ఈ నగరంలో అత్యాచారాలు సర్వ సాధారణం.. రేపిస్టుల్ని కొట్టి చంపటం కూడా

దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ నగరంలో అదొక ప్రాంతం. దాని పేరు డీప్‌స్లూట్ టౌన్‌షిప్. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో అదొకటి. మహిళలపై యథేచ్ఛగా అత్యాచారం చేస్తున్నారు. మనుషులను వీధుల్లోనే తగలబెట్టేస్తున్నారు.
మహిళలు, పిల్లలపై అత్యాచారాలు చేసే వారిని స్థానిక రక్షక మూకలు చంపేస్తున్నాయి. సజీవ దహనం చేస్తున్నాయి. అయినా అత్యాచారాలు మాత్రం ఆగట్లేదు.
బీబీసీ కలిసిన ఇద్దరు యువకులూ ఎంతో మంది మహిళలపై అత్యాచారాలు చేశారు. వారు ఈ విషయాన్ని కెమెరా ముందుకు వచ్చి చెబుతున్నప్పుడు వారి ముఖంలో ఎలాంటి అపరాధ భావమూ కనిపించలేదు.
తాము చేస్తోంది తప్పు అని ఎప్పుడూ అనిపించలేదని వారు అన్నారు. ఎప్పుడైనా ఆ అత్యాచార బాధిత మహిళల స్థానంలో ఉండి.. వారు ఎలాంటి బాధ అనుభవించారో ఆలోచించారా? అని అడిగితే.. అలా ఎప్పుడూ ఆలోచించలేదని వారు బదులిచ్చారు.
కెమెరా ముందుకొచ్చి తమ ముఖాలు చూపించేందుకు కూడా వారు వెనుకాడలేదు. అయితే, తమ పేర్లు మాత్రం బహిర్గతం చేయొద్దని వారు కోరారు.
వారు చాలా ఈజీగా తాము చేసిన తప్పుల్న్నింటినీ చెప్పుకొచ్చారు.
‘‘తలుపు తెరుచుకోగానే మేం ఇంటి లోపలికి చొరబడేవాళ్లం. కత్తిని బయటకు తీసేవాళ్లం. నోరు మూసుకోమని వాళ్లను బెదిరించేవాళ్లం. ఇంట్లో ఉన్న మంచం మీదకు వాళ్లను తీసుకెళ్లి రేప్ చేసేవాళ్లం’’ అని వారు చెప్పారు.
వారిద్దరిలో ఒకతను మరొక వ్యక్తివైపు చూస్తూ.. ‘‘నేను వీడి ముందే వీడి గర్ల్ ఫ్రెండ్‌ని రేప్ చేశాను’’ అన్నారు.
వినటానికి ఇదెంతో భయానకంగా ఉంది. కానీ, డీప్‌స్లూట్‌లో ఇవన్నీ సర్వ సాధారణంగా జరిగేవే.

ఫొటో సోర్స్, Getty Images
ప్రతి ముగ్గురిలో ఒకరు రేపిస్ట్
ఈ నగరంలో ప్రతి ముగ్గురిలో ఒక పురుషుడు తాను ఎప్పుడో ఒకప్పుడు అత్యాచారం చేశానని అంగీకరించాడు. నగరం మొత్తం పురుషుల్లో 38 శాతం మంది అత్యాచారాలకు పాల్పడినవాళ్లే.
2016లో జరిగిన ఒక సర్వే ద్వారా ఈ గణాంకాలు బయటికొచ్చాయి. దక్షిణాఫ్రికా రాజధాని జోహెన్నెస్ బర్గ్‌కు చెందిన యూనివర్శిటీ ఆఫ్ విట్వటర్స్‌రండ్ ఈ సర్వే నిర్వహించింది. కొంతమంది పురుషులు ఒకే మహిళను రెండు, మూడు సార్లు రేప్ చేశారు.
మారియా అనే మహిళ కూడా తన ఇంట్లో ఉండగానే అత్యాచారానికి గురయ్యారు. ఆ సమయంలో ఆమె కూతురు అదే ఇంట్లో వేరే గదిలో నిద్రపోతోంది.
‘‘నా కూతుర్ని మాత్రం నిద్ర లేపొద్దని వేడుకున్నాను. తనకు ఎలాంటి హానీ జరగకూడదన్నదే నా తాపత్రయం. వాళ్లు ఏమైనా చేస్తారేమోనని భయపడ్డాను’’ అని మారియా చెప్పారు.
‘‘నేను ఎవరినీ చంపాలనుకోవట్లేదు. నేను చేయాలనుకున్నది చేయనివ్వు. అడ్డురాకు’’ అని ఆ రేపిస్ట్ తనతో అన్నాడని దీనికి తాను బదులిస్తూ.. ‘‘నువ్వు నాతో ఏం చేయాలనుకుంటావో అది చెయ్యి’’ అన్నానని మారియా తెలిపారు. దీంతో అతను మారియాపై అత్యాచారం చేశారు.
ఈ నగరంలో చాలా తక్కువ మంది మహిళలు మాత్రమే తమపై అత్యాచారం చేసే రేపిస్ట్‌లను వ్యతిరేకించి, అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఈ నగరంలో చాలామంది అత్యాచారం తప్పేమీ కాదని భావిస్తుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
రేప్ చేసినా శిక్షల్లేవు
గత మూడేళ్లలో డీప్‌స్లూట్ నగరంలో 500 అత్యాచారాలపై విచారణ జరిగింది. కానీ, ఏ ఒక్క అత్యాచార ఘటనలోనూ బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోలేదు.
అత్యాచారాలే కాదు.. ఇతర ఆరోపణలకు సంబంధించి కూడా ఇక్కడ చట్టం పట్టించుకోలేదు.
స్థానికంగా క్రైం రిపోర్టింగ్ చేసే విలేకరి గోల్డెన్ ఎంటికా మాటల్లో చెప్పాలంటే.. ‘‘రాత్రిళ్లు డీప్‌స్లూట్ రహదారులపై వెళ్లటం అత్యంత ప్రమాదకరం. ఏదైనా అనుకోనిది జరిగితే సహాయం లభించటం చాలా కష్టం. రాత్రుళ్లు 10, 11 గంటల సమయాల్లో కూడా ఇక్కడ రహదారులపై హత్యలు జరగొచ్చు. మరుసటి రోజు దాకా పోలీసులు ఆ మృతదేహాన్ని అక్కడి నుంచి తీయరు.’’
ఈ నగరంలో చట్టం అనేదేమీ లేదని ఎంటికా అభిప్రాయం. అందుకే ఒక్కోసారి పెద్దపెద్ద నేరాలు కూడా జరుగుతుంటాయి.
నేరస్తుల పట్ల పాలకులు ఉదాసీన వైఖరి ప్రదర్శించటం ఇక్కడ ప్రజలు ఆగ్రహిస్తున్నారు.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్న ప్రజలు
ఇలా నేరస్తుల పట్ల ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంతో ప్రజలంతా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. నేరస్తుల్ని చట్టానికి పట్టించడానికి బదులు.. ప్రజలే వారిని కొట్టి చంపుతుంటారు.
ఇలాంటి సంఘటనలు నగరంలో ప్రతివారం జరుగుతుంటాయని ఎంటికా తెలిపారు.
తాను కళ్లారా చూసిన ఒక సంఘటన గురించి ఆయన చెబుతూ.. ‘‘ప్రజలంతా కలిసి ముగ్గురిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.’’
అలాంటి ఘటనలు చాలా జరుగుతుంటాయని, అయితే అలా జరుగుతున్నప్పుడు బాధితుల్ని కాపాడేందుకు వెళ్లటం ప్రమాదకరమని ఎంటికా తెలిపారు. ఎందుకంటే.. ఒకవేళ బాధితులకు సహాయం చేద్దామని వెళితే.. అప్పటికే కోపంగా ఉన్న ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని చెప్పారు.
పోలీసులు సైతం ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోరు.
ఇక్కడ నేరస్తుల్ని ఊచకోత కోయటం కూడా సహజంగా జరిగే వ్యవహారమే. సాధారణంగా రేపిస్టుల్ని ఇలా చేస్తుంటారు.
డీప్‌స్లూట్‌కు చెందిన ఒక మహిళ మాట్లాడుతూ.. ‘‘వాళ్లను చంపటమే సరి. ఎందుకంటే మా భర్తల ముందే మమ్మల్ని రేప్ చేస్తుంటారు. పైగా.. అలా అత్యాచారం చేస్తూ భర్తతో ‘చూడు నీ పెళ్లాన్ని ఎలా రేప్ చేస్తున్నానో చూడు అంటుంటారు.’’
ఊచకోత కోస్తున్నప్పటికీ నేరస్తుల సంఖ్య మాత్రం తగ్గట్లేదు ఈ నగరంలో.
ఈ నగరంలో పేదరికం, నిరుద్యోగం కూడా ఉన్నాయి. అయితే, మహిళలపై అత్యాచారాల సంస్కృతి కారణంగానే ఈ నగరానికి ఎక్కువ నష్టం జరుగుతోంది.
ఇవి కూడా చదవండి
- ఈ లక్షణాలు కనిపిస్తే, అది మధుమేహం కావొచ్చు... జాగ్రత్త!
- పీరియడ్స్ సమయంలో సెక్స్ తప్పా? ఒప్పా?
- మాట వినకపోతే గాడిదలతో రేప్ చేయించేవారు!
- డీప్ ఫేక్: పోర్న్ స్టార్ల శరీరాలకు సెలెబ్రిటీల ముఖాలు
- ‘ఫస్ట్‌నైట్’ పరీక్ష: ‘‘తెల్లటి దుప్పటిపై రక్తపు మరక కనిపించాలన్నారు. మేం ఎదిరించాం’’
- #HerChoice: ‘మా ఆయనకు తీరిక లేదు, వేరే మగాళ్లతో చాట్ చేస్తాను!'
- BBC Special: బోనాల్లో 'రంగం' చెప్పే మాతంగి స్వర్ణలత ఎవరు?
- అత్యాచారాల గురించి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏం చెబుతారు? ఎలా చెబుతారు?
- భార్యపై అత్యాచారం చేయించిన భర్త.. స్వలింగ సంపర్కురాలైనందుకు కక్ష
- రేప్ వార్తల రిపోర్టింగ్‌లో మీడియా 'ఆనందం' దాగి ఉందా?
- ‘సెక్స్ గురువు' ఓషో రజనీష్ 'రహస్యాల'పై నోరు విప్పిన బాడీగార్డ్
- ‘అది భార్యాభర్తల పడక సీన్... అలా నటించడానికి నాకేమీ సిగ్గనిపించలేదు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









