పన్నెండేళ్ల లోపు చిన్నారులపై అత్యాచారం చేస్తే మరణశిక్షే!

ఫొటో సోర్స్, Getty Images
12 ఏళ్ల లోపు వయసున్న చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణ దండన విధించే ఆర్డినెన్స్‌ను కేంద్ర కేబినెట్ ఆమోదించింది.
'క్రిమినల్ లా అమెండ్‌మెంట్ ఆర్డినెన్స్-2018'కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఐదు రోజుల స్వీడన్, బ్రిటన్ పర్యటన నుంచి తిరిగొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసరంగా కేంద్ర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశ పెట్టాలని కేంద్రం భావిస్తోంది. అప్పటివరకూ అమల్లో ఉండేలా ఆర్డినెన్స్ జారీ చేస్తోంది.
జమ్మూ కశ్మీర్‌లోని కఠువా, ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్, గుజరాత్‌లోని సూరత్ అత్యాచార ఘటనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
చట్టానికి తాజాగా చేస్తున్న సవరణలు ఏమిటి?
తాజా ఆర్డినెన్స్ ప్రకారం.. 12 ఏళ్ల లోపు వయసున్న పిల్లలపై అత్యాచారం చేసిన దోషులకు కోర్టులు మరణ దండన విధించొచ్చు.
ఇందుకోసం భారతీయ శిక్షాస్మృతి, సాక్ష్యాధారాల చట్టం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్- పొక్సో చట్టాలకు పలు సవరణలు ప్రతిపాదించారు.
'పిలలపై లైంగిక దాడులకు పాల్పడితే మరణ శిక్ష విధించొచ్చు' అనే కొత్త నిబంధన పొక్సో చట్టంలో ప్రవేశపెడతారు.
పొక్సో చట్టం ప్రకారం అత్యాచార దోషులకు కనిష్ఠంగా ఏడేళ్ల జైలు శిక్ష, గరిష్ఠంగా జీవితఖైదు విధించే అవకాశం ఉంది.
2012 నిర్భయ అత్యాచార ఘటన తర్వాత దీనికి కొన్ని సవరణలు చేశారు.
అత్యాచార బాధితురాలు చనిపోయినా, అచేతనంగా మారినా దోషులకు మరణదండన విధించేలా పోక్సో చట్టంలో నిబంధనలు మార్చారు.

ఫొటో సోర్స్, Getty Images
'క్రిమినల్ లా అమెండ్‌మెంట్ ఆర్డినెన్స్ 2018'లోని ముఖ్యాంశాలు
12 ఏళ్లలోపు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన వారికి నేరతీవ్రత మేరకు మరణదండన విధించే అధికారం కోర్టులకు ఉంటుంది.
ఇలాంటి కేసుల్లో దోషులకు కనిష్ఠ జైలు శిక్ష 20 ఏళ్లు. దీన్ని జీవితఖైదుగా కూడా మార్చొచ్చు.
16 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారం చేస్తే ఇప్పటి వరకు ఉన్న కనిష్ఠ జైలు శిక్షను 10 ఏళ్ల నుంచి తాజాగా 20 ఏళ్లకు పెంచారు.
కేసు తీవ్రతను బట్టి నిందితుడు బతికి ఉన్నంతకాలం జైల్లోనే ఉండేలా శిక్ష విధించేలా ఆర్డినెన్స్‌లో నిబంధనలు ఉన్నాయి.
ప్రస్తుత చట్టాల ప్రకారం మహిళలు, యువతులపై అత్యాచారం చేసిన దోషులకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించొచ్చు.
ఈ శిక్షను ఏడేళ్ల నుంచి పదేళ్లకు పెంచాలని ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. కేసు తీవ్రతను బట్టి జీవితఖైదు కూడా విధించొచ్చని సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
వీటితో పాటు అత్యాచార కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు, దర్యాప్తు పూర్తి చేసేందుకు స్పష్టమైన గడువు వంటి ఎన్నో చర్యలు తీసుకునేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ ఆర్డినెన్స్‌కు ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపించారు. రాష్ట్రపతి సంతకం పెట్టగానే ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వస్తుంది.
కశ్మీర్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో బాలికలపై వరుసగా అత్యాచారాలు, లైంగిక దాడుల ఘటనలు చోటు చేసుకున్నాయి.
దీనిపై విపక్షాలు మోదీ ప్రభుత్వాన్ని తప్పుబట్టాయి.
చిన్నారులను చిదిమేస్తుంటే ప్రధాని మోదీ మౌన మునిలా కూర్చున్నారని విపక్ష కాంగ్రెస్ ఆరోపించింది.

ఫొటో సోర్స్, PIB / TWITTER
దీంతో విదేశీ పర్యటన నుంచి రాగానే మోదీ అత్యాచారాల నియంత్రణపై దృష్టి సారించారు. శిక్షలు కఠినంగా ఉండేలా ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు.
ఈ ఆర్డినెన్స్‌ను పలువురు స్వాగతించారు. ఆడబిడ్డలకు న్యాయం చేసేందుకు మోదీ కట్టుబడి ఉన్నారని కేంద్ర మంత్రులు అన్నారు.

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

నిజానికి లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించే చట్టం పోక్సో చట్టాన్ని 2012లో కేంద్ర ప్రభుత్వం రూపొందించింది.
18 సంవత్సరాలలోపు కలిగిన వారందరికీ లైంగిక వేధింపుల నుంచి ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది. ఇది దేశమంతటికీ వర్తిస్తుంది.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.








