ప్రధాని మోదీ నరేంద్ర మోదీ 'రేప్ - ఉరిశిక్ష' గురించి దేశానికి అబద్ధం చెప్పారా? : Fact Check

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఫ్యాక్ట్ చెక్ బృందం
    • హోదా, బీబీసీ న్యూస్

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటన ఆధారంగా ఉన్న ఒక ట్వీట్ కారణంగా గురువారం, శుక్రవారం చాలా ట్రోల్ జరిగింది. కొందరు ఆయన్ను 'అబద్ధాలకోరు'గా వర్ణిస్తున్నారు.

ఏఎన్‌ఐ వార్తా సంస్థ చేసిన ట్వీట్‌ను సోషల్ మీడియాలో వేల మంది రీట్వీట్ చేశారు.

బుధవారం గుజరాత్ సూరత్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ... "దేశంలో రేప్ ఘటనలు గతంలోనూ జరిగేవి, మనం ఇప్పుడు కూడా అలాంటి వాటి గురించి వినడం సిగ్గుపడాల్సిన విషయం. అయితే, ఇక నిందితులను 2 రోజులు, 7 రోజులు, 11 రోజులు, ఒక నెలలో ఉరికంబానికి వేలాడేలా చేస్తున్నాం. దేశ యువతులకు న్యాయం అందించడానికి మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. దాని ఫలితాలు అందరి ముందూ ఉన్నాయి" అన్నారు.

నరేంద్ర మోదీ, ఏఎన్ఐ ట్వీట్

ఫొటో సోర్స్, ANI/Twitter

జమ్ము-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, సింగర్ విశాల్ డడ్లానీ, కాంగ్రెస్ నేత షామా మహమ్మద్‌తోపాటు పలువురు నేతలు, ప్రముఖ పాత్రికేయులు కూడా ఈ ట్వీట్‌ను రీ-ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ జ్ఞానం, ఆయనకు తెలిసిన సమాచారంపై ప్రశ్నలు లేవనెత్తారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

తమను తాము మోదీ-శత్రువులుగా చెప్పుకునే కొన్ని సోషల్ మీడియా గ్రూపులు కూడా ప్రధాని మోదీ ప్రసంగించిన చిన్న వీడియోను షేర్ చేశాయి. ఇందులో ఆయన 3 రోజులు, 7 రోజులు, 11 రోజులు, నెలలోపు ఉరిశిక్ష వేస్తామనే మాటలు వినిపిస్తాయి.

కానీ, మా పరిశీలనలో ఈ వాదనల్లో నిజం లేదని తేలింది. ఎందుకంటే, ప్రధాని మోదీ హిందీలో ఇచ్చిన ప్రసంగాన్ని విని ఏఎన్ఐ అనువాదం చేయడంతో ఈ ట్వీట్‌లో ట్రాన్స్‌లేషన్ తప్పు దొర్లింది.

ప్రధాని మోదీ అన్న మాట ఇది...

నిజానికి సూరత్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ "ఈ దేశంలో అత్యాచారాలు మొదట్లో కూడా జరిగేవి. సమాజంలో ఈ ఘటనల గురించి మనం ఇప్పటికీ వినవచ్చు. తల సిగ్గుతో వంగిపోతుంది. బాధ కలుగుతుంది. కానీ, ఇప్పుడు మూడు రోజుల్లో ఉరిశిక్ష, ఏడు రోజుల్లో ఉరిశిక్ష, 11 రోజుల్లో ఉరిశిక్ష, నెలలో ఉరిశిక్ష. అత్యాచార ఘటనలకు బలైన ఆ యువతులకు న్యాయం అందించడానికి ఒకొక్కటిగా చర్యలు చేపడుతున్నాం. కానీ, దేశ దౌర్భాగ్యం ఏంటంటే ఈ అత్యాచార ఘటనలు ఏడు రోజులూ టీవీల్లో చూపిస్తారు. కానీ, ఉరిశిక్ష వేశారనే వార్త అలా వచ్చి అలా వెళ్లిపోతుంది. ఉరిశిక్ష వేస్తారనే వార్త ఎంత ఎక్కువగా వ్యాపిస్తే, అత్యాచారం చేయాలని అనుకుంటున్నవాళ్లు అంత భయపడతారు. 50 సార్లు ఆలోచిస్తాడు" అన్నారు.

ఆయన ప్రసంగం పూర్తి వీడియోను మనం యూ-ట్యూబ్‌లో చూడచ్చు. దీనిని చూస్తే పీఎం మోదీ 'అత్యాచార నిందితులకు వీలైనంత త్వరగా ఉరిశిక్ష విధించే' మాట చెబుతున్నారు. ఆయన వారిని 'ఉరికంభానికి వేలాడదీసే' మాట చెప్పడం లేదు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

అయినా, ఈ వివరాలు బహిరంగంగా అందుబాటులో ఉన్నాయి. అత్యాచారం కేసులో భారత్‌లో చివరి సారి 2004లో పశ్చిమ బంగలో ధనంజయ్ చటర్జీకి ఉరిశిక్ష విధించారు. కోల్‌కతాలో ఒక 15 ఏళ్ల స్కూల్ విద్యార్థినిపై అత్యాచారం, హత్య చేసినందుకు దోషి ధనంజయ్ చటర్జీకి 2004 ఆగస్టు 14న అలీపూర్ సెంట్రల్ జైలులో తెల్లవారుజామున 4.30కు ఉరిశిక్ష వేశారు.

కానీ, మోదీ మాటల్లో అర్థం ఏంటంటే.. తన పదవీకాలంలో పరిస్థితులు మారాయని చెప్పాలనుకున్నారు. ఇప్పుడు అత్యాచార నిందితులకు 3, 7, 11 రోజులు, నెలలోపు ఉరిశిక్ష పడుతోందని చెప్పారు. ఇందులో ఎంత నిజం ఉంది?

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

మోదీ మాటల్లో వాస్తవం ఎంత?

మా పరిశోధనలో అత్యా చార ఘటనల్లో విధించిన శిక్షల వివరాల గురించి సెర్చ్ చేసినపుడు చాలా ఆన్‌లైన్ రిపోర్టులు వెలుగులోకి వచ్చాయి.

కోర్టులో ఈ కేసుల ఈ విచారణలు వేగంగా జరగడానికి కారణం మైనర్లపై లైంగిక వేధింపులకు సంబంధించి మోదీ క్యాబినెట్ తీసుకువచ్చిన పోక్సో చట్ట సవరణే అని చట్ట నిపుణులు చెబుతున్నారు.

అయితే దీనికి సంబంధించి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 2016 తర్వాత ఎలాంటి డేటా విడుదల చేయలేదు. ఉత్తర ప్రదేశ్ ఉన్నావ్, జమ్ము-కశ్మీర్ కఠువా రేప్ కేసుల తర్వాత పోక్సో చట్టానికి కఠిన నిబంధనలు జోడించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చింది. 2018 ఏప్రిల్ 21న కేంద్ర క్యాబినెట్ 12 ఏళ్ల వరకూ పిల్లలపై అత్యాచారం చేసిన కేసుల్లో దోషులకు ఉరి శిక్ష విధించడానికి సంబంధించిన ఆర్డినెన్సును ఆమోదించింది.

దిల్లీలో ఉన్న నేషనల్ లా యూనివర్సిటీ విడుదల చేసిన ద డెత్ పెనాల్టీ ఇన్ ఇండియా:2018 రిపోర్టు ప్రకారం 2018లో భారత్‌లోని కింది కోర్టుల్లో(ట్రయల్ కోర్టు) మొత్తం 162 మందికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వచ్చింది. వీటిలో ఎక్కువ కేసులు 'పిల్లలపై లైంగిక వేధింపుల'కు సంబంధించనవే.

ఈ విస్తృత రిపోర్ట్ ప్రకారం 2018లో పిల్లలపై లైంగిక వేధింపులు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ఇంత మంది నిందితులకు ఒకే ఏడాదిలో ఉరిశిక్షలు విధించడం ఇదే మొదటిసారి. కానీ వీరిలో ఎవరినీ ఉరితీయలేదు.

పిల్లలు, అత్యాచారం, మరణశిక్ష, భారతదేశం

ఫొటో సోర్స్, Getty Images

శిక్ష విధించడం న్యాయం కాదు

ఈ పరిశీలనలో మోదీ "దేశ యువతులకు న్యాయం అందించడం కోసం నిందితులకు వీలైనంత త్వరగా ఉరిశిక్ష విధిస్తున్నాం" అని చెప్పడం కరెక్టే అని తేలింది. కానీ దీనిని బాధితులకు న్యాయం అందించడం అనడం సబబేనా? ఆ విషయం తెలుసుకోడానికి మేం సీనియర్ జర్నలిస్ట్, చట్ట నిపుణులు అనూప్ భట్నాగర్‌తో మాట్లాడాం.

‘ట్రయల్ కోర్టు... అంటే అన్నిటికంటే మొదటి కోర్టు. కింది కోర్టు వేగంగా విచారణ జరిపిన తర్వాత ఉరిశిక్ష విధించినా, ఆ తీర్పును పై కోర్టులో సవాలు చేయవచ్చు. ఉరిశిక్ష కేసుల్లో దాని తర్వాత కూడా చాలా దారులు ఉంటాయి. అంటే పోరాటం చాలా సుదీర్ఘంగా ఉంటుంది’ అని ఆయన అన్నారు.

కొత్త నిబంధనల ప్రకారం 12 ఏళ్లు లోపు వయసున్న పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారికి బెయిల్ లభించదు. కానీ మిగతా నిందితులకు ఆ సౌకర్యం కూడా ఉంది. ఇక పై కోర్టుల్లో జడ్జిల కొరత భారీగా ఉండడం వల్ల చాలా కేసులు కోర్టుల్లో పెండింగులో ఉంటాయి. అక్కడకు చేరాక బాధితులు ఎవరైనా నిందితుడికి త్వరగా శిక్ష వేయించడం అసంభవం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)