కరోనావైరస్‌తో పోరాటం కోసం ఏర్పాటైన PM CARES ఫండ్‌పై ప్రశ్నలు

ప్రధాని నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, ROB STOTHARD/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ప్రధాని నరేంద్ర మోదీ
    • రచయిత, ఫైజల్ మొహమ్మద్ అలీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కరోనావైరస్ వ్యాప్తితో పోరాటం కోసం ఏర్పాటు చేసిన కొత్త ట్రస్ట్ పీఎం-కేర్ చుట్టూ ఎన్నో ప్రశ్నలు చుట్టుముడుతున్నాయి.

విరాళాలు సేకరించే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ ఏర్పాటు చేశారు.

ఎన్నో ఏళ్ల నుంచీ పీఎం రిలీఫ్ ఫండ్ లేదా ప్రధానమంత్రి సహాయ నిధి ఉన్నప్పుడు మళ్లీ కొత్తగా ఈ ఫండ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.

చాలామంది కొత్తగా ఏర్పాటు చేసిన ‘పీఎం-కేర్‌’ నిధిని ఒక ‘కుంభకోణం’గా చెబుతుంటే, కొన్ని ప్రాంతాల్లో దీనిని బహుశా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లేదా కాగ్ పరిధికి బయట ఉండేలా, నిధుల ఖర్చులు, వాటి వినియోగంపై ఎవరి నిఘా లేకుండా ఏర్పాటు చేశారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రధానమంత్రి కార్యాలయం లేదా ప్రభుత్వ వ్యవస్థకు సంబంధించిన పబ్లిసిటీ విభాగం దీనికి సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదు.

శశి థరూర్

ఫొటో సోర్స్, TWITTER

సోషల్ మీడియాలో స్పందనలు

“క్యాచీ పదాలపై ప్రధానమంత్రికి ఉన్న ప్రత్యేక ఆసక్తికి తగినట్లు, నేరుగా ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి లేదా పీఎంఎన్ఆర్ఎఫ్ పేరునే పీఎం-కేర్‌గా మార్చి ఉండవచ్చు కదా?” అని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశ్నించారు.

కానీ, ఒక కొత్త ట్రస్ట్ ప్రారంభించారు. దాని నియమాలు, ఖర్చుల గురించి ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు.

ప్రముఖ చరిత్రకారులు రామచంద్ర గుహ దీనిని జాతీయ విపత్తు సమయంలో కూడా ఒక వ్యక్తి ప్రత్యేక తరంగాన్ని సృష్టించే ప్రయత్నంగా చెప్పారు. “ఈ అసాధరణ చర్యకు మీరు ప్రజలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది” అన్నారు.

“ప్రధానమంత్రి సహాయ నిధిలో ఇప్పటికీ 3800 కోట్ల రూపాయలు ఉన్నాయి” అని సాకేత్ గోఖల్ చెప్పారు. ఆర్టీఐ ద్వారా ఆయన ప్రధానమంత్రి కార్యాలయం నుంచి పీఎం-కేర్ సంబంధించిన సమాచారం కోరారు.

“కొత్త అకౌంట్‌లో డబ్బు వేయడానికి ముందు, ఆ మిగిలిన మొత్తాన్ని మొదట ఉపయోగించమని మనం మన ప్రియతమ నేతకు చెప్పాలి” అని స్కాచీ రాశారు.

ప్రధాని నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, TWITTER

ప్రధాని ట్వీట్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ట్వీట్ ద్వారా “కోవిడ్-19 లాంటి అత్యవసర స్థితిని ఎదుర్కోడానికి ‘ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచువేషన్స్ ఫండ్’(ప్రధానమంత్రి పౌరుల సాయం, అత్యవసర పరిస్థితుల సహాయ నిధి) పీఎం-కేర్స్ ఫండ్ ఏర్పాటు చేయబోతున్నాం, ప్రజలు దానికి విరాళాలు అందించాలి” అని దేశ ప్రజలను కోరారు.

ప్రధానమంత్రి తన ట్వీట్‌లో “ఈ నిధిని భవిష్యత్తులో వచ్చే విపత్కర సమయాల్లో కూడా ఉపయోగిస్తాం” అని చెప్పారు. ఆ ట్వీట్‌లో ఫండ్‌కు సంబంధించిన సూచనల లింక్ కూడా ఉంది.

ప్రధానమంత్రి కార్యాలయానికి సంబంధించిన వెబ్‌సైట్ www.pmindia.gov.in లో ఫండ్‌కు సంబంధించిన సమాచారంలో ప్రధానమంత్రి పీఎం-కేర్ ట్రస్ట్ అధ్యక్షుడుగా ఉంటారు. విదేశాంగమంత్రి, హోంమంత్రి, ఆర్థికమంత్రి ఇందులో సభ్యులుగా ఉంటారని చెప్పారు.

కానీ, ఒకవైపు ఫండ్ గురించి ప్రశ్నలు వెల్లువెత్తుతున్నా, సిని, పారిశ్రామిక ప్రపంచానికి సంబంధించిన ప్రముఖులు, సామాన్యులు పీఎం-కేర్ ఫండ్‌కు పోటీపడి మరీ విరాళాలు అందిస్తున్నారు.

నటుడు అక్షయ్ కుమార్ ఈ ఫండ్‌కు 25 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ నుంచి కూడా వంద కోట్ల విరాళం అందింది.

మోదీ

ఫొటో సోర్స్, Getty Images

పీఎం-కేర్ ఫండ్

“మా ఇంటి పనుల్లో సాయం చేసే సోనియా ఈ ఫండ్‌కు వెయ్యి రూపాయలు విరాళంగా ఇచ్చారు” అని హిందుస్తాన్ టైమ్స్ ఎడిటర్ సోనల్ కాల్రా చెప్పారు.

“ఫండ్ అకౌంట్స్ పారదర్శకంగా ఉంటే, ఎవరికీ ఎలాంటి సమస్యా ఉండదు” అని పద్మజ శశిథరూర్‌కు సమాధానం ఇచ్చారు.

“పీఎం-కేర్ ఫండ్ వినడానికి బాగా అనిపిస్తోంది. ప్రజలు దీనికి విరాళాలు ఇస్తున్నారు. ప్రధాని అపీల్ చేయడంతో జనం ముందుకు వచ్చి విరాళాలు ఇస్తున్నారు. దాంతో, కాంగ్రెస్ నీళ్ల నుంచి బయటపడిన చేపలా అల్లాడిపోతోంది” అని ఆమె అన్నారు.

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)