కరోనావైరస్‌తో మన రోగనిరోధక వ్యవస్థ ఎలా పోరాడుతుందంటే..

ఫొటో సోర్స్, PETER DOHERTY INSTITUTE
కొత్త కరోనావైరస్ కోవిడ్-19తో మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ఎలా పోరాడుతుందో ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు గుర్తించారు.
జనం జలుబు (ఫ్లూ) నుంచి కోలుకుంటున్నట్లే ఈ వైరస్ నుంచి కూడా కోలుకుంటున్నట్లు వారి పరిశోధన చూపుతోంది. ఈ పరిశోధన వివరాలను మంగళవారం నేచర్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించారు.
ఎటువంటి రోగనిరోధక కణాలు విడుదలవుతున్నాయనేది నిర్ధారించటం ద్వారా.. వ్యాక్సిన్ అభివృద్ధికి తోడ్పడగలదని నిపుణులు చెప్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 1,60,000 కోవిడ్-19 కేసులు నమోదవగా.. ఈ వైరస్ వల్ల 6,500 మంది చనిపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు.
''ఈ పరిశోధన చాలా కీలకమైనది. కొత్త కరోనావైరస్ మీద మన రోగ నిరోధక వ్యవస్థ ఎలా పోరాడుతుందో మనం మొదటిసారిగా అర్థం చేసుకోగలుగుతున్నాం'' అని పరిశోధన సహ రచయిత ప్రొఫెసర్ కేథరీన్ కెడ్జీర్స్కా పేర్కొన్నారు.
మెల్‌బోర్న్ లోని పీటర్ డోహర్టీ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇన్‌ఫెక్షన్ అండ్ ఇమ్యూనిటీ నిర్వహించిన ఈ పరిశోధన ఒక విజయమని ఇతర నిపుణులు అభినందిస్తున్నారు.

- కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు


ఫొటో సోర్స్, EPA
ఏం గుర్తించారు?
కోవిడ్-19 సోకిన వారిలో చాలా మంది కోలుకున్నారు. దీని అర్థం.. మన రోగనిరోధక వ్యవస్థ వైరస్‌తో విజయవంతంగా పోరాడగలదని మనకు ఇప్పటికే తెలుసు.
అయితే.. కోవిడ్-19తో పోరాడటానికి విడుదలైన నాలుగు రకాల రోగనిరోధక కణాలను శాస్త్రవేత్తలు మొదటిసారిగా గుర్తించారు.
ఈ వైరస్ సోకి ఒక మాదిరిగా అనారోగ్యానికి గురైన ఒక రోగిని అధ్యయనం చేసినపుడు ఈ కణాలను గమనించారు.
చైనాలోని ఉహాన్ నగరానికి చెందిన ఆ రోగి ఒక 47 సంవత్సరాల మహిళ. ఆమెకు గతంలో ఎటువంటి అనారోగ్య సమస్యలూ లేవు. ఆస్ట్రేలియాలోని ఒక ఆస్పత్రిలో చేరిన ఆమె 14 రోజుల్లో కోలుకున్నారు.
ఈ రోగిలో రోగనిరోధక వ్యవస్థ పూర్తి స్థాయి ప్రతిస్పందనను తమ బృందం పరీక్షించిందని ప్రొఫెసర్ కేథరీన్ బీబీసీకి చెప్పారు.
ఆ రోగి కోలుకోవటం మొదలవటానికి మూడు రోజుల ముందు.. ఆమె శరీరంలోని రక్తప్రవాహంలో నిర్దిష్ట కణాలను గుర్తించారు.
ఇన్‌ప్లుయెంజా (ఫ్లూ) రోగుల్లో కూడా వారు కోలుకోవటానికి ముందు దాదాపు ఇదే సమయంలో ఇవే కణాలు కనిపిస్తాయని ప్రొఫెసర్ కేథరీన్ వివరించారు.
''మా ఫలితాలు చాలా సంభ్రమం కలిగించాయి. ఈ వైరస్ సోకిన రోగి వైద్య పరంగా కోలుకోవటానికి ముందు ఆమె శరీరంలోని రోగనిరోధక కణాలను మేం పసిగట్టగలిగాం'' అని తెలిపారు.
ఈ పరిశోధన కోసం డజను మందికి పైగా శాస్త్రవేత్తలు నాలుగు వారాల పాటు ప్రతి రోజూ 24 గంటల పాటూ నిర్విరామంగా పనిచేశారని చెప్పారు.

ఈ పరిశోధన వల్ల ప్రయోజనం ఏమిటి?
రోగనిరోధక కణాలు ఎప్పుడు రంగంలోకి దిగుతాయనేది గుర్తించటం వల్ల.. ''వైరస్ గమనాన్ని అంచనా వేయటం'' సాధ్యమవుతుందని స్విన్‌బర్న్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో హెల్త్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ బ్రూస్ థాంప్సన్ పేర్కొన్నారు.
''శరీరంలో వివిధ ప్రతిస్పందనలు ఎప్పుడు జరుగుతాయనేది మనకు తెలిస్తే.. వైరస్ నుంచి కోలుకోవటంలో మనం ఏ దశలో ఉన్నామనేది అంచనా వేయొచ్చు'' అని ఆయన బీబీసీకి వివరించారు.
ఈ పరిశోధన ఫలితాలు.. వ్యాక్సిన్ తయారీ వేగవంతం కావటానికి, రోగులకు మెరుగైన చికిత్స అందించటానికి దోహదపడగలవని ఆస్ట్రేలియా ఆరోగ్యశాఖ మంత్రి గ్రెగ్ హంట్ చెప్పారు.
అయితే.. వ్యాధి తీవ్రంగా ఉన్న వారిలో రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందన ఎందుకు బలహీనంగా ఉందో నిర్ధారించటం శాస్త్రవేత్తల మలి దశ పరిశోధన లక్ష్యంగా ప్రొఫెసర్ కేథరీన్ తెలిపారు.

''ఈ వైరస్ వల్ల చనిపోయిన వారిలో, వ్యాధి చాలా తీవ్రంగా ఉన్న వారిలో లోపం ఏమిటి? లేదంటే వారిలో వేరేగా జరుగుతున్న పరిణామాలేమిటి అనేది అర్థం చేసుకోవటం ఇప్పుడు కీలకమైన అంశం. అది తెలిస్తే.. వారిని రక్షించటం ఎలా అనేది మనకు అర్థమవుతుంది'' అని పేర్కొన్నారు.
గత జనవరిలో ఈ కొత్త కోరోనావైరస్‌ను పున:సృష్టించిన ఈ ఇన్‌స్టిట్యూట్.. ప్రపంచంలో ఆ విజయం సాధించిన తొలి సంస్థగా నిలిచింది.
ఈ విజయంతో కరోనావైరస్ మీద మరిన్ని పరిధోధనల కోసం ఆస్ట్రేలియా ప్రభుత్వంతో పాటు వ్యాపార సంస్థలు, చైనా బిలియనీర్ జాక్ మా ఈ సంస్థకు అదనపు నిధులు అందించారు.


ఇవి కూడా చదవండి
- పెళ్లికి ముందు అమ్మాయిని మళ్లీ కన్యగా మార్చే సర్జరీలు ఎందుకు?
- భారత్ కూడా పాకిస్తాన్ చేసిన 'తప్పే' చేస్తోంది: షోయబ్ అఖ్తర్
- ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో కరోనావైరస్ వ్యాప్తి ఎలా ఉంది?
- కరోనావైరస్ వ్యాక్సీన్ అభివృద్ధిలో ముందడుగు, ఓ మహిళకు ప్రయోగాత్మకంగా ఇంజెక్ట్ చేసిన శాస్త్రవేత్తలు
- కరోనావైరస్ అనుమానిత రోగులు ఆసుపత్రుల నుంచి ఎందుకు పారిపోతున్నారు?
- కరోనావైరస్- పారాసిటమాల్: ఏపీ సీఎం వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్స్
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి? - ప్రజలు అడిగిన 10 కీలక ప్రశ్నలు... నిపుణుల సమాధానాలు
- ప్రపంచంలోనే హెచ్ఐవీని జయించిన రెండో వ్యక్తి.. ఎలా నయమయ్యిందంటే?
- కరోనావైరస్ గురించి ఈ సినిమా 10 ఏళ్ల కిందే చెప్పిందా?
- కరోనావైరస్: శశిథరూర్ మెడలోని ఈ గాడ్జెట్ వైరస్‌లను అడ్డుకుంటుందా
- కరోనావైరస్లు ఎక్కడి నుంచి వస్తాయి... ఒక్కసారిగా ఎలా వ్యాపిస్తాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








