కరోనావైరస్: భారత సైన్యం రాత్రికి రాత్రే 1,000 పడకల ఆస్పత్రి నిర్మించిందా? ఏది నిజం? - BBC FactCheck

భారత సైన్యం

ఫొటో సోర్స్, TWITTER@SPOKESPERSONMOD

ఫొటో క్యాప్షన్, భారత సైన్యం

భారతదేశంలో కోవిడ్-19 బాధితుల సంఖ్య వేయి దాటింది. ఇప్పుడు దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య, ఆరోగ్య వ్యవస్థలో మౌలిక సదుపాయాల కొరతే అని భావిస్తున్నారు. ఎందుకంటే, దేశంలో 70,000 ఐసీయూ పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

అయితే, వీటన్నిటి మధ్యా సోషల్ మీడియాలో ఒక కొత్త వాదన వినిపిస్తోంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

మూడు ఫొటోలను చూపిస్తూ, “బాడ్‌మేర్‌లో మన సైన్యం వెయ్యికి పైగా పడకలు ఉన్న అత్యాధునిక ఆస్పత్రిని రెండు రోజుల్లో సిద్ధం చేసి రాజస్థాన్ ప్రభుత్వానికి, మూడు ఆస్పత్రులను భారత ప్రభుత్వానికి అంకితం చేసింది. దేశ జవాన్ల సత్తాకు సలాం. దేశానికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, నా జవాన్లు, రైతులు దేశాన్ని కాపాడుతారు. జై జవాన్, జై కిసాన్” అని పెడుతున్నారు.

మరో ట్వీట్‌లో “మన సైన్యం రాజస్థాన్‌లోని బాడ్‌మేర్‌లో వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించింది. దీనిని సెటప్ చేయడానికి కొన్ని గంటలే పడుతుంది. ఇప్పటివరకూ మనం చైనా ఇలాంటి ఘన కార్యాలు చేసిందనే వార్తలు వింటున్నాం. మన సైన్యం సాధించినవాటిని మాత్రం మరిచిపోతున్నాం” అని పెట్టారు.

ఈ పోస్టుతో పాటు మూడు ఫొటోలు కూడా షేర్ చేశారు.

బీబీసీ ఈ మూడు ఫొటోలను పరిశీలించింది. ఇండియన్ ఆర్మీ నిజంగానే రాత్రికిరాత్రే బాడ్‌మేర్‌లో ఆస్పత్రిని నిర్మించిందా అని తెలుసుకునే ప్రయత్నం చేసింది.

మొబైల్ ఆస్పత్రి

ఫొటో సోర్స్, SOCIAL MEDIA

ఫొటో క్యాప్షన్, మొబైల్ ఆస్పత్రి

ఫొటో-1

మేం గూగుల్ రివర్స్ సెర్చ్ టూల్ ఉపయోగించి ఈ ఫొటోను పరిశీలించినపుడు ఇక్కడ ఈ వాహనాలు ఉన్న మొబైల్ ఆస్పత్రి రష్యాలో నిర్మించిందని, కిర్గిస్తాన్ అత్యవసర మంత్రిత్వ శాఖకు దీనిని డొనేట్ చేశారని తెలిసింది.

2019 సెప్టెంబర్ 11న కిర్గిస్తాన్ న్యూస్ ఏజెన్సీ కబర్.కేజీ ఈ వార్తను ప్రచురించింది. ఇందులో 10 ఫిజీషియన్లు, ఆస్పత్రి వర్కర్లు ఒకేసారి రోగులకు వైద్యం చేయచ్చు.

మొబైల్ ఆస్పత్రి, అమెరికా

ఫొటో సోర్స్, US AIRFORCE

ఫొటో క్యాప్షన్, మొబైల్ ఆస్పత్రి, అమెరికా

ఫొటో -2

రెండో ఫొటోలో “మన సైన్యం నిర్మించిన ఆస్పత్రి లోపల నుంచి ఎలా కనిపిస్తుందో చూడండి” అని చెప్పారు. నిజానికి ఈ ఫొటో 2008 నవంబర్‌లో తీసింది.

అమెరికా ఎయిర్‌ఫోర్స్ వెబ్‌సైట్‌లో ఈ ఫొటో ఉంది. దానితోపాటు “మొబైల్ ఫీల్డ్ ఆస్పత్రి లోపల ఇలా కనిపిస్తుంది” అని రాశారు.

ఈ ఆస్పత్రిలో క్లైమెట్ చేంజ్ సిస్టమ్ లాంటి అన్నిరకాల వైద్య పరికరాలు, రోగులకు విషమ పరిస్థితుల్లో కూడా చికిత్స అందించేందుకు ఉపయోగపడే మందులు ఉంటాయి. ఇలాంటి మూడు ఆస్పత్రులు నిర్మించారు. వీటిలో మొత్తం 600 పడకల సామర్థ్యం ఉంది.

కాలిఫోర్నియా మార్చ్ ఎయిర్ రిజర్వ్ బేస్‌లో ఇలాంటి మూడు మొబైల్ ఆస్పత్రులు నిర్మించారు. ఈ ఒక్క ఆస్పత్రిలో 200 పడకలు ఉంటాయి.

మేం ఈ ఫొటో మెటాడేటా తీసినప్పుడు, ఈ ఫొటోను 2006 మార్చి 21న నికాన్ డీ200 కెమెరాతో తీసినట్టు తెలిసింది.

భారత సైన్యం

ఫొటో సోర్స్, TWITTER/@SPOKESPERSONMOD

ఫొటో క్యాప్షన్, భారత సైన్యం

ఫొటో-3

ఈ ఫొటోలో ఇండియన్ ఆర్మీకి చెందిన కొంతమంది జవాన్లు కూర్చుని కనిపిస్తారు. ఈ ఫొటో బాడ్‌మేర్‌లో నిర్మించిన ఆర్మీ ఆస్పత్రిదే అని చెబుతున్నారు.

దీనిని Tineye ఇమేజ్ సెర్చ్ ఇంజన్ ద్వారా పరిశీలించిన, మేం భారత పదాతి దళానికి సంబంధించిన ఒక ట్వీట్ దగ్గరకు చేరుకున్నాం.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

2015లో నేపాల్‌లో భూకంపం వచ్చినపుడు ఇండియన్ ఆర్మీ సైన్యం అత్యవసర సేవల కోసం కాఠ్మండూ ఎయిర్ బేస్‌లో ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటుచేసింది.

అంటే, ఈ మూడు ఫొటోలూ పాతవి. సోషల్ మీడియాలో చెబుతున్న వాదనలకూ ఈ ఫొటోలకూ ఎలాంటి సంబంధం లేదు.

కానీ, భారత సైన్యం కరోనావైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోడానికి నిజంగానే ఏదైనా ఆస్పత్రి నిర్మించిందా అనే ప్రశ్న కూడా మనసులో మెదులుతుంది.

ఆ ప్రశ్నకు మాకు ఇండియన్ ఆర్మీ ట్విటర్ అకౌంట్‌లో సమాధానం లభించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

మార్చి 23న భారత పదాతి దళ ప్రతినిధి తన ట్వీట్‌లో “భారత సైన్యం బాడ్‌మేర్‌లో కరోనావైరస్ బాధితుల కోసం వెయ్యి పడకల క్వారంటైన్ సెంటర్ నిర్మించిందని సోషల్ మీడియాలో వస్తున్న వాదనలు అబద్ధం” అని చెప్పారు.

దీంతో కోవిడ్-19 పాజిటివ్ రోగుల కోసం భారత సైన్యం ఎలాంటి వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించలేదనే విషయం స్పష్టం అయ్యింది. దానితోపాటూ రాజస్థాన్‌లోని బాడ్‌మేర్ జిల్లాలో కట్టినట్లుగా చెబుతున్న ఆస్పత్రులు నిజానికి రష్యా, అమెరికాలోని మొబైల్ ఆస్పత్రులకు చెందినవని తేలింది.

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)