హిమాలయన్ వయాగ్రా: కిలో రూ.70 లక్షలకు కొంటున్నారు

హిమాలయాల్లో ఓ అరుదైన ఔషధం దొరుకుతుంది. అదే ‘హిమాలయన్ వయాగ్రా’. ఇది కేవలం నపుంసకత్వానికి మాత్రమే మందు కాదు.. కేన్సర్, ఆస్తమా చికిత్సకు కూడా ఉపయోగపడుతుందని నాటు వైద్యులు చెబుతున్నారు.
ఈ హిమాలయన్ వయాగ్రాను ‘యర్సగుంబా’ అంటారు. భారత్, నేపాల్, భూటాన్, టిబెట్‌లోని హిమాలయ ప్రాంతాల్లో ఇది దొరుకుతుంది.
గొంగళి పురుగుకు నేలలో ఉండే ఒకరకమైన ఫంగస్ సోకి, అది మరణించాక యర్సగుంబాగా మారుతుంది. ఇది 3 వేల నుంచి 5 వేల మీటర్ల ఎత్తులో పెరుగుతుంది.
రూ.70 లక్షలా..!
అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ కిలో రూ.70 లక్షలు. యర్సగుంబాను అమెరికా, ఇంగ్లండ్, చైనా, సింగపూర్, జపాన్, కొరియా, మయన్మార్, థాయ్‌లాండ్ లాంటి దేశాలకు ఎగుమతి చేస్తారు.
అక్కడ ఒక గ్రాము యర్సగుంబా విలువ దాదాపు రూ.7 వేలు ఉంటుంది.
మే, జూన్ నెలల్లో.. ఈ ఔషధాన్ని సేకరించడానికి వేలాది మంది ప్రజలు పర్వతాలపైకి వెళతారు. ఆ సమయంలో గ్రామాలన్నీ ఖాళీగా కనిపిస్తాయి.
భూతాపం, డిమాండ్ పెరగడం.. లాంటి కారణాలతో వీటి లభ్యత గణనీయంగా పడిపోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
‘‘గతంలో యర్సగుంబాలు విరివిగా లభించేవి. కొన్నిసార్లు రోజుకు వంద కూడా దొరికేవి. ఇప్పుడు రోజుకు 2 నుంచి 20 మధ్య మాత్రమే దొరుకుతున్నాయి కొన్నిసార్లు ఒక్కటీ దొరకదు..’’ అని సీతా గురుంగ్ అనే మహిళ చెబుతున్నారు.
వీటిని సేకరించడానికి వీరు చాలా ఎత్తుకు వెళతారు. అంత ఎత్తులో పని చేయడం చాలా ప్రమాదకరం. ఒక్కోసారి మంచు చరియలు విరిగిపడుతుంటాయి.. ఆ మంచు ప్రవాహం చాలా భయంకరంగా ఉంటుందని వీరు చెబుతున్నారు.
ఒక్కో యర్సగుంబాను రూ.250-300కు అమ్ముతారు. వీరి వార్షిక ఆదాయంలో 56% వీటి ద్వారానే వస్తోంది.
బంగారం కన్నా విలువైన ఈ హిమాలయన్ వయాగ్రా గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే.. పైన ఉన్న వీడియోను క్లిక్ చేయండి..
ఇవి కూడా చదవండి
- కత్తి మహేశ్ - పరిపూర్ణానంద బహిష్కరణలు దేనికి సంకేతం: ఎడిటర్స్ కామెంట్
- బోడిగుండ్ల పల్లి : ఈ ఊళ్లో ఇప్పుడు నలుగురే మిగిలారు
- మీ పిల్లలను ఏ భాషలో చదివిస్తారు? మాతృభాషలోనా.. లేక ఇంగ్లిష్‌లోనా
- BBC Special: బోనాల్లో 'రంగం' చెప్పే మాతంగి స్వర్ణలత ఎవరు?
- ‘ముంబయి టైటానిక్’: భారత నౌకా చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదం ఎలా జరిగింది?
- మోదీ అయినా, మన్మోహన్ అయినా ఈ 120 మందికి మాత్రం అన్నీ ‘అచ్ఛే దిన్’లే
- మల్టీప్లెక్స్: టికెట్ రూ.150, పాప్‌కార్న్ రూ.270 ఎందుకిలా?
- బీదర్‌లో హైదరాబాదీ హత్య: ‘అనుమానం వస్తే ఇంత దారుణంగా కొట్టి చంపేస్తారా?’ BBC Special రిపోర్ట్
- హిమాలయన్ వయాగ్రా: కిలో రూ.70 లక్షలకు కొంటున్నారు
- ‘అదో అద్భుతం..నీళ్లు తాగి ప్రాణాలు నిలుపుకున్నాం’: గుహనుంచి బయటపడిన తర్వాత తొలిసారి మీడియా ముందుకు థాయ్‌లాండ్ బాలలు
- క్యాన్సర్‌తో చనిపోయే ముందు స్వీయ సంస్మరణ రాసిన బాలుడు.. ప్రపంచాన్ని కదిలించిన మాటలు
- అవిశ్వాసం: బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీల రాజకీయ వ్యూహాలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









