డీప్ ఫేక్: ఫేక్ ఫోటోలు, ఫేక్ న్యూస్ కంటే ప్రమాదకరమైనది

ఫేక్ ఫోటోలు, ఫేక్ న్యూస్ కంటే ప్రమాదకరమైనవి డీప్ ఫేక్ వీడియోలు. వీటి సాయంతో వీడియోలో మనుషుల్నే మార్చేయొచ్చు. లేని మనుషుల్ని ఉన్నట్లు, చేయని పనుల్ని చేసినట్లు చూపించొచ్చు.
ఎక్కువగా సెలెబ్రిటీలే ఈ డీప్ ఫేక్‌ల బారిన పడుతున్నారు. చాలామంది పోర్న్ స్టార్ల శరీరాలకు సెలెబ్రిటీల మొహాలను జోడించి డీప్ ఫేక్ పోర్న్ వీడియోలను రూపొందిస్తున్నారు. రివెంజ్ పోర్న్ కోసం కూడా వీటిని ఉపయోగిస్తున్నారు.
డీప్ ఫేక్ వీడియోలు ఎలా ఉంటాయో, ఎలా విస్తరిస్తాయో తెలియాలంటే ఈ వీడియో చూడండి.
కొత్త రకమైన కృత్రిమ మేధస్సుకు డీప్ ఫేక్ ఒక ఉదాహరణ. ఏదైనా భావజాల వ్యాప్తికి డీప్ ఫేక్‌లను రూపొందిస్తే పరిణామాలు తీవ్రంగా ఉండొచ్చు.
ఉచిత సాఫ్ట్‌వేర్లతో డీప్ ఫేక్‌లను సులువుగా తయారు చేయొచ్చు. అందుకే కొన్ని దేశాలు ఈ విషయంలో కొత్త చట్టాలను రూపొందిస్తున్నాయి. ప్రస్తుతానికి చాలా దేశాలు డీప్ ఫేక్ నేరాలను హింస, బ్లాక్‌మెయిల్, కాపీరైట్ చట్టాల పరిధిలోకి తెస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- హిమాలయన్ వయాగ్రా: కిలో రూ.70 లక్షలకు కొంటున్నారు
- చేపలు తినొచ్చా.. తినకూడదా? ఈ రసాయనాల గొడవేంటి?
- ‘అది భార్యాభర్తల పడక సీన్... అలా నటించడానికి నాకేమీ సిగ్గనిపించలేదు’
- మల్టీప్లెక్స్: సినిమా టికెట్ రూ.150, పాప్‌కార్న్ రూ.270 ఎందుకిలా?
- నిదా ఖాన్‌ను ఇస్లాం నుంచి ఎందుకు బహిష్కరించారు?
- వయాగ్రా.. ఎవరు తీసుకోవచ్చు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





