నాలుగో బిడ్డకు జన్మనివ్వనున్న అమెరికన్ సెకండ్ లేడీ ఉషా వాన్స్

ఉషా వాన్స్ , జేడీవాన్స్, అమెరికా, జననం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మాడెలైన్ హాల్పెర్ట్

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య ఉష వాన్స్ నాలుగో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు వెల్లడించారు.

జులై నెలాఖరులో తమ బాబును స్వాగతించడానికి ఎదురు చూస్తున్నట్టు ‘ఎక్స్‌’లో పోస్ట్ చేశారామె.

"ఉష, కడుపులోని బిడ్డ క్షేమంగా ఉన్నారు" అని మంగళవారం అమెరికన్ సెకండ్ లేడీ సోషల్ మీడియా అకౌంట్‌లో కనిపించిన పోస్ట్‌లో ఉంది.

40 ఏళ్ల ఉషకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారు ఇవాన్, వివేక్, మిరాబెల్.

ఉష వాన్స్ (చిలుకూరి) కాలిఫోర్నియాలోని శాన్ డియాగో శివార్లలో పుట్టి పెరిగారు.

ఆమె తండ్రి మెకానికల్ ఇంజనీర్, తల్లి మాలిక్యులర్ బయాలజిస్ట్. ఆమె తల్లి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
జేడీ వాన్స్, ఉష వాన్స్

ఫొటో సోర్స్, Getty Images

2010లో యేల్ లా స్కూల్‌లో విద్యార్థినిగా ఉన్నప్పుడు జేడీ వాన్స్‌ను కలుసుకున్నారు ఉష.

అమెరికన్ సెకండ్ లేడీ కావడానికి ముందు, ఉషావాన్స్ న్యాయవాద వృత్తిలో ఉన్నారు.

శాన్ ఫ్రాన్సిస్కోలోని ముంగర్, టోల్స్ & ఓల్సన్ సంస్థలో కార్పొరేట్ లిటిగేటర్‌గా ఉద్యోగం చేశారు.

అలాగే, సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్, జడ్జ్ బ్రెట్ కవానా కోసం కూడా పనిచేశారు.

సెకండ్ లేడీగా ఉండి బిడ్డను కంటున్న మొదటి మహిళ ఉష వాన్స్.

అయితే, అమెరికా ఫస్ట్ లేడీస్(అధ్యక్షుల భార్యలు) కొందరు తమ భర్తలు పదవులలో ఉన్నప్పుడు పిల్లలను కన్నారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు గ్రోవర్ క్లీవ్‌ల్యాండ్ భార్య, ఫస్ట్ లేడీ ఫ్రాన్సిస్ క్లీవ్‌ల్యాండ్, 1893లో వైట్ హౌస్‌లో కుమార్తె ఎస్తేర్‌కు జన్మనిచ్చారు.

అమెరికాలో జననాల రేటును పెంచాలని ట్రంప్ పరిపాలనలో గట్టిగా డిమాండ్ చేసిన సభ్యులలో జేడీ వాన్స్ ఒకరు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)