కరోనావైరస్: వృద్ధులు చేయాల్సిన, చేయకూడని పనులు

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచవ్యాప్తంగా, కోవిడ్-19 అనేక మందిపై ప్రభావం చూపింది, ఇప్పటికే ఆరున్నర లక్షల మందికి పైగా ఈ మహమ్మారి బారిన పడ్డారు. వారిలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 30 వేలు దాటింది. రోజురోజుకీ కేసులు వేలల్లో పెరుగుతున్నాయి.
ఈ తరుణంలో ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం కొన్ని కఠినమైన చర్యలు తీసుకుంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో పాటు, ప్రజలంతా వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం లాంటి నియమాలను తప్పనిసరిగా పాటించాలని, సూచించింది.
తద్వారా ఈ వైరస్ వ్యాప్తికి సంబంధించిన గొలుసును తెంచే వీలుంటుందని తెలిపింది.
ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం, శరీరంలో బలహీనత, మధుమేహం, రక్తపోటు, దీర్ఘకాలిక మూత్రపిండాలు, దీర్ఘకాలిక శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడే వృద్ధులపై కరోనావైరస్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన పడిన వృద్ధుల్లో మరణాల రేటు అధికంగా ఉంది.
అయినప్పటికీ, ఈ కింది జాగ్రత్తలు తీసుకుంటే వృద్ధుల్లో కోవిడ్-19 వ్యాప్తిని తగ్గించే వీలుందని భారత ప్రభుత్వం చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
చేయాల్సినవి
1. ఇంట్లో ఉండండి. ఇంట్లో సందర్శకులను కలవడం మానుకోండి. సమావేశం నిర్వహించడం తప్పనిసరి అయితేనే నిర్వహించండి. అందులోనూ ఇతరులకు మీటర్ దూరం ఉండేలా చూసుకోండి.
2. సబ్బు, నీటితో తరచూ చేతులను, ముఖాన్ని కడుక్కోవాలి.
3. తుమ్ములు, దగ్గు వచ్చినప్పుడు మీ మోచేతిని, లేదా టిష్యూ పేపర్/చేతి రుమాలును అడ్డుపెట్టుకోండి. తర్వాత ఆ టిష్యూ పేపర్‌ను జాగ్రత్తగా పారవేయాలి/ రుమాలును శుభ్రంగా ఉతకాలి.
4. ఇంట్లో వండిన, వేడిగా ఉన్న బలవర్థకమైన తాజా ఆహారం తినాలి. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు తరచూ ద్రవపదార్థాలు, తాజా పండ్ల రసాలు తాగాలి.
5. వ్యాయామం, ధ్యానం చేయాలి
6. వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వేసుకోండి.
7. మీ కుటుంబ సభ్యులతో, బంధువులు, స్నేహితులతో ఫోన్‌లో, వీడియో కాల్‌తో మాట్లాడుతూ ఉండండి (ఒకవేళ వాళ్లు మీకు దూరంగా ఉంటే). అవసరమైనప్పుడు మీ కుటుంబ సభ్యుల సాయం తీసుకోండి.
8. కంటి ఆపరేషన్ లేదా మోకాలి మార్పిడి లాంటి శస్త్రచికిత్సలను (ఏదైనా ఉంటే) వాయిదా వేసుకోండి.
9. తరచుగా తాకే ఉపరితలాలను ఇంట్లో వాడే క్రిమిసంహారక మందులతో క్రమం తప్పకుండా శుభ్రం చేయండి.
10. మీ ఆరోగ్యాన్ని ఎప్పుడూ పర్యవేక్షించుకోండి. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపిస్తే వెంటనే సమీపంలోని వైద్యులను సంప్రదించండి. వారు చెప్పే సూచనలు పాటించండి.

- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: ఈ మహమ్మారి ఎప్పుడు ఆగుతుంది? జనజీవనం మళ్లీ మామూలుగా ఎప్పుడు మారుతుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా


ఫొటో సోర్స్, Getty Images
వృద్ధులు చేయకూడని పనులు
1. ఖాళీ చేతుల్లో అడ్డుపెట్టుకుని దగ్గొద్దు, తుమ్మవద్దు. ముఖానికి ఏమీ అడ్డుపెట్టుకోకుండా దగ్గొద్దు, తుమ్మవద్దు.
2. మీరు జ్వరం, దగ్గుతో బాధపడుతుంటే ఎవరి దగ్గరికీ వెళ్లొద్దు.
3. చేతులతో కళ్ళను నలవొద్దు, ముఖాన్ని, ముక్కును, నాలుకను తాకవద్దు.
4. కరోనావైరస్ బాధితుల దగ్గరికి, అనారోగ్యంతో ఉన్నవారి వద్దకు వెళ్లొద్దు.
5. సొంత వైద్యం చేసుకోవద్దు.
6. కరచాలనం చేయొద్దు. కౌగిలించుకోవద్దు.
7. సాధారణ పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లొవద్దు. సాధ్యమైనంత వరకు వైద్యులను ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించండి.
8. పార్కులు, మార్కెట్లు, మతపరమైన కేంద్రాల లాంటి రద్దీ ప్రదేశాలకు వెళ్లవద్దు.
9. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









