మహిళలు మద్యం తాగితే పిల్లలు పుట్టరా?

ఫొటో సోర్స్, others
- రచయిత, అపర్ణ రామమూర్తి
- హోదా, బీబీసీ ప్రతినిధి
మద్యపానం వల్ల మహిళలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? వైద్యులు ఏమంటున్నారు? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?
మద్యం ప్రభావం పురుషులతో పాటు, మహిళల మీద కూడా ఉంటుందని చెన్నైకి చెందిన ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్. హెలెన్ అంటున్నారు.
ఆల్కహాల్ మహిళల్లో గర్భధారణ సామర్థ్యాన్ని తగ్గిస్తుందని ఆయన చెప్పారు.
మహిళ పునరుత్పత్తి వ్యవస్థలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు అత్యంత కీలకమైనవి. మన ఆహారపు అలవాట్లను బట్టి ఈ హార్మోన్ల ఉత్పత్తిలో తేడాలు వస్తుంటాయి. మద్యం తాగడం వల్ల ఈ హార్మోన్లపై ప్రభావం పడుతుందని హోలెన్ చెబుతున్నారు.
వారంలో 6 నుంచి 14 సార్లు మద్యం తీసుకునే మహిళల్లో సంతాన సామర్థ్యం 20 శాతం నుంచి 25 శాతం తగ్గుతుందని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది.
అలాగని, అంతకంటే తక్కువ తాగితే ప్రభావం ఉండదని కాదు. అది, ఆయా వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది.
మహిళల్లో అండం ఉత్పత్తి మీద కూడా ఆల్కహాల్ ప్రభావం ఉంటుంది. దాంతో, నెలసరి క్రమం తప్పుతుంది. గర్భం దాల్చడం కష్టమవుతుంది. ఒకవేళ గర్భం దాల్చినా.. అబార్షన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
బిడ్డకు పాలిచ్చే తల్లులు కూడా మద్యానికి దూరంగా ఉండటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మద్యం సేవించడం ద్వారా ఎండోమెట్రియాసిస్ అనే వ్యాధి వచ్చే అవకాశం కూడా ఉంటుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఈ వ్యాధి వల్ల కడుపునొప్పి తీవ్రంగా ఉండడమే కాకుండా సంతాన లేమికీ దారి తీయొచ్చు.
"పార్టీలు చేసుకోవడం, పబ్బులకెళ్లడం, మద్యం సేవించడం ప్రస్తుతం కార్పొరేట్ సంస్కృతిలో భాగమైపోయాయి" అని చెన్నైకి చెందిన ఐటీ ఉద్యోగి దివ్య అన్నారు.
అయితే, పరిస్థితులు మారినా.. సంతానం విషయంలో మహిళలు, పురుషులు ఇద్దరూ ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముందని వైద్యులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- శవాన్ని ఎరువుగా మార్చడం ఎలా?
- 'రేప్ - ఉరిశిక్ష'పై ప్రధాని మోదీ దేశానికి అబద్ధం చెప్పారా?
- 'అనాథ' పాపకు పాలిచ్చి కాపాడిన మహిళా కానిస్టేబుల్
- టర్కీలోని ఈ పట్టణం మరికొన్ని రోజుల్లో అదృశ్యమైపోతుంది
- తెలంగాణ: 'కోతుల బాధితుల సంఘం'... పొలం కాపలాకు లక్ష జీతం
- ఆడియన్స్ కళ్లలో ఆనందం కోసం.. ఒత్తిడిలోకి యూట్యూబ్ స్టార్స్
- పంటల బీమా: రైతుల కోసమా - కంపెనీల కోసమా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









