కరోనావైరస్: ఇప్పటివరకూ ఏయే రాష్ట్రాలు ఏం చేశాయి?

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దిల్లీ లాక్ డౌన్

భారత్‌లో కరోనా వైరస్ వల్ల ఇప్పటివరకూ తొమ్మిది మంది చనిపోయారు. 424 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు ధ్రువీకరించారు. భారత్‌లో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి.

మహారాష్ట్రలో ఇప్పటివరకూ 69, కేరళలో 60, రాజధాని దిల్లీలో 28, ఉత్తరప్రదేశ్ 27, కర్నాటకలో 26 కేసులు బయటపడ్డాయి. రైల్వే మంత్రిత్వ శాఖ గూడ్స్ రైళ్లు మినహా ప్రయాణికుల రైళ్లన్నీ నిలిపివేయాలని ఆదేశించింది.

అన్ని మెట్రో సేవలు, అంతర్‌రాష్ట్ర బస్సు సేవలను కూడా నిలిపివేశారు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డ 75 జిల్లాలను మార్చి 31 వరకూ లాక్‌డౌన్ చేశారు.

పాజిటివ్ రోగుల సంఖ్య పెరగడంతో కరోనావైరస్ వ్యాపించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టాయి.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఖాళీగా దర్శనమిస్తున్న దిల్లీ రోడ్లు

దిల్లీ ప్రభుత్వం ఏం చేస్తోంది ?

దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం కొన్ని కీలక ప్రకటనలు చేశారు.

1. దిల్లీ ఎన్‌సీఆర్‌లో మార్చి 23 ఉదయం 6 గంటల నుంచి మార్చి 31 అర్థరాత్రి వరకూ పూర్తిగా లాక్‌డౌన్ చేస్తారు.

2. రైళ్ల రాకపోకలు, విమానాశ్రయాలు, ప్రైవేట్ బస్సులు, వాహనాలను కూడా నిలిపివేస్తారు.

3. డీటీసీ బస్సులు 50 శాతమే నడుపుతారు. వీటిని కూడా అత్యవసర సేవల్లో పాల్గొంటున్న వారు మాత్రమే వినియోగించుకోవాలని కేజ్రీవాల్ సూచించారు.

4. అన్ని నిర్మాణ పనుల్ని నిలిపివేస్తారు.

5. అవసరమైన వస్తువులు, సరుకులు మినహా అన్ని మార్కెట్లు, దుకాణాలు, పరిశ్రమల మూసివేత.

6. సెక్షన్ 144 అమలు.

7. దిల్లీలోని 72 లక్షల మంది పేదలకు 7.5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తారు.

8. దిల్లీలోని 8.5 లక్షల మందికి నాలుగు నుంచి ఐదు వేల రూపాయల పెన్షన్ అందిస్తారు.

9. దిల్లీ ప్రభుత్వం నైట్ షెల్టర్లలో ఉచిత భోజన ఏర్పాట్లు ప్రారంభించింది. ఎవరైనా అక్కడకు వెళ్లి భోజనం చేయవచ్చు.

10. ఇళ్లలో ఉండే వారికి పెయిడ్ లీవులు ఇవ్వాలని కూడా దిల్లీ ప్రభుత్వం కోరింది.

11. క్వారంటైన్‌లో ఉండాలని కోరిన వ్యక్తులు నివసిస్తున్న ఇళ్లను కూడా మార్క్ చేస్తున్నారు.

12. లాక్‌డౌన్ సమయంలో ఏ కార్మికుడి వేతనంలోనూ కోత విధించకూడదని ప్రభుత్వం కోరింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

13. ఈ సమయంలో దిల్లీ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్, రోజువారీ కార్మికుల పూర్తి వేతనం చెల్లించాలని ముందే నిర్ణయించింది.

14. ప్రభుత్వం తమ తాజా ఆదేశాల్లో ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు కూడా ఇళ్లలోనే ఉండాలని, ఆ సమయంలో సంస్థ వారికి పూర్తి వేతనం అందించాలని చెప్పింది.

15. మార్చి 31 వరకూ అన్ని స్కూళ్లూ మూసివేత.

16. అన్ని మత, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాలపై నిషేధం.

17. ఒక ప్రాంతంలో 50 మందికి పైగా గుమిగూడకుండా నిషేధం.

18. జామియా, జేఎన్‌యూ విద్యార్థులకు ఇళ్లకు వెళ్లిపోవాలని ఆదేశాలు.

19. ఐఐటీ దిల్లీ అన్ని తరగతులనూ రద్దు చేసినట్లు చెప్పింది.

Sorry, your browser cannot display this map