విరాట్ కోహ్లి: వీగన్‌గా ఎందుకు మారాడు? ఆ డైట్ ప్రత్యేకత ఏంటి?
ఇటీవల క్రికెటర్ విరాట్ కోహ్లి వీగన్ డైట్‌లోకి మారిపోయాడు. టెన్నిస్ స్టార్లు సెరెనా, వీనస్ విలియమ్స్, ఎఫ్ 1 రేసర్ హామిల్టన్ కూడా చాలా కాలంగా వీగన్ డైట్ అనుసరిస్తున్నారు.
అసలు ఇంతకీ ఏంటీ వీగన్ డైట్?
పూర్తిగా మొక్కల మీద ఆధారపడే ఆహారమే వీగన్ డైట్. అంటే, మాంసాన్ని మాత్రమే కాకుండా ఇందులో జంతువుల నుంచి ఉత్పత్తయ్యే పాలు, పెరుగు, తేనె లాంటి వాటిని కూడా ముట్టుకోరు.
ఇటీవలి కాలంలో క్రీడాకారులు ఎక్కువగా ఈ డైట్ తీసుకుంటున్నారు. క్రీడాకారులకు ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, విటమిన్ డి లాంటి పోషకాలతో పాటు ఫ్యాటీ ఆమ్లాలు చాలా అవసరం.
గాయాలు త్వరగా మానడానికి వీగన్ డైట్ సహకరిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ డైట్ వల్ల పర్యావరణానికి కూడా ఎలాంటి నష్టం జరగదు. కర్బన ఉద్గారాలను తగ్గించడానికీ ఈ తోడ్పడుతుందని చెబుతారు.
వీగన్ డైట్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
ఈ డైట్ వల్ల రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గుతాయి. మధుమేహం, కేన్సర్ బారిన పడే ప్రమాదమూ తగ్గుతుంది.
కానీ, వీగన్ డైట్ వల్ల మైక్రో న్యూట్రియంట్ల లోపం తలెత్తుతుంది. శరీరంలో ప్రొటీన్ల లోపమూ తలెత్తే అవకాశం ఉంది.
సోయాబీన్, గోధుమల లాంటి వాటిని వీగన్ డైట్‌లో భాగం చేసుకుంటే శరీరంలో ప్రొటీన్ల లభ్యత పెరుగుతుంది.
వీగన్ డైట్‌లో సరైన పోషకాల సమతుల్యత ఉండాలి. వైద్యుల సలహాతోనే ఈ డైట్‌ను పాటించాలి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









