కరోనావైరస్: 'ఆంధ్రప్రదేశ్‌లోని 87 కేసుల్లో 70 మంది దిల్లీకి వెళ్ళి వచ్చిన వారే' - ముఖ్యమంత్రి వైఎస్ జగన్

వైఎస్ జగన్

ఫొటో సోర్స్, AP I&PR

దిల్లీలో జరిగిన మతపరమైన సదస్సుకు వెళ్లి వచ్చిన వారిలో కొందరికి కరోనావైరస్ సోకిందని, వారితో సన్నిహితంగా ఉన్నవారిని కూడా గుర్తిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు.

బుధవారం ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, "రాష్ట్రంలో నమోదైన మొత్తం 87 కరోనావైరస్ కేసుల్లో 70 మంది దిల్లీ వెళ్లివచ్చిన వారే ఉన్నారు" అని తెలిపారు. ఈ వైరస్ సోకినవారి పట్ల ఎవరూ వివక్ష చూపకూడదని, ఇతర రుగ్మతల నుంచి కోలుకున్నవారిని చూసినట్లే వారిని కూడా చూడాలని చెప్పిన ముఖ్యమంత్రి, ఎవరికి ఆరోగ్య సమస్య ఉన్నా 104 నంబరుకు ఫోన్ చేసి, వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

కరోనావైరస్

ప్రెస్‌మీట్‌లో జగన్:

దిల్లీ సదస్సుకు రాష్ట్రం నుంచి 1085 మంది వెళ్లారని వారిలో ఇప్పటివకు 585 మందికి పరీక్షలు నిర్వహించాం.

దిల్లీకి వెళ్లి వచ్చిన వారి సంబంధీకులు స్వచ్ఛందంగా బయటకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

కరోనావైరస్ ప్రభావం వల్ల రాష్ట్రానికి ఆదాయం తగ్గిన తరుణంలో ప్రభుత్వం పై భారాన్ని తగ్గించేందుకు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు తమ వేతనాలను వాయిదా వేసుకున్నారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

రైతులు, రైతు కూలీలతో పాటు ఆక్వా రంగం రైతులు, కూలీలు మధ్యాహ్నం 1 గంట వరకు పనులు చేసుకోవచ్చు. అయితే, వారు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి.

కోవిడ్-19 నయం చేయగలిన వ్యాధి. దీని గురించి ఎవరూ భయపడొద్దు.

81 శాతం మంది ఇళ్లలోనే ఉంటూ వైద్యం చేయించుకుని ఈ వ్యాధి నుంచి బయటపడుతున్నారు.

ఈ వ్యాధి సోకిన వారిపట్ల ప్రేమ ఆప్యాయతలను చూపించండి.

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)