ఎయిర్ ఇండియా పైలట్లు కరోనావైరస్ బారిన పడే ముప్పు ఎక్కువ ఉందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వికాస్ పాండే
- హోదా, బీబీసీ న్యూస్
కరోనా వైరస్ ప్రబలిన దేశాలలో చిక్కుకున్న భారతీయులను తిరిగి స్వదేశానికి తేవడంలో విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక పాత్ర పోషించింది. అయితే, ఇది సిబ్బందిని వైరస్ బారిన పడే ముప్పుకి గురి చేస్తుందని కొంత మంది పైలట్లు భయాన్ని వ్యక్తపరచగా ఆ భయాన్ని ఎయిర్ ఇండియా సంస్థ కొట్టి పడేసింది.
విపత్తుల్లో చిక్కుకున్న భారతీయుల్ని రక్షించడానికి భారత ప్రభుత్వం ఎయిర్ ఇండియా సేవలని చాలా సందర్భాల్లో వాడుకుంది. ప్రకృతి విపత్తుల సమయంలో సహాయ సామాగ్రిని తీసుకుని వెళ్ళడానికి కానీ, 2011లో అరబ్ స్ప్రింగ్ సమయంలో అరబ్ దేశాల నుంచి భారతీయుల్ని వెనక్కి తీసుకురావడంలో కానీ, ఎయిర్ ఇండియా ప్రధాన పాత్ర పోషించింది.
కోవిడ్-19 ప్రపంచ వ్యాప్తంగా ప్రబలుతున్న సమయంలో, వివిధ దేశాలలో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తేవడానికి సహాయం చేస్తున్న ఎయిర్ ఇండియా సిబ్బంది రక్షణ పట్ల, సంస్థ తగిన జాగ్రత్తలు తీసుకోలేదని, సిబ్బంది ఆరోపిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎగ్జిక్యూటివ్ పైలట్ అసోసియేషన్ ఎయిర్ ఇండియా యాజమాన్యానికి రాసిన ఒక లేఖని బీబీసీ పరిశీలించింది.
పైలట్లకి ఇచ్చిన రక్షణ సూట్లు ఒక్కసారి వేసుకుంటే చిరిగిపోయే విధంగా ఉన్నాయని ఆ లేఖలో ఆరోపించింది.
ఈ లేఖని, విమాన యాన మంత్రిత్వ శాఖకి, ఎయిర్ లైన్ యాజమాన్యానికి పంపించింది.
విమానాలలో చేసే శానిటైజేషన్ ప్రక్రియ కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేదని పేర్కొంది. ఇలాంటి లోపాలు ఉంటే కోవిడ్ 19 సులభంగా సిబ్బందికి, ప్రయాణీకులకు, వారి ద్వారా ఇతరులకి వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉందని లేఖలో రాసింది.
ఇండియన్ పైలట్స్ గిల్డ్ కూడా ఇటువంటి అంశాలనే పేర్కొంటూ ఒక లేఖ రాసింది. ఆ లేఖని కూడా బీబీసీ పరిశీలించింది.
"దేశంలో ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో పని చేయడానికి సిబ్బందికి ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ, మేము అడుగుతున్నదంతా సరైన రక్షణ పరికరాలు, అవసరమైన నిబంధనలను పాటించమని మాత్రమేనని" పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక సీనియర్ పైలట్ అన్నారు.
"సరైన నిబంధనల్ని పాటించకపోవడం వలన సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, ప్రయాణీకులు, ఆఖరికి పొరుగువారి ఆరోగ్యానికి కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. మమ్మల్ని సైనికులతో పోలుస్తున్నారు. చాలా సంతోషం. కానీ, సైనికుడికి కావల్సిన కవచాలు కూడా ఇవ్వాలి కదా".
ఈ లేఖలు అందినట్లు ఎయిర్ ఇండియా యాజమాన్యం ధృవీకరించింది.
"మా సిబ్బంది చాలా ధైర్యాన్ని, తెగువని, అంకిత భావాన్ని ప్రదర్శించారు. వారి ఆరోగ్యం కోసం అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాం. మా సిబ్బంది కోసం అత్యుత్తమమైన రక్షణ పరికరాలను తెప్పించాం’’ అని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి చెప్పారు.


- కరోనావైరస్ గురించి ఇంకా మనకెవరికీ తెలియని 9 విషయాలు..
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్: ఈ మహమ్మారి ఎప్పుడు ఆగుతుంది? జనజీవనం మళ్లీ మామూలుగా ఎప్పుడు మారుతుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు


ఫొటో సోర్స్, Getty Images
నిర్బంధాల ఉల్లంఘన
విదేశాల నుంచి తిరిగి వచ్చిన ప్రతి ఒక్కరు 14 రోజుల పాటు నిర్బంధంలో ఉండాలనే నియమాన్ని సిబ్బందికి వర్తింపచేయలేదని, ఎయిర్ ఇండియా పైలట్ తెలిపారు.
కోవిడ్ 19 కి ప్రభావితమైన దేశం నుంచి తిరిగి వచ్చిన ఒక పైలట్ ని 7 రోజుల లోపే మళ్ళీ విధుల్లోకి తీసుకున్న విషయం బీబీసీకి తెలుసు.
అయితే, ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా ఖండిస్తూ, తమ సిబ్బందినంతటిని 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండమని చెప్పామని చెప్పారు. స్వీయ నిర్బంధంలో ఉంటూ ఒక వేళ వైరస్ లక్షణాలు కన్పిస్తే వెంటనే రిపోర్ట్ చేయమని చెప్పినట్లు తెలిపారు.
ప్రభుత్వం విధించిన నిర్బంధన నియమాలన్నీ పాటిస్తున్నట్లు తెలిపారు.
సిబ్బందికి కోవిడ్ 19 కి సంబంధించి ఎటువంటి ఆరోగ్య బీమాలు లేవని ఆ లేఖల్లో పేర్కొన్నారు. అలాగే, వారు విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత వారికి వైద్య పరీక్షలు నిర్వహించడానికి ప్రత్యేకంగా వైద్య బృందాలు కూడా లేవని, రెండు లేఖలూ స్పష్టం చేశాయి.
దేశ వ్యాప్తంగా పని చేస్తున్న వైద్య సిబ్బందికి ప్రభుత్వం ప్రత్యేక ఆరోగ్య బీమా సదుపాయాలు కల్పిస్తుంటే, ఎయిర్ ఇండియా సిబ్బందికి మాత్రం అటువంటి సదుపాయాలు ఏమి లేవని ఆ లేఖల్లో ప్రశ్నించారు.
"మమ్మల్ని మేము వైద్యులతో పోల్చుకోవడం లేదు. కానీ, మా జీవితాలని పణంగా పెడుతున్నాం. ఒక ఆరోగ్య బీమా కాస్త ఊరటనిస్తుంది’’ అని ఒక పైలట్ అన్నారు.
అలాగే, ఎయిర్ ఇండియా సిబ్బందికి ఇవ్వవలసిన ఇతర వేతన బకాయిలు కూడా చెల్లించలేదని ఆ లేఖల్లో పేర్కొన్నారు.
మాకు చెల్లించే మొత్తం వేతనంలో 70 శాతం ఉండే ఫ్లైయింగ్ కి సంబంధించిన అదనపు వేతనాలు జనవరి 2020 నుంచి చెల్లించలేదని, ఇది సరైన పద్దతి కాదని ఆ లేఖల్లో పేర్కొన్నారు.
సిబ్బంది వేతనాలలో కోత విధించవద్దని, జీతాలు ఇవ్వడం ఆపవద్దని, ప్రధాని మోదీ చేసిన అభ్యర్ధనకి ఇది పూర్తి విరుద్ధంగా ఉందని పైలట్ అన్నారు.
"దేశానికి సేవ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ మా వేతనాలు మాకు ఇస్తే మా కుటుంబాలని పోషించుకోగల్గుతాం".
అయితే, సిబ్బందికి ఇవ్వవలసిన జీతాలన్నీ పూర్తిగా చెల్లించామని, కొన్ని అదనపు బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉందని, ఎయిర్ లైన్ ప్రతినిధి చెప్పారు.
ఎయిర్ ఇండియా సంస్థ తీవ్ర నష్టాలలో కూరుకుని, పెట్టుబడులను విక్రయించాలనే ఆలోచన ఇంకా ఫలించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎయిర్ లైన్ దేశంలో చిక్కుకున్న విదేశీయులని తమ తమ గమ్య స్థానాలకు చేర్చడానికి తన వంతు సహాయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
దేశంలోని వివిధ నగరాల్లో చిక్కుకున్న విదేశీయులను ఫ్రాంక్‌ఫర్ట్ లో వదిలి వచ్చేందుకు ప్రణాళిక చేస్తోంది. అయితే, యురోపియన్ దేశాలలో చిక్కుకున్న భారతీయులను మాత్రం ఇప్పుడు వెనక్కి తీసుకుని వచ్చే ఆలోచనల్లో లేదు.
ఎయిర్ ఇండియా సేవలని కొనియాడుతూ, ఖాళీ విమానాలు వెనక్కి వచ్చే బదులు, భారతీయులను వెనక్కి ఎందుకు తీసుకుని రాకూడదని పైలట్ ప్రశ్నించారు.
"మేము విధుల్ని నిర్వహించడం ఆపేయం, మా సమస్యలు వింటే బాగుంటుందని అనుకుంటున్నాం’’ అని ఇంకొక పైలట్ అన్నారు.
‘‘లేదంటే, అందరూ కలిసికట్టుగా పని చేయాల్సిన ఈ సమయంలో, ఈ పోరాటంలో మేము ఒంటరిగా మిగిలిపోతాం".
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: మోదీ ప్రభుత్వ ఆర్థిక ప్యాకేజీతో ప్రజలకు జరిగే మేలు ఎంత?
- కరోనా వైరస్ విజృంభిస్తున్నా... రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎందుకంత నిశ్చింతగా ఉన్నారు?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: చైనా కిట్లను, మాస్కులను తిరస్కరిస్తున్న యూరప్ దేశాలు
- కరోనావైరస్: దేశ వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోం ప్రయోగం చైనాలో ఇప్పుడు ఎలా ఉంది?
- కరోనావైరస్: భారత్ లో కోవిడ్-19 ను జయించిన 93 ఏళ్ల వృద్ధుడు
- కరోనావైరస్: కోవిడ్ రోగుల కోసం రూ. 50 వేలకే వెంటిలేటర్ చేయడం సాధ్యమేనా... భారత యువ ఇంజనీర్ల కృషి ఫలిస్తుందా?
- కరోనావైరస్: ఇటలీలో విజృంభించిన వైరస్, 12 వేలు దాటిన మృతులు... తప్పు ఎక్కడ జరిగింది?
- కరోనావైరస్ నివారణకు గోమూత్రం పని చేస్తుందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









