కరోనావైరస్: దేశ వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోం ప్రయోగం చైనాలో ఇప్పుడు ఎలా ఉంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లూ-హాయ్-లియాంగ్
- హోదా, బీబీసీ కోసం
తావ్ యు.... షాంఘైలోని చైనాలోనే అతి పెద్ద ఫైనాన్షియల్ హబ్‌లోని ఓ స్టైలిష్ ఆఫీస్‌లో పని చేస్తున్నారు.
ఆమె పని చేస్తున్న సంస్థ జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ పోర్షే మార్కెటింగ్ విభాగంలో మెంబర్ కూడా.
కోవిడ్ 19 మహమ్మారి కారణంగా ఆమెతో సహా కోట్లాది మంది ప్రస్తుతం ఇంటి దగ్గర నుంచే పని చేయాల్సి వస్తోంది.
కరోనావైరస్‌కు కేంద్ర బిందువైన హుబే ప్రాంతంలోనే తావ్ ఉంటున్నారు. కానీ ప్రస్తుతం తన కుటుంబ సభ్యులు నివసిస్తున్నహోంగ్యాంగ్‌లో ఉంటూ వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. సుమారు ఏడున్నర లక్షల జనాభా ఉన్న ఆ నగరం వుహాన్ తర్వాత అత్యధికంగా కోవిడ్-19 బాధితులున్న ప్రాంతం.
“ఉదయాన్నే నిద్ర లేచి బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేసుకొని నా పనిని మొదలుపెడతాను” అని తావ్ అన్నారు.
వర్క్ ఫ్రమ్ హోం చెయ్యడమంటే తావ్‌కి ఇష్టం లేదు. అయినా నగరం లాక్ డౌన్ అయ్యాక అందరూ ఆమెలాగే ఇంటి వద్ద నుంచే ఉద్యోగం చేస్తున్నారు. అయితే తన గురించి తన సహోద్యోగులు ఏమనుకుంటారో అన్నదే ఇప్పుడు ఆమె భయం.
“ఇంటి దగ్గర నుంచి పని చేసినా, ఆఫీస్ నుంచి పని చేసినా తేడా ఏం ఉండదన్న విషయాన్ని నా పని ద్వారా చెప్పాలనుకుంటూ ఉంటాను. కానీ నా సహోద్యోగులు నేను ఇంట్లో హాయిగా ఉంటున్నానని అనుకుంటారేమో అన్నదే నా బాధ. ఇంటి నుంచి పని చేయడమంటే సుఖ పడిపోవడమేనని వాళ్లు అనుకుంటూ ఉంటారు” అని తావ్ వివరించారు.
పశ్చిమ దేశాలతో పోల్చితే చైనాలో ఇంటి నుంచే పని చెయ్యడం అన్న సంస్కృతి అంతంత మాత్రంగానే ఉంటుంది.
కానీ ఫిబ్రవరి3 తర్వాత పరిస్థితి మారింది.
అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులు ఇంటి నుంచి పని చెయ్యడానికే ప్రాధాన్యమిస్తున్నాయి. ఎప్పుడూ బిజీగా ఉండే బీజింగ్, షాంఘై నగరాల వీధులు ఇప్పుడు నిశ్శబ్దంగా మారిపోయాయి.
వర్క్ ఫ్రమ్ హోం పుణ్యమా అని చైనాలోని వీడియో కాన్ఫరెన్స్ అప్లికేషన్లు వియ్ చాట్, డింగ్ టాక్, జూమ్ వంటి వాటికి తెగ డిమాండ్ ఏర్పడింది.
దీంతో ఓ వైపు కరోనావైరస్ పుణ్యమా అని స్టాక్ మార్కెట్లన్నీ నేల చూపులు చూస్తుంటే.. మరోవైపు అమెరికాకి చెందిన జూమ్ కంపెనీ స్టాక్స్ మాత్రం దూసుకెళ్తున్నాయి.
అయితే ఈ వర్క్ ఫ్రం హోమ్ సంస్కృతి పట్ల చైనాలో ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నారు. కొన్ని సంస్థలకు చెందిన అధిపతులు తమ ఉద్యోగులు ఇంటి వద్ద ఉంటూ సక్రమంగా పని చేస్తారని నమ్మడం లేదు.
మరోవైపు కొంత మంది ఉద్యోగులు పని చేస్తున్న సమయంలో తమ కుటుంబ సభ్యుల నుంచి ఏవో ఒక అవాంతరాలు ఎదురవుతూ ఉండటంతో ఏకాగ్రతతో పని చెయ్యలేకపోతున్నామని అంటున్నారు. మరి కొంత మంది మాత్రం ఈ సరికొత్త విధానాన్ని ఆస్వాదిస్తూ అత్యుత్తమ పని తీరును కనబరుస్తున్నారు.


- కరోనావైరస్ గురించి ఇంకా మనకెవరికీ తెలియని 9 విషయాలు..
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్‌కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్: ఈ మహమ్మారి ఎప్పుడు ఆగుతుంది? జనజీవనం మళ్లీ మామూలుగా ఎప్పుడు మారుతుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు


ఫొటో సోర్స్, Getty Images
కచ్చితంగా అలవాటు కావాల్సిందే
32 ఏళ్ల సన్ మెంగ్ బీజింగ్ కేంద్రంగా నడుస్తున్న ఆన్ లైన్ ఎడ్యుకేషన్ సంస్థ విఐపీ కిడ్స్‌లో కరిక్యులమ్ ప్లానర్, డిజైనర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
సుమారు నెలన్నరగా ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఫలితంగా రోజూ వెళ్లి రావడానికి అయ్యే నాలుగు గంటల సమయం ఆమెకు ఆదా అవుతోంది. ఇలా పని చెయ్యడం తనకెంతో బాగుందని అన్నారు ఆమె.
నిజానికి ఆమె తాను పని చేసే చోట ఉండలేరు. ఎందుకంటే తన భర్త పని చేస్తున్న సంస్థ వారికి అన్ని సౌకర్యాలను అందిస్తోంది. అంటే వారి 3 ఏళ్ల చిన్నారికి కిండర్ గార్టెన్ స్కూల్ సౌకర్యం కూడా.
అది పబ్లిక్ కిండర్ గార్టెన్ స్కూల్. ఒక వేళ సన్ మెంగ్ తన ఆఫీస్ దగ్గరగా ఇల్లు తీసుకుంటే అప్పుడు తమ బిడ్డను ప్రైవేటు స్కూల్లో చేర్చాలి. కానీ తమకు అది చాలా ఖరీదైన వ్యవహరమని ఆమె అన్నారు.
గతంలో కనీసం వారంలో రెండు రోజుల పాటు తనకు ఇంటి నుంచే పని చేసే అవకాశం ఇవ్వాలని సన్ తాను పని చేస్తున్న సంస్థకు విజ్ఞప్తి చేశారు. కానీ సదరు కంపెనీ మాత్రం కేవలం ఆమె పని వేళలు మార్చి ఊరుకుంది.
కానీ ఇప్పుడు ఉద్యోగులతో బలవంతంగా ఇంటి నుంచే పని చేయిస్తున్నప్పటి నుంచీ వారి పని తీరు బాగా మెరుగుపడిందన్న విషయాన్ని తమ కంపెనీ సీఈఓ సైతం అంగీకరిస్తున్నారని సన్ చెబుతున్నారు.
ఇప్పుడు తాను ఇంటి నుంచే పని చేస్తుండటం వల్ల తన బిడ్డ తన కోసం సాయంత్రం వరకు ఎదురు చూడాల్సిన పని లేదని సన్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
“నా పని పూర్తయిన వెంటనే నా ల్యాప్ ట్యాప్ మూసేసి వాడితో హాయిగా ఆడుకుంటున్నాను.”

ఫొటో సోర్స్, Getty Images
వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఎందుకు అయిష్టత?
కోవిడ్ 19 రాక ముందు ఎంత శాతం ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేసేవారన్న విషయంలో కచ్చితమైన లెక్కలు లేవు.
2019 IWG గ్లోబల్ వర్క్ స్పేస్ సర్వే ప్రకారం చైనాలో 51 శాతం కంపెనీలు తమ సంస్థల్లో ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేస్ విధానం ఉందని చెప్పుకొచ్చాయి.
అదే అమెరికాలో అయితే సుమారు 69 శాతంగా ఉంది. ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ అనడాన్ని ఒక్కో సంస్థ ఒక్కోలా నిర్వచించుకుంటాయి.
అయితే అమెరికాతో పోల్చితే చైనాలో ఉద్యోగులు ఇంటి నుంచి పని చెయ్యడానికి తక్కువ మోజు చూపుతుంటారని చెబుతుంటారు.
ఉదాహరణకు 2017లో గాల్‌అప్ అనే సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం కనీసం కొద్ది గంటలైనా ఇంటి నుంచి పని చేసిన ఉద్యోగుల శాతం కేవలం 43 మాత్రమే ఉందని తేలింది.
ఏవో ఒకటి రెండు సృజనాత్మక విభాగాల్లో పని చేసే సంస్థలు తప్ప చైనాలోని మెజార్టీ కంపెనీలు ఇప్పటికీ సంప్రదాయ బద్ధమైన కార్యాలయ సంస్కృతికే పరిమితమయ్యాయి.
వర్క్ ఫ్రమ్ హోం సంస్కృతి తక్కువగా ఉండటానికి అదే కారణం అంటారు ప్రాఫెట్ సంస్థలో ఆసియా రీజనల్ లీడ్ , సీనియర్ పాట్నర్‌గాపని చేస్తున్న జై మిల్లికెన్.

ఫొటో సోర్స్, Getty Images
హాజరుకు, బోనస్‌లకు ముడి
ఇప్పటికీ అక్కడ మెజార్టీ సంస్థలు తమ ఉద్యోగులు రోజూ వేళకు ఆఫీసుకు రావాలనే నమ్ముతుంటాయి. వారి హాజరుకు, వారికిచ్చే బోనస్‌లకు ముడిపెడుతుంటాయి. వర్క్ ఫ్రమ్ హోం అనేది వారి నమ్మకాలకు పూర్తి విరుద్ధం అని మిల్లెకన్ వ్యాఖ్యానించారు.
36 ఏళ్ల షిన్ సన్.. షెంజాన్‌లోని పింగాన్ బ్యాంక్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నారు. తన కింద పని చేసే ఉద్యోగులు ఆఫీసుకు రాకపోతే వారిపై తనకు పట్టు సడలిపోతుందన్నది ఆయన భావన.
“సరైన కమ్యూనికేషన్ లేకపోవడం, ఇంటి దగ్గర నుంచి పని చేస్తూ వ్యక్తిగత పనులపై శ్రద్ధ పెట్టి అసలు పనిని పక్కన పడేయడం వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది చాలా క్లిష్టమైన వ్యవహారం” అని షిన్ సన్ అన్నారు.
“ఇంటి నుంచి పని చెయ్యడం వల్ల కొన్ని సార్లు నా సహోద్యోగులు చాలా ఆలస్యంగా ప్రతిస్పందిస్తారు. అందువల్ల వాళ్లు నా అదుపాజ్ఞల్లో లేరేమోనని నాకు అనిపిస్తుంటుంది.
సాధారణంగా వారానికోసారి మేం సమావేశమవుతుంటాం. కానీ ఇంటి నుంచి పని చెయ్యడం వల్ల అందరం ఒకే పనిని లక్ష్యం దిశగా చేస్తున్నామా..? లేదా..? అని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు రోజూ సమావేశం కావాల్సి వస్తోంది.
అంతేకాదు.. రోజూ వారిని ఇవాళ ఏం చేశావు? రేపు ఏం చేస్తావు? అని ప్రశ్నించాల్సి వస్తోంది. నిజానికి వాళ్లను పని దిశగా ప్రోత్సహించడానికే ఇలా చేస్తుంటాను. అంతే కానీ వారిని నిరుత్సాహపరిచేందుకు కాదు.” అని వర్క్ ఫ్రమ్ హోం విధానంపై షిన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
మరోవైపు ఇంటి నుంచి పని చెయ్యడం వల్ల ప్రతి విషయాన్నిఒకటికి నాలుగుసార్లు చెక్ చేసుకోవాల్సి రావడం తమకు ఇబ్బందికరంగా మారుతోందని అంటున్నారు కొందరు ఉద్యోగులు.
23 ఏళ్ల యంగ్ చైనాలోని ఓ గేమింగ్ కంపెనీలో ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇప్పుడు తానూ రోజు మరిన్ని కాన్ఫరెన్స్ కాల్స్ చెయ్యాల్సి వస్తోందని ఫలితంగా పని చేసే సమయం తగ్గిపోతోందని ఆమె అంటున్నారు.
“నేను ఆఫీస్‌లో ఉంటూ పని చేసే సమయంలో ప్రతి రోజూ నివేదికలు సమర్పించాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ప్రతి చిన్న విషయాన్నినోట్ చేసుకోవాల్సి వస్తోంది. ప్రతి రోజు మా బాస్‌కి రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తోంది. ఒక్కోసారి నా పని తీరు ఎక్కడ దెబ్బతింటోందో అని నాకు భయం వేస్తోంది” అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘ఇప్పుడే చెప్పలేం’
“నిజానికి చైనా పని సంస్కృతి సంప్రదాయ బద్ధమైనదే అయినప్పటికీ సాంకేతికంగా ఇంటి వద్ద నుంచి పని చేసే పద్ధతికి బాగా అనువైనది కూడా. వియ్ చాట్ వంటి అప్లికేషన్లు ద్వారా అన్ని పనులు చేసుకోవచ్చు. చైనాలో సుమారు వందకోట్ల మంది ఆ అప్లికేషన్‌ను వినియోగిస్తున్నారు. చైనాలో చాలా మధ్య, చిన్నతరహా కంపెనీలకు వియ్ చాట్ వినియోగం తప్పనిసరి అయిపోయింది” అని వియ్ చాట్‌పై పుస్తకాన్ని రాస్తున్న మాథ్యూ బ్రెన్నన్ వ్యాఖ్యానించారు.
ఈ వర్క్ ఫ్రమ్ హోం విధానం వల్ల ఆకాశాన్నంటే కార్యాలయాల అద్దెల భారం నుంచి కూడా తప్పించుకోవచ్చు.
అయితే భవిష్యత్తులో కూడా ఇదే స్థాయిలో ఇంటి నుంచి పని చేసే విధానం చైనాలో కొనసాగుతుందా లేదా అన్నవిషయం చెప్పడం మాత్రం ఇప్పటికీ కష్టమే.
“జనం తరచు మానసికంగా, శారీరకంగా కూడా అలసిపోతుంటారు. ఇప్పుడు ఇంటి నుంచే పని చెయ్యడం ద్వారా చాలా మంది అటు ఉద్యోగానికి, ఇటు వ్యక్తిగత జీవితానికి మధ్య సమతుల్యతను పాటించగల్గుతున్నారు. బహుశా ఈ విధానానికి భవిష్యత్తులో మరింత డిమాండ్ పెరగవచ్చని భావిస్తున్నా.”
అని బీజింగ్‌లోని జియోటాంక్ యూనివర్శిటిలో ఎంటర్‌ప్రైజ్ కల్చర్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న కున్ లీ.
అయితే ఇది వారు ఎటువంటి ఉద్యోగం చేస్తున్నారన్నదానిపైనా ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.
టెక్, మీడియా కంపెనీల్లో ఇటువంటి సౌకర్యం ఉన్నప్పటికీ సంప్రదాయ సిద్ధమైన ఉత్పత్తి ఆధారిత పరిశ్రమల్లో మాత్రం ఉద్యోగస్తులు పని చేసే చోట ఉండటం తప్పని సరి అవుతుందని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అనేక సంస్థలు ఆన్ లైన్ ఆఫీస్ ప్లాట్ ఫామ్స్ పైనా, ఉద్యోగులకు శిక్షణ అందించడంపైనా చాలా వరకు ఖర్చు చేశాయి.
అందువల్ల ఈ సౌకర్యాన్ని భవిష్యత్తులోని అవి ఉపయోగించుకోవచ్చని అన్నారు బీజింగ్‌లోని షెంగ్ కాంగ్ బిజినెస్ స్కూల్లోని ఆర్గనైజేషనల్ బిహేవియర్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న షియామెంగ్.
“ఓ రకంగా తమకు, ఉద్యోగులకు మధ్య ఉన్న సంబంధాలను కంపెనీలు పునఃపరిశీలించుకునేందుకు, కార్పేరేట్ సంస్కృతిని పెంపొందించుకోవడం ద్వారా పరస్పరం లాభం పొందేందుకు కోవిడ్ 19 మరో అవకాశాన్ని ఇచ్చింది” అని ఆమె వ్యాఖ్యానించారు.
అయితే 29ఏళ్ల క్లిండే లాంటి వాళ్లు మాత్రం వర్క్ ఫ్రమ్ సంస్కృతి పట్ల కాస్త విముఖత చూపుతున్నారు.
“మాది చాలా చిన్న ఇల్లు. నేను నా భర్త కలిసి ఇప్పుడు ఒకే గదిలో పని చేస్తున్నాం. ఒకరినొకరు డిస్ట్రబ్ చేసుకుంటూనే ఉంటాం. అంతేకాదు కరోనావైరస్ కారణంగా క్లయింట్లు తమ ఈవెంట్లను రద్దు చేసుకుంటే మార్కెటింగ్ బడ్జెట్ కూడా తగ్గించాల్సి వస్తుందని బాస్ చెబుతున్నారు. దాంతో నా భవిష్యత్తు పట్ల నాకు చాలా భయమేస్తోంది” అని ఆమె చెప్పుకొచ్చారు.
అయితే ఈ విధానం వల్ల తన జీవితంలో ఎదురైన ఓ సానుకూల పరిణామాన్ని కూడా ఆమె చెప్పుకొచ్చారు.
“24 గంటలు ఇంట్లోనే ఉండటం వల్ల మా ఇద్దరి మధ్య అనుబంధం పెరిగింది. గతంలో ఎప్పుడూ బిజీ బిజీగా గడిపేవాళ్లం. ఉద్యోగం కారణంగా ఆలస్యంగా ఇల్లు చేరే వాళ్లం. కానీ ఇప్పుడు ఒకరితో ఒకురు ఎక్కువ సమయాన్ని గడపగల్గుతున్నాం. ఇద్దరం బాగా దగ్గరయ్యాం” అని సంతోషంగా చెప్పారు క్లిండే.
అదనపు వివరాలు అందించిన వారు మన్యూ జియాంగ్
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: చైనా కిట్లను, మాస్కులను తిరస్కరిస్తున్న యూరప్ దేశాలు
- కరోనావైరస్: భారత్ లో కోవిడ్-19 ను జయించిన 93 ఏళ్ల వృద్ధుడు
- కరోనావైరస్: కోవిడ్ రోగుల కోసం రూ. 50 వేలకే వెంటిలేటర్ చేయడం సాధ్యమేనా... భారత యువ ఇంజనీర్ల కృషి ఫలిస్తుందా?
- కరోనావైరస్: ఇటలీలో విజృంభించిన వైరస్, 12 వేలు దాటిన మృతులు... తప్పు ఎక్కడ జరిగింది?
- నిజాముద్దీన్ తబ్లీగీ జమాత్ మర్కజ్: కరోనావైరస్ వ్యాప్తి చర్చలో కేంద్ర బిందువుగా మారిన తబ్లీగీ జమాత్ ఏం చేస్తుంది?
- కరోనావైరస్ వల్ల చిన్నపిల్లలకు, టీనేజర్లకు కూడా ముప్పు ఉందా?
- కరోనావైరస్: దిల్లీ నిజాముద్దీన్ తబ్లీగీ జమాత్ సదస్సుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంత మంది వెళ్ళారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









