కరోనావైరస్: లాక్‌డౌన్ ఏప్రిల్ 15తో ముగుస్తోందా?

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న లాక్‌డౌన్ ఈనెల 15తో ముగుస్తోందా? అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన ట్వీట్, ఆ తర్వాత దాన్ని తొలగించడం అనుమానాలకు ఆస్కారమిచ్చింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పాల్గొన్నారు.
రాబోయే కొన్ని వారాల్లో టెస్టింగ్, ట్రేసింగ్, ఐసొలేషన్, క్వారంటీన్‌ల పైనే పూర్తి దృష్టి కేంద్రీకరిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
దేశంలో, వివిధ రాష్ట్రాల్లో కోవిడ్-19 వ్యాప్తి, తీసుకుంటున్న చర్యలపై సమీక్షించేందుకు మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
దేశంలో కరోనావైరస్ కేసుల పెరుగుదల, నిజాముద్దీన్ మర్కజ్ ద్వారా వైరస్ వ్యాప్తి, సమర్థంగా ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.
అత్యవసర వైద్య పరికరాలు, మందులు, మందుల తయారీకి అవసరమైన సామగ్రిని తగిన స్థాయిలో సిద్ధంగా ఉంచుకోవాలని రాష్ట్రాలకు మోదీ సూచించారు.

- కరోనావైరస్ గురించి ఇంకా మనకెవరికీ తెలియని 9 విషయాలు..
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్: ఈ మహమ్మారి ఎప్పుడు ఆగుతుంది? జనజీవనం మళ్లీ మామూలుగా ఎప్పుడు మారుతుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు

లాక్‌డౌన్ ముగుస్తోందా?
అయితే, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ చేసిన ఓ ట్వీట్ అనుమానాలకు తావిచ్చింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
"లాక్‌డౌన్ ఏప్రిల్ 15తో ముగుస్తోంది. కానీ, దానర్థం వీధుల్లో స్వేచ్ఛగా తిరగొచ్చని కాదు. వైరస్ వ్యాప్తిని తగ్గించడంలో మనందరం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. సామాజిక దూరం పాటించడం, లాక్‌డౌన్ మాత్రమే కోవిడ్-19ను ఎదుర్కొనే మార్గాలు" అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అయితే, కాసేపటికే దీన్ని తొలగించారు. హిందీ భాషను సరిగా అర్థం చేసుకోలేని ఓ అధికారి ఈ ట్వీట్‌ను పోస్ట్ చేశారని, అందువల్ల దీన్ని తొలగిస్తున్నామని పెమా ఖండూ వివరణనిచ్చారు.
కానీ, ఏప్రిల్ 15నుంచి రైలు టిక్కెట్లు, విమాన టిక్కెట్ల బుకింగ్‌ను ప్రారంభించడం చూస్తుంటే లాక్‌డౌన్ ముగిసి, ప్రజా రవాణాను తిరిగి ప్రారంభిస్తారనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ రైలు టిక్కెట్ల బుకింగ్‌ను ప్రారంభించింది. చాలామంది బుక్ చేసుకున్నారనేది కూడా అందుబాటులో ఉన్న టికెట్ల సంఖ్య, వెయిటింగ్ లిస్టులను చూస్తుంటే అర్థమవుతోంది.
దేశీయంగా విమాన ప్రయాణాలకు కూడా కొన్ని వెబ్‌సైట్లలో బుకింగ్ ప్రారంభమైంది.
అయితే ప్రభుత్వం తరపు నుంచి లాక్‌డౌన్ ఎత్తివేయడంపై గానీ, ప్రజా రవాణాకు అనుమతి విషయంలో కానీ ఎలాంటి సమాచారం లేదు.
ఇవి కూడా చదవండి.
- కరోనావైరస్: రెండు వ్యాక్సీన్లపై పరీక్షలు మొదలుపెట్టిన శాస్త్రవేత్తలు
- నిజాముద్దీన్ తబ్లీగీ జమాత్ మర్కజ్: కరోనావైరస్ వ్యాప్తి చర్చలో కేంద్ర బిందువుగా మారిన తబ్లీగీ జమాత్ ఏం చేస్తుంది?
- కరోనావైరస్: దిల్లీ నిజాముద్దీన్ తబ్లీగీ జమాత్ సదస్సుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంత మంది వెళ్ళారు?
- కరోనావైరస్: ఇటలీలో విజృంభించిన వైరస్, 12 వేలు దాటిన మృతులు... తప్పు ఎక్కడ జరిగింది?
- కరోనావైరస్: ప్రభుత్వం, సమాజం స్పందించే తీరులో వర్ణ వ్యవస్థ ఛాయలు - అభిప్రాయం
- కరోనావైరస్తో పోరాటం కోసం ఏర్పాటైన PM CARES ఫండ్‌పై ప్రశ్నలు
- కరోనావైరస్: తొలి మేడిన్ ఇండియా టెస్టింగ్ కిట్ తయారు చేసిన భారతీయ శాస్త్రవేత్త
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








