కరోనావైరస్ వల్ల చిన్నపిల్లలకు, టీనేజర్లకు కూడా ముప్పు ఉందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రేచెల్ స్క్రేయర్
- హోదా, బీబీసీ హెల్త్ రిపోర్టర్
కరోనావైరస్ బారిన పడే ముప్పు వృద్ధులకు ఎక్కువగా ఉంటుందని ఇప్పటి వరకు కరోనావైరస్ పై జరిగిన పరిశోధనలు చెబుతున్నాయి. అలా అని ఈ వైరస్ యుక్త వయస్కులు, చిన్న పిల్లలకు సోకదని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.
ఈ వైరస్ కేవలం ముసలివాళ్ళకి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి పరిమితం కాదని లేబర్ పార్టీ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ రోజేనా అల్లిన్ ఖాన్ చెప్పారు. ఇంగ్లండ్‌లో ఒక 18 ఏళ్ళ అమ్మాయి వైరస్ సోకి మరణించిన తర్వాత మాట్లాడుతూ ఆమె ఈ విషయం చెప్పారు.
ఇప్పుడు 30-40 ఏళ్ళ వయసులో ఆరోగ్యంగా ఉన్నవారు కూడా వైరస్ సోకడంతో హాస్పిటల్లో చికిత్స పొందడం తాను చూస్తున్నానని ఆమె చెప్పారు.
వివిధ వయసుల వారికి ఉన్న ముప్పు ఏమిటి?
మొత్తం పరిస్థితిని చూస్తే కరోనావైరస్ బారిన పడిన వారిలో ఎక్కువ మంది వృద్ధులు ఉన్నారు. లండన్ ఇంపీరియల్ కాలేజీ కూడా కరోనావైరస్ బారిన పడి హాస్పిటల్లో చేరుతున్నవారిలో ఎక్కువగా వృద్ధులు ఉన్నారని స్పష్టం చేసింది. వృద్ధులకు అత్యవసర వైద్యం అందించాల్సిన అవసరం కూడా ఉంది.
50 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారిలో 5 శాతం కన్నా తక్కువ మంది హాస్పిటల్లో చేరితే, 70-79 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్నవారిలో 24 శాతం మంది హాస్పిటల్లో చేరుతున్నారు.
40 ఏళ్ళ లోపు ఉన్నవారిలో కేవలం 5 శాతం మందికే అత్యవసర వైద్యం అందించాల్సిన పరిస్థితి వస్తోంది. ఈ పరిస్థితి 60 లలో ఉన్నవారిలో 27 శాతం ఉండగా 70 లలో ఉన్నవారిలో 43 శాతం ఉంది.
80 ఏళ్ళు పైబడిన వారిలో 71 శాతం మందికి అత్యవసర వైద్యం ఇవ్వవలసి వస్తోంది. కరోనావైరస్ కేసులు అత్యధికంగా నమోదు అయిన చైనా, ఇటలీలో కరోనా వైరస్ బారిన పడిన వారిపై జరిపిన పరిశీలనల ఆధారంగా వీటిని అంచనా వేశారు.
ఇంగ్లండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్లో హాస్పిటల్లో క్రిటికల్ కేర్లో చేరుతున్న రోగుల వయస్సు సగటున 63 సంవత్సరాలు ఉన్నట్లు రీసెర్చ్ చారిటీ అనే సంస్థ జరిపిన పరిశోధన సూచిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
మరో వైపు, హాస్పిటల్లో చేరే వారిలో 53 శాతం మంది 55 ఏళ్లకు పైబడిన వారేనని యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. అంటే సగం మంది తక్కువ వయస్సు ఉన్నవారు కూడా ఈ వైరస్ బారిన పడి ఉంటారని అర్ధం అవుతోంది.
అయితే, ఇంటెన్సివ్ కేర్‌కి, ప్రమాద స్థాయికి వెళుతున్న వారిలో ఎక్కువగా 65 ఏళ్ళకు పైబడిన వారే ఉన్నారు.
అయితే, ఇవన్నీ సగటు లెక్కలేనని గుర్తుంచుకోవాలి. వైరస్ బారిన పడి ఇబ్బంది పడుతున్నవారిలో చిన్న వయస్సు వారు కూడా ఉండే అవకాశం ఉంది.
అందులో కొన్ని కేసులు తీవ్రమైనవి కూడా కావచ్చు.
ఇటలీలోని మరణాలలో 0.4 శాతం మంది 40 ఏళ్ళ లోపు వారు కాగా, 80లలో ఉన్నవారిలో 19.7 శాతం మంది ఉన్నారు.
అమెరికాలో 40లలో ఉన్నవారిలో 0.7 శాతం మంది ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారు.
ఇప్పటి వరకు మరణించిన వారిలో అధికంగా వృద్ధులు, అంతకు ముందు నుంచే అనారోగ్య లక్షణాలతో బాధపడుతున్నవారు ఉన్నారని యు.ఎస్ నేషనల్ ఇనిస్టిట్యూట్ అఫ్ ఎలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్ అన్నారు. అలా అని దీనికి కచ్చితమైన ఫార్ములా ఏదీ లేదని అన్నారు.
చిన్న వయసు వారు కూడా ఈ వైరస్ బారిన పడే అవకాశం ఉందన్నారు.
కొన్ని ప్రాంతాలలో పిల్లలు, టీనేజర్లు కూడా మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
పిల్లల్లో కంటే పెద్దవారిలో ఈ కోవిడ్ 19 ఎక్కువ ప్రభావం చూపించిందని చైనాలో వైరస్ బారిన పడిన 2000 మంది పిల్లలపై జరిపిన ఒక అధ్యయనం పేర్కొంది.

- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ సోకితే మనిషి శరీరానికి ఏమవుతుంది?
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు

ముందుగా ఉన్న అనారోగ్య లక్షణాలు
వయసుతో పని లేకుండా ముందుగా శరీరంలో ఉన్న అనారోగ్యం కూడా కొంత పాత్ర పోషిస్తుంది.
ఉదాహరణకి యుకేలో ఆస్తమాతో బాధపడుతున్నవారు 43 లక్షల మంది ఉన్నారు. వీరికి కరోనావైరస్ సోకితే ఎక్కువ ముప్పు ఉండవచ్చు. వైరస్ ఏ వయస్సు వారికైనా సోకవచ్చు.
యుకే నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ 2013లో ప్రజల లైఫ్ స్టైల్ మీద సర్వే నిర్వహించినప్పుడు 25-44 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న21 శాతం మంది ఏదో ఒక దీర్ఘకాలిక రోగంతో బాధపడుతున్నవారని తెలిసింది.
కొంతమందికి వారికి తెలియని రోగాలు ఉండవచ్చు.
వ్యాప్తిని అరికట్టండి
చిన్న వయస్సులో ఉన్న వారు వైరస్ బారిన పడకపోవచ్చు. కానీ, వారు సులభంగా ఇతరులకు ఈ వ్యాధిని వ్యాపింప చేయగలిగే అవకాశం ఉంది.
వాళ్లకి చాలా తేలికపాటి లక్షణాలు ఉండి, వైరస్ సోకినట్లు తెలియకపోవచ్చు.
కరోనావైరస్ ఒక వ్యక్తి నుంచి ఇద్దరు లేదా ముగ్గురికి సోకే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ఆ ఇద్దరు, మరో ఇద్దరికీ, వారు మరో ముగ్గురికి వ్యాపింపచేసే అవకాశం ఉంది. ఇది కొన్ని క్షణాలలోనే వందల నుంచి వేలకి పెరిగిపోయే ప్రమాదం ఉంది.
సామాజిక దూరం మాత్రమే ఈ చైన్ ని బ్రేక్ చేస్తుంది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- ‘నేను చనిపోయినా ఫరవాలేదు.. ఈ వ్యాధిని ఆఫ్రికాకు మోసుకెళ్లకూడదని చైనాలోనే ఉండిపోయాను’
- కరోనావైరస్: ప్రపంచ చరిత్రను మార్చేసిన అయిదు మహమ్మారులు
- కరోనావైరస్: ఈ మహమ్మారి ఎప్పుడు ఆగుతుంది? జనజీవనం మళ్లీ మామూలుగా ఎప్పుడు మారుతుంది?
- కరోనావైరస్: ముంచుకొస్తున్న ఈ సునామీ నుంచి భారత్ తప్పించుకోగలదా
- కరోనావైరస్ గురించి ఈ సినిమా 10 ఏళ్ల కిందే చెప్పిందా?
- కరోనావైరస్: భారతదేశం కోవిడ్ నిర్థరణ పరీక్షలు తగిన స్థాయిలో ఎందుకు చేయలేకపోతోంది?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు
- ప్రపంచంలోనే హెచ్ఐవీని జయించిన రెండో వ్యక్తి.. ఎలా నయమయ్యిందంటే?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








