కరోనావైరస్: సామాజిక దూరం, స్వీయ నిర్బంధం అంటే ఏంటి? ఎవరిని ఒంటరిగా ఉంచాలి?

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్ (కోవిడ్-19) వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రస్తుతం అనేక దేశాల్లో లాక్‌డౌన్ అమలులో ఉంది. ప్రజల కదలికలపై ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు విధించాయి.
ప్రభుత్వాలు ప్రజలకు ఏం చెబుతున్నాయో చూద్దాం.
- అందరూ ఇళ్లలోనే ఉండాలి, అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలి.
- నిత్యావసర సరకులు, మందుల కోసం కుటుంబంలో ఒకరు మాత్రమే బయటకు వెళ్లాలి. ఆ దుకాణాల దగ్గర కూడా తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలి.
- రక్తదానం, గాయపడిన వారికి, అనారోగ్యంతో ఉన్నవారికి సాయం చేసేందుకు వెళ్లొచ్చు.
- వైద్య సిబ్బందికి, పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు, మీడియా ప్రతినిధులకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుంది.
- గ్రామాల్లో రైతులు, వ్యవసాయ కూలీలు పనులకు వెళ్లొచ్చు. కానీ, వారు కూడా సామాజిక దూరం పాటించాలి.
- లాక్‌డౌన్ సమయంలో అన్ని రకాల ప్రయాణాలపై నిషేధం ఉంది. కాబట్టి, అత్యవసరమైతే తప్ప ఎవరూ రోడ్ల మీదికి రాకూడదు.
- బయట నుంచి ఇంటికి రాగానే తప్పనిసరిగా చేతులను సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు జాగ్రత్తగా కడుక్కోవాలి.
- కెఫేలు, రెస్టారెంట్లు, నైట్ క్లబ్బులు, సినిమా థియేటర్లు, పార్కులు, షాపింగ్ మాళ్లతో పాటు జనాలు గుమిగూడే అన్ని ప్రదేశాలూ మూసి ఉంటాయి.
- మీ ఇంట్లో, పెరట్లో పనులు చేసుకోండి. కుటుంబంతో గడపండి.
- మీరు విదేశాల నుంచి వచ్చి ఉంటే, తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలి.
- కరోనావైరస్ సోకినట్లు లక్షణాలు ఏమైనా కనిపిస్తే, వైద్యులకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. వారు వచ్చి అవసరమైతే మీకు పరీక్షలు చేస్తారు.
- ఏదైనా సమస్య ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి సాయం అడగొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
సామాజిక దూరం ఎందుకు?
సామాజిక దూరం పాటించాల్సిన అవసరం ఏంటంటే... వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, శ్వాస తీసుకున్నప్పుడు నోటి నుంచి తుంపర్లు బయటకు వస్తాయి. ఆ తుంపర్లలోనే వైరస్ ఉండవచ్చు.
అప్పుడు మీరు ఆ వ్యక్తికి దగ్గరగా ఉంటే, ఆ తుంపర్లు మీ మీద పడవచ్చు. వాటిని మీరు పీల్చుకునే ప్రమాదం ఉంటుంది.
లేదంటే ఆ తుంపర్లు మీ చేతుల మీద పడతాయి, అవే చేతులతో మీరు పొరపాటున నోటినో, ముక్కునో, కళ్లనో తాకితే... ఆ వైరస్ మీకు సోకుతుంది.
ఆ తుంపర్లు ఏదైనా ఉపరితలం లేదా వస్తువు మీద పడితే, వైరస్ అక్కడే అంటుకుని ఉంటుంది. ఆ ఉపరితలాన్ని మీరు చేతులతో తాకితే ఆ వైరస్ మీ చేతులకు అంటుకుంటుంది. అందుకే, తరచూ చేతులను కడుక్కోవాలి. ముఖాన్ని చేతులతో తాకకుండా ఉండేందుకు ప్రయత్నించాలి.

ఫొటో సోర్స్, Getty Images
స్వీయ నిర్బంధం అంటే ఏంటి?
పొడి దగ్గు, అధిక శరీర ఉష్ణోగ్రత, జలుబు, ఆయాసం లాంటి లక్షణాలు కనిపిస్తే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇంట్లోనే ఉండాలి. కుటుంబ సభ్యుల దగ్గరికి కూడా వెళ్లకుండా, ఒంటరిగా ఒక గదిలో (సాధ్యమైతే) ఉండిపోవాలి.
దీనినే స్వీయ నిర్బంధం (సెల్ఫ్ ఐసోలేషన్) అంటారు.

- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: ఈ మహమ్మారి ఎప్పుడు ఆగుతుంది? జనజీవనం మళ్లీ మామూలుగా ఎప్పుడు మారుతుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా

ఎవరిని ఒంటరిగా ఉంచాలి?
శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉండి, ఆగకుండా దగ్గు రావడం, లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి లక్షణాలు కనిపిస్తే వారు ఒంటరిగా ఉండాలి.
ఇంట్లో మీరు ఒక్కరే ఉంటే, ఆ లక్షణాలు ప్రారంభమైన రోజు నుంచి ఏడు రోజులు అలాగే ఇంట్లోనే ఒంటరిగా ఉండాలి.
ఇంట్లో ఒకరి కంటే ఎక్కువ మంది కలిసి ఉంటున్నప్పుడు, ఎవరైనా ఒకరిలో వైరస్ లక్షణాలు కనిపించినా అందరూ 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో (నిర్బంధంలో) ఉండాలి.
అయితే, అందులో ఎవరైనా 13వ రోజు అనారోగ్యానికి గురైతే వారు ఆ రోజు నుంచి మరో ఏడు రోజుల పాటు ఒంటరిగా ఉండాలి. (అంటే ఆ వ్యక్తి మొత్తం 20 రోజులు ఇంట్లో ఒంటరిగా గడపాల్సి ఉంటుంది)
కోవిడ్-19 లక్షణాలు ఉన్న వ్యక్తి ఉండే గదిలోకి కిటికీ ద్వారా బాగా వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. ఇంట్లోని ఇతరులకు దూరంగా ఉండాలి.

ఎవరు బయటకు వెళ్లకూడదు?
ఇప్పటికే తీవ్రమైన ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. దానినే షీల్డింగ్ అంటారు.
ఎందుకంటే, తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారిపై కోవిడ్-19 ప్రభావం ఎక్కువగా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు.
ఏ సమస్యలు ఉన్నవారు వెళ్లొద్దంటే...
- కొన్ని రకాల క్యాన్సర్ బాధితులు
- అవయవ మార్పిడి చేయించుకున్నవారు
- కొన్ని జన్యు సంబంధ వ్యాధులతో బాధపడుతున్నవారు
- సిస్టిక్ ఫైబ్రోసిస్, దీర్ఘకాలిక బ్రాంకైటిస్ లాంటి తీవ్రమైన శ్వాసకోశ సంబంధ సమస్యలతో బాధపడుతున్నవారు
- రోగనిరోధక వ్యవస్థను బలహీనపరిచే మందులు వాడుతున్నవారు
- గుండె జబ్బులు ఉన్న గర్భిణులు
** తరచూ చేతులను సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు కడుక్కోవడం, సామాజిక దూరం పాటించడం మరచిపోవద్దు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పదేపదే చెబుతోంది.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: అమెరికా ఎన్నడూ లేనంతగా భయపడుతోందా?
- ఎయిర్ ఇండియా పైలట్లు కరోనావైరస్ బారిన పడే ముప్పు ఎక్కువ ఉందా?
- ఈ దేశాల్లో ఒక్క కరోనావైరస్ కేసు కూడా నమోదు కాలేదు, ఎందుకు?
- కరోనావైరస్: రోజూ పేపర్ తెప్పించుకోవచ్చా? కూరలు పళ్లు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
- తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయానికి ‘లాక్‌డౌన్’.. పంటను కోయలేరు, అమ్మలేరు..
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో లాక్ డౌన్: మీరు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- కరోనావైరస్ ప్రభావంతో భారత్‌లో ఎన్ని ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది?
- కరోనావైరస్: మీరు మీ పిల్లల్ని వేరే పిల్లలతో ఆడుకోడానికి పంపించవచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








