హాంగోవర్ కూడా ఒక జబ్బే: జర్మనీ కోర్టు తీర్పు

ఫొటో సోర్స్, AFP
హ్యాంగోవర్ కూడా ఒక వ్యాధే అని జర్మనీలోని ఒక కోర్టు తీర్పు ఇచ్చింది. యాంటీ-హాంగోవర్ డ్రింక్ తయారు చేసిన ఒక సంస్థకు వ్యతిరేకంగా వేసిన కేసులో కోర్టు ఈ తీర్పు చెప్పింది.
తాము తయారు చేసిన యాంటీ-హాంగోవర్ డోసు, పానీయాలు, పౌడర్లతో ఆరోగ్యంగా ఉండవచ్చని సదరు కంపెనీ తప్పుడు ప్రకటనలు చేస్తోందని ఫ్రాంక్‌పర్ట్‌లోని కోర్టులో కొందరు కేసు వేశారు.
దీనిపై విచారణ జరిగిన సమయంలో "సాధారణ స్థితిలో ఉన్న శరీరంలో చిన్న, తాత్కాలిక మార్పు వచ్చినా దానిని వ్యాధిగానే పరిగణించాలి. పానీయాలు, పౌడర్లు సహా ఏ ఆహార పదార్థాలనైనా 'ఇది వ్యాధులను నయం చేస్తుందని' చెబుతూ మార్కెట్ చేసుకోకూడదు" అని కోర్టు చెప్పింది.
ఏదైనా ఒక ఆహార పదార్థం గురించి ఇచ్చే సమాచారంలో, దానికి మనుషుల వ్యాధులు నివారించే, చికిత్స అందించే, లేదా నయం చేసే లక్షణాలు ఏవైనా ఉన్నాయని చెప్పకూడదని, దానిలో అలాంటి లక్షణాలు ఉన్నాయేమో అనే భావన కలిగించకూడదని కోర్టు సూచించింది.
"ఒక వ్యాధి వల్ల మామూలుగా ఉన్న శరీర స్థితిలో లేదా శరీరం చర్యల్లో ఒక వ్యాధి వల్ల చిన్న, తాత్కాలిక అంతరాయం వచ్చినా ఎవరికైనా అది తెలుస్తుంది".
ఈ కేసు విషయానికి వస్తే హాంగోవర్ వల్ల అలసిపోవడం, వికారంగా అనిపించడం, తలనొప్పి లాంటివి వస్తాయి. అలాంటి లక్షణాలను తమ యాంటీ-హ్యాంగోవర్ డోసు, పౌడర్లు నయం చేస్తాయని సదరు కంపెనీ చెప్పింది.
కానీ హాంగోవర్‌ను కూడా వ్యాధిగానే చెప్పిన కోర్టు ఆ కంపెనీ వాదనలను తప్పుబట్టింది.
మ్యూనిచ్‌లో ఏటా జరిగే అక్టోబర్ ఫెస్ట్ మొదలైన కొన్ని రోజులకే కోర్టు హాంగోవర్‌ను కూడా వ్యాధిగా చెప్పడం విశేషం.
ఇవి కూడా చదవండి:
- రక్తం చిందినట్టు ఎరుపు రంగులోకి మారిపోయిన ఆకాశం.. ‘ఇది అంగారక గ్రహం కాదు.. మా ఊరే’
- బీరు తాగితే చల్లదనం వస్తుందా?
- మహిళలు మద్యం తాగితే పిల్లలు పుట్టరా?
- రోజూ ఒక్క పెగ్గేసినా గుండెకు ముప్పే: ద లాన్సెట్
- మద్యం అతిగా తాగితే... డీఎన్ఏ డామేజ్ అవుతుందా...
- పది నిమిషాల్లో ఆనందాన్ని పెంచుకోవడం ఎలా?
- అరటిపండు తింటే హ్యాంగోవర్ దిగిపోతుందా
- దక్షిణాది పురుషుల్లో తగ్గుతున్న వీర్య కణాలు.. ఏపీలో 5శాతం మందికి సంతాన లేమి
- ‘క్యాన్సర్ చికిత్సతో గుండెపోటు వచ్చినా బతికి బయటపడ్డాను’
- కశ్మీరీలను ఆగ్రా జైలులో పెట్టిన ప్రభుత్వం.. తమవారిని కలుసుకునేందుకు ఇబ్బందులు పడుతున్న బంధువులు
- హైదరాబాద్ ఖజానా నుంచి పాకిస్తాన్‌కు చేరిన 3.5 కోట్ల పౌండ్ల సొమ్ము దక్కేది ఎవరికి?
- అడ్వాణీని కోలుకోలేకుండా చేసిన ఆ ఒక్క తప్పు
- గుజరాత్: బ్రెజిల్‌కు ఆనాడు ఆవుల్ని, ఎద్దుల్ని ఇచ్చి.. ఇప్పుడు వీర్యం అడుగుతోంది
- ఇస్లామిక్ యోగా: యోగా క్లాసుల్లో అల్లా ప్రార్థనలు చేస్తున్న గుజరాత్ ముస్లిం మహిళలు
- మోదీ వల్ల పాకిస్తాన్లో కశ్మీర్‌పై చర్చ స్వరూపమే మారిపోయిందా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








