పాప్ స్టార్ బియాన్సే: శాకాహారులకు జీవితాంతం ఉచిత టికెట్లు ఈమె ఎందుకు ఇస్తోంది?

ఫొటో సోర్స్, Getty Images
తానిచ్చే ప్రదర్శనలను, తన భాగస్వామి జే-జీ ఇచ్చే ప్రదర్శనలను జీవితాంతం ఉచితంగా చూసేందుకు ఫ్రీగా టికెట్లు గెలుచుకునే అవకాశాన్ని ప్రకటించారు అమెరికన్ సింగర్ బియాన్సే.
ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లోని 12.3 కోట్ల మంది అభిమానులతో పంచుకున్నారు.
అయితే, ఇందుకు ఆమె ఒక షరతు కూడా పెట్టారు.
అదేంటంటే.. శాకాహారం మాత్రమే తింటానని, అందులోనూ గుడ్లు, డెయిరీ ఉత్పత్తులు, ఇతర జంతు సంబంధం లేని వీగన్ పదార్థాలను మాత్రమే తింటానని హామీ ఇచ్చి, దానికి కట్టుబడాలన్నది ఆ షరతు!
పర్యావరణంపై వీగనిజమ్ చూపే సానుకూల ప్రభావాలను ప్రచారం చేసే గ్రీన్ ప్రింట్ ప్రాజెక్ట్ ద్వారా బియాన్సే ఈ పోటీ నిర్వహిస్తున్నారు.
తాము తినే ఆహారంలో.. మొక్కలపై ఆధారపడి ఉత్పత్తి అయిన ఆహారం ఎంత ఉందో అభిమానులు తెలపాల్సి ఉంటుంది. అలా వీగన్ ఆహార అలవాట్లను పాటించే వారిలో ఒకరికి జీవితకాలం ఉచితంగా తమ ప్రదర్శనలు చూసేందుకు టికెట్లు లభిస్తాయని బియాన్సే ప్రకటించారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది, 1
ఈ పోటీలో.. కేవలం ఒక్కరికి మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది. జీవితకాలం అంటే 30 ఏళ్లు అని కూడా కాల నిబంధన విధించారు.
బియాన్సే చాలా కాలం నుంచి వీగన్ ఆహార శైలిని ప్రచారం చేస్తున్నారు. మొక్కలపై ఆధారపడిన ఆహారాన్ని ప్రచారం చేసే తమ లక్ష్యం దిశగా బియాన్సే సహకారం అందించారని ‘ది వీగన్’ సొసైటీ తెలిపింది.
తాను తినే ఆహార పదార్థాల ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన బియాన్సే.. మొక్కల నుంచి వచ్చే ఆహారాన్ని తినమని తన అభిమానులను ప్రోత్సహిస్తుంటారు.
ఈ పోటీలో గెలుపొందే వారికి బియాన్సే, ఆమె భాగస్వామిన జే-జీ వివిధ టూర్లలో ఇచ్చే ప్రదర్శనలను ప్రత్యక్ష్యంగా తిలకించేందుకు ఉచితంగా టికెట్ లభిస్తుంది.
గెలుపొందినవారు 30 ఏళ్ల పాటు ఈ ప్రదర్శనలకు మరొకరిని వెంటబెట్టుకుని హాజరు కావొచ్చు. అయితే, ఈ పోటీ కేవలం అమెరికాలో నివశించే వారికి మాత్రమే పరిమితం.
‘‘మన ఆహార అలవాట్లు, పదార్థాల ఎంపిక ద్వారా మనం మన భూమిని కాపాడుకునే అవకాశం ఉంది’’ అని ది గ్రీన్‌ప్రింట్ ప్రాజెక్ట్ చెబుతోంది.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది, 2
మీరు ఎంత మేరకు మొక్కల నుంచి వచ్చిన ఆహారాన్ని తిన్నారనేదానిని వివిధ పర్యావరణ గణాంక పద్ధతుల ఆధారంగా ఈ వెబ్‌సైట్ లెక్క కడుతుంది.
‘‘మొక్కల నుంచి వచ్చే ఆహార పదార్థాలతో కూడిన భోజనాన్ని తొమ్మిది సార్లు తింటే.. ఒక నెలలో గాలిలోని విషవాయువులను 14 చెట్లు పీల్చుకోవడానికి సరిపడినంత పర్యావరణ ప్రభావం చూపినట్లే’’ అని ఆ వెబ్‌సైట్ వివరించింది.
ఈ పోటీలో గెలుపొందినవారికి 30 ఏళ్లపాటు ఉచితంగా టికెట్లను పొందటం అన్నది.. 12 వేల అమెరికన్ డాలర్ల (రూ.8.57 లక్షల)కు సమానమని వెబ్‌సైట్ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- విరాట్ కోహ్లి వీగన్‌గా ఎందుకు మారాడు? ఏంటా డైట్ ప్రత్యేకత?
- రాబిన్ హుడ్ బాపు: 'కృష్ణా నది దగ్గర బొబ్బిలి పులి'
- గ్లోబల్ వార్మింగ్: ఈ 5 పనులూ చేయండి.. భూ తాపాన్ని మీరే తగ్గించండి
- స్ట్రాబెర్రీల్లో సూదులు.. ముక్కలుగా కోసుకుని తినండి - హెచ్చరించిన ప్రభుత్వం
- యువతను శాకాహారం వైపు నడిపిస్తున్న 7 అంశాలు
- నర మానవుల్లేని ‘దెయ్యాల’ టౌన్: ఈ పట్టణంలోకి అడుగుపెట్టొద్దు - అధికారుల హెచ్చరిక
- ‘సప్లిమెంట్స్’ వాడొచ్చా? వాడకూడదా?
- జంతువులతో ఆటాడుకున్న భారతీయ రింగ్ మాస్టర్
- వడా పావ్: ఇది మెక్ డొనాల్డ్స్కే చుక్కలు చూపించిన 'ఇండియన్ బర్గర్'
- గూగుల్ రాక ముందు జీవితం ఎలా ఉండేది?
- అన్నం బదులు దీన్ని అధికంగా తిన్నోళ్లు ‘100 ఏళ్లు బతుకుతున్నారు’
- గ్రౌండ్ రిపోర్ట్: మృతదేహాలను నెలలపాటు తమతోనే ఉంచుకునే గుజరాత్ 'చడోతరూ' ఆచారం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








