కరోనావైరస్: ఇప్పటికీ కోవిడ్-19 కేసులు నమోదు కాని దేశాలివే

తుర్కెమెనిస్థాన్

ఫొటో సోర్స్, getty images

ఫొటో క్యాప్షన్, తుర్కెమెనిస్థాన్

కరోనావైరస్ మహమ్మారి 181 దేశాలకు, భూభాగాలకు వ్యాప్తి చెందింది. ఇప్పటికే దీని బారిన పదిలక్షలకు పైగా ప్రజలు పడ్డారు. 53,000 మంది మరణించారు. 2 లక్షల మందికి పైగా ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ఈ దేశాలన్నీ దీన్ని ఎదుర్కొనేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నాయి. అయితే, 40 ప్రదేశాలలో మాత్రం ఇప్పటికీ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

తుర్కెమెనిస్థాన్ దేశ ప్రభుత్వం ఏకంగా కరోనావైరస్ అనే పదాన్నే నిషేధించింది.

ఐదేళ్లుగా కొనసాగుతున్న అంతర్యుద్ధం కారణంగా కుదేలైన యెమెన్‌లో కోవిడ్-19 కేసులను నమోదు చేసే పరిస్థితులు లేవేమో అనిపిస్తోంది.

అంటార్కిటికాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు, నిజానికి అక్కడ మనుషులు ఎవరూ నివసించడం లేదు.

భారత్‌లో కరోనావైరస్ కేసులు

17656

మొత్తం కేసులు

2842

కోలుకున్నవారు

559

మరణాలు

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

ఏప్రిల్ 1 నాటికి పసిఫిక్ ద్వీపం తువాలు, మాజీ సోవియట్ రిపబ్లిక్ ఆఫ్ తుర్కెమెనిస్థాన్ దేశాల్లో ఒక్క కరోనావైరస్ కేసు కూడా నమోదైనట్లు అధికారికంగా ప్రకటించలేదు.

జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం సేకరించిన తాజా గణాంకాల ప్రకారం, 181 దేశాలు, భూభాగాలలో కోవిడ్-19 కేసులు నిర్ధరణ అయ్యాయి. కానీ, ప్రపంచవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో అధికారికంగా కనీసం ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు.

ఈ ప్రాంతాల్లో కేసులు నిర్ధరణ కాకపోవడానికి కారణం ఏంటంటే... వాటిలో ఎక్కువ భాగం తువాలు లాంటి, జనాభా అత్యల్పంగా ఉన్న ద్వీపాలు కావడం. అక్కడ భారీ ఎత్తున ప్రజల రాకపోకలు లేకపోవడం.

వాటిలో కొన్నింటికి పర్యటక ప్రాంతాలుగా పేరుంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో సందర్శకులు తగ్గిపోయారు.

నియంతృత్వ పాలన

మరికొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు కొంచెం క్లిష్టంగా ఉంటాయి. అక్కడ ఏం జరుగుతోందో బాహ్య ప్రపంచానికి అంత సులువుగా తెలియదు.

ప్రపంచంలోనే అత్యంత నియంతృత్వపు పాలనలో ఉన్న ప్రాంతాల్లో తుర్కెమెనిస్థాన్‌ ఒకటి. ఈ దేశంలో "కరోనావైరస్" అనే పదాన్ని అక్కడి ప్రభుత్వం నిషేధించింది.

ఆ పదాన్ని పలికినా, ముఖానికి మాస్కు ధరించినా పోలీసులు అరెస్టు చేస్తారంటూ మీడియా కథనాలు చెబుతున్నాయి.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్
ఉత్తర కొరియాలో కోవిడ్ -19 పాజిటివ్ కేసులు ఎన్ని నమోదయ్యాయో ఇప్పటికీ వెల్లడించలేదు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఉత్తర కొరియాలో కోవిడ్ -19 పాజిటివ్ కేసులు ఎన్ని నమోదయ్యాయో ఇప్పటికీ వెల్లడించలేదు

అలాగే, ఉత్తర కొరియా పాలకవర్గం మీద కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కరోనావైరస్ వ్యాప్తి చైనాలో మొదలైంది. ఆ దేశానికి పొరుగున ఉన్న పలు దేశాలు ఆ వైరస్ బారిన పడ్డాయి.

కానీ, కిమ్ జోంగ్ ఉన్ పాలనలో ఉన్న ఉత్తర కొరియాలో ఇప్పటి వరకు ఎన్ని కోవిడ్-19 కేసులు నమోదయ్యాయన్న వివరాలను వెల్లడించలేదు.

తరచూ అణ్వాయుధాల పరీక్షలతో వార్తల్లో నిలిచే ఉత్తర కొరియా, అంతర్జాతీయ ఆంక్షలతో తీవ్రంగా దెబ్బతింది.

ఆరోగ్య వ్యవస్థ అత్యంత బలహీనంగా ఉన్న ఆ దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తే భారీ నష్టం జరిగే ప్రమాదం ఉందన్న ఆందోళనలు ఉన్నాయి.

భూమిపై కరోనా రహిత ఖండం అంటార్కిటికా ఒక్కటే

ఫొటో సోర్స్, getty images

ఫొటో క్యాప్షన్, భూమిపై కరోనా రహిత ఖండం అంటార్కిటికా ఒక్కటే

అంతర్యుద్ధం

ఇప్పటి వరకు కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రకటించన దేశాల్లో యెమెన్ కూడా ఉంది. సుదీర్ఘకాలంగా అంతర్యుద్ధంతో తీవ్రంగా దెబ్బతిన్న ఈ పశ్చిమాసియా దేశంలో రోగులకు పరీక్షలు చేసి, కేసులను నమోదు చేయడం సవాలుతో కూడిన పని.

యెమెన్‌కు పొరుగున ఉన్న సౌదీ అరేబియాలో మార్చి 31 నాటికి 1,563 కేసులు నమోదయ్యాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

కొన్ని ఆఫ్రికన్ దేశాలు కూడా ఇప్పటి వరకు కోవిడ్-19 కేసులు నమోదైనట్లు వెల్లడించలేదు. అయితే, ఇక్కడ పరీక్షలు చేసేందుకు కిట్లు అందుబాటులో లేకపోవడం కూడా అందుకు ఒక కారణం అయ్యుండొచ్చు.

అంటార్కిటికా విషయానికొస్తే, భూగోళంపై కరోనావైరస్ రహిత ఖండం అదొక్కటే.

భూగోళంపై మిగతా ప్రపంచం నుంచి వెలివేసినట్లు ఉండటమే కాకుండా, అంటార్కిటికాలో జనాభా కూడా చాలా తక్కువ. అక్కడ మానవ ఉనికి కేవలం అంతర్జాతీయ పరిశోధనా కేంద్రాలకు మాత్రమే పరిమితమైంది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)