరోనావైరస్: వెంటిలేటర్లకు ప్రత్యామ్నాయం తయారుచేసిన మెర్సిడెస్ ఫార్ములా వన్ టీం
- కరోనావైరస్: కాలినడకన ఇంటికి తిరిగి వెళ్తూ చనిపోయిన డెలివరీ మ్యాన్ చివరిసారి ఏం చెప్పాడు?
- కరోనావైరస్: కుక్కలు, పిల్లుల మాంసం తినడంపై నిషేధం విధించిన చైనా నగరం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








