అభిప్రాయం: ‘అది భార్యాభర్తల పడక సీన్. అలా నటించడానికి నాకేమీ సిగ్గనిపించలేదు’

ఫొటో సోర్స్, Rajshri Deshpande
- రచయిత, దివ్య ఆర్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఒక మహిళ తన జాకెట్ బటన్లు విప్పగానే ఆమె వక్షోజాలు కనిపిస్తాయి. ఆ తర్వాత ఆమె ఓ పురుషునితో సెక్స్‌లో పాల్గొని, ఆ తర్వాత అలాగే అతని పక్కన పడుకుంటుంది.
ఈ 30-40 సెకెండ్ల వీడియో క్లిప్ ఇప్పుడు వాట్సప్‌లో వైరల్ అవుతోంది. దీనిలో కనిపించే నటిని పోర్న్ స్టార్ అని అంటున్నారు.
యూట్యూబ్‌లో కూడా ఈ వీడియోను అప్‌లోడ్ చేశారు. దానిని లక్షలాది మంది వీక్షిస్తున్నారు.
ఈ వీడియో క్లిప్ అలా ఒకరి ద్వారా ఒకరికి సర్క్యులేట్ అవుతూ చివరకు ఆ నటికి కూడా చేరింది.

ఫొటో సోర్స్, Rajshri Deshpande
అది పోర్న్ వీడియో కాదు, నెట్‌ఫ్లిక్స్‌లో ఇటీవల విడుదలైన 'సేక్రెడ్ గేమ్స్' సిరీస్‌లోని ఓ సీన్. కథ ఒక ముఖ్యమైన మలుపు తీసుకునేటప్పుడు ఆ సీన్ వస్తుంది.
కథలో ఆ సంఘటనకు ముందు భర్తగా నటించిన నవాజుద్దీన్ సిద్దిఖీ, భార్యగా నటించిన రాజ్‌శ్రీ దేశ్‌పాండే మధ్య సంబంధాలు అంత బాగా ఉండవు. నవాజుద్దీన్ పాత్ర పడకపై అత్యంత హింసాత్మకంగా వ్యవహరిస్తుంది.
అయితే పరిస్థితి మారి, ఇద్దరి మధ్యా ప్రేమ చిగురిస్తుంది. ఆ సీన్‌లో వారిద్దరి మధ్య ప్రేమ ప్రతిఫలించాలి. అప్పుడు వారి మధ్య అన్యోన్యతలో ఒక ఉద్రిక్తత, ఒక ఆనందం కనిపించాలి.
ఆ సంఘటన నుంచి కథను నుంచి తొలగించి చూస్తే మాత్రం అక్కడ కనిపించేది కేవలం ఆమె వక్షోజాలు, సెక్స్.
రాజ్‌శ్రీకి ఆ వాట్సప్ క్లిప్ వచ్చినపుడు, ఆమె చాలా ఆందోళన చెందారు.
''నాకేమీ సిగ్గనిపించలేదు. నేనెందుకు సిగ్గుపడాలి? కానీ చాలా బాధ కలిగింది.'' అని ఆమె అన్నారు.
తన పాత్రపై, ఆ సీనులో ఆ పాత్ర ప్రాధాన్యతపై ఆమెకు పూర్తి విశ్వాసం ఉంది.
తానేమీ తప్పుచేయలేదని, ఈ సీన్‌లో మహిళను ఒక వస్తువుగా వాడుకోలేదని ఆమెకు నమ్మకముంది.
ఆ సీన్‌లో మహిళ శరీరంలోని వివిధ భాగాలనేమీ కెమెరా శోధించలేదు. అక్కడ ఒక పాటను పెట్టి, అందులో ద్వందార్థాల పదాలను వాడలేదు. ఒక మహిళను కించపరిచే విధంగా చూపించలేదు.
ఈ సీనులో కేవలం భార్యాభర్తల మధ్య ప్రేమను చూపెట్టారంతే.

ఫొటో సోర్స్, Rajshri Deshpande
''శరీర భాగాలను ప్రదర్శించేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని నాకు తెలుసు. నాలో ఏ దురుద్దేశమూ లేదు. నేను ఏ తప్పూ చేయలేదు'' అన్నారు రాజ్‌శ్రీ.
అయినా కూడా రాజ్‌శ్రీ బాధపడుతున్నారు. ఆ వీడియో క్లిప్‌ను పోర్న్ రూపంలో చూస్తున్నందుకు కాదు, అందుకు ఆమె కొంతవరకు సిద్ధపడ్డారు, కానీ దానిని అందరూ షేర్ చేసుకుంటున్నందుకు.
ఈ రోజుల్లో చాలా దృశ్యాలు వైరల్‌గా మారుతున్నాయి. ఒక ఆడపిల్ల కన్ను కొట్టడం కూడా వైరల్‌గా మారుతోంది.
కానీ ఈ వీడియో భిన్నమైనది.
''ఇలాంటిది మీ వద్దకు వచ్చినపుడు మీరు ఒక్క క్షణం ఆలోచించాలి. టెక్నాలజీ అనేది రెండంచుల కత్తిలాంటిది. దాంతో ఎవరినైనా చంపొచ్చు లేదా ప్రాణాలు రక్షించొచ్చు'' అన్నారామె.
గత కొంత కాలంగా సినిమాలు, టీవీలలో మహిళల నగ్నశరీరాలను చూపించడం పెరిగిపోయింది.
కొన్నిసార్లు కథాపరంగా వాటిని చూపించడం అవసరం, కొన్నిసార్లు అనవసరం. కానీ కథాపరంగా అవసరముందా, లేదా అనేదానితో సంబంధం లేకుండా వాటిని చూడడం మాత్రం బాగా పెరిగిపోయింది.
అన్నిసార్లూ.. పోర్న్‌గా.. చిన్నచిన్న క్లిప్పులుగా.. కథతో ఎలాంటి సంబంధం లేకుండా.

ఫొటో సోర్స్, Rajshree Deshpande/Facebook
అయితే బాధాకరం ఏమిటంటే, వాటిని చూసే వాళ్లను మాత్రం ఎవరూ ఏమీ అడగరు.
కానీ ఈ వీడియో క్లిప్పులు చూసేవాళ్లు మాత్రం ఆ నటిపై పోర్న్ స్టార్ అనే ముద్ర వేస్తారు.
కానీ రాజ్‌శ్రీ దేశ్‌పాండే అలా ఊరుకునే నటి కాదు. తాను నటించిన 'యాంగ్రీ ఇండియన్ గాడెస్', 'ఎస్ దుర్గ' చిత్రాలలోని పాత్రల తరహాలో ఆమె నిజజీవితంలో కూడా తన మనసులో మాటను ఏ మాత్రం దాచుకోరు.
''జరుగుతున్న సంఘటనలపై మనం నోరు విప్పాలి. అప్పుడే పరిస్థితులు మారతాయన్న నమ్మకం ఏర్పడుతుంది. ఒక ఐదుగురి ఆలోచనలను మార్చగలిగినా, అది చాలా పెద్ద విజయం'' అంటారామె.
ఆమె నోరు విప్పింది. నేను రాస్తున్నాను. మీరు చదువుతున్నారు.
ఏమో, బహుశా ఈ వీడియోలను ఎడిట్ చేసి, వాటిని సర్క్యులేట్ చేస్తున్నవారు కూడా కొద్ది సేపు ఆగి ఆలోచిస్తున్నారేమో.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ అణుకేంద్రం గుట్టు ‘రా’ ఎలా కనిపెట్టింది?
- వయాగ్రా.. ఎవరు తీసుకోవచ్చు?
- ‘ఫస్ట్‌నైట్’ పరీక్ష: ‘‘తెల్లటి దుప్పటిపై రక్తపు మరక కనిపించాలన్నారు. మేం ఎదిరించాం’’
- ఈ లక్షణాలు కనిపిస్తే, అది మధుమేహం కావొచ్చు... జాగ్రత్త!
- స్త్రీ గౌరవం రెండు కాళ్ల మధ్య లేదు: రేణూ దేశాయ్
- అమెరికాలో సెక్స్ రాకెట్.. టాలీవుడ్‌పై నీలి నీడలు
- నా బాధనెవరూ పట్టించుకోవట్లేదు.. నాకున్న మార్గం ఇదే: శ్రీరెడ్డి
- 'భవిష్యత్తు ఉండాలంటే నిర్మాతలతో, దర్శకులతో పడుకోక తప్పదన్నారు'
- డీప్ ఫేక్: పోర్న్ స్టార్ల శరీరాలకు సెలెబ్రిటీల ముఖాలు
- అత్యాచారాల గురించి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏం చెబుతారు? ఎలా చెబుతారు?
- మాట వినకపోతే గాడిదలతో రేప్ చేయించేవారు!
- బాలీవుడ్ సినిమాల్లో నడివయస్సు ప్రేమకు చోటేది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









