‘ఇది ప్రపంచంలోనే అత్యంత రొమాంటిక్ ప్రదేశం’

టన్నెల్ ఆఫ్ లవ్, ఉక్రెయిన్

ఫొటో సోర్స్, ANDREW KRAVCHENKO

టన్నెల్ ఆఫ్ లవ్ గురించి ఒకప్పుడు ఉక్రెయిన్‌లో తప్ప ఎవరికీ పెద్దగా తెలీదు.

కానీ సోషల్ మీడియా కారణంగా ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.

టన్నెల్ ఆఫ్ లవ్, ఉక్రెయిన్

ఫొటో సోర్స్, ANDREW KRAVCHENKO

నిజానికి ఈ టన్నెల్ ఆఫ్ లవ్ సరుకులు చేరవేయడానికి ఉపయోగించే రైల్వే ట్రాక్.

ఒక గూడ్స్ రైలు రోజూ టన్నెల్ అవతలి వైపున ఉన్న ప్లైవుడ్ ఫ్యాక్టరీ నుంచి సరుకును రవాణా చేస్తుంది. రైలు కారణంగానే అది ప్రయాణించే దారి మొత్తం ఒక ఆకుపచ్చని సొరంగంలా కనిపిస్తుంది.

టన్నెల్ ఆఫ్ లవ్, ఉక్రెయిన్

ఫొటో సోర్స్, ANDREW KRAVCHENKO

ఇంతకూ ఈ టన్నెల్ ఆఫ్ లవ్ ప్రత్యేకతలు, విశేషాలు ఏంటి?

ఈ రైల్వే లైన్ ప్రపంచంలోనే అత్యంత రొమాంటిక్ ప్రదేశంగా ఇంటర్నెట్‌లో ఎలా వైరల్ అయ్యింది?

2009 వరకు దీని గురించి కేవలం స్థానికులకు మాత్రమే తెలుసు.

అయితే స్థానిక ఫొటోగ్రాఫర్ ఒకరు కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులను ఫొటోలు తీస్తుండగా, హఠాత్తుగా ఆ టన్నెల్ అతని కంటపడింది.

దాంతో అతను ఆ టన్నెల్‌లో ఫొటో షూట్ చేసాడు. అవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ టన్నెల్ ఆఫ్ లవ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది.

టన్నెల్ ఆఫ్ లవ్, ఉక్రెయిన్

ఫొటో సోర్స్, ANDREW KRAVCHENKO

ప్రేమికులు దీనిని ప్రపంచంలోనే అత్యంత రొమాంటిక్ ప్రదేశమని అంటారు.

ఎవరైనా ప్రేమికులు ఇక్కడ ఉండే చెట్లకు రిబ్బన్ కడితే, వాళ్ల కోరికలు నెరవేరుతాయని భావిస్తారు.

ఇప్పుడు సుదూరమైన చైనా, జపాన్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి సినిమాలు, కమర్షియల్స్‌ను షూట్ చేసుకుని వెళుతున్నారు.

టన్నెల్ ఆఫ్ లవ్, ఉక్రెయిన్

ఫొటో సోర్స్, ANDREW KRAVCHENKO

ఈ టన్నెల్ వెనుక ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాంటి కథ కూడా ఉంది.

అమెరికా, యూఎస్‌ఎస్‌ఆర్‌ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో ఇక్కడికి దగ్గర్లో మిలిటరీ బేస్ ఉండేదని అంటారు.

టన్నెల్ ఆఫ్ లవ్, ఉక్రెయిన్

ఫొటో సోర్స్, ANDREW KRAVCHENKO

మిలిటరీ కార్యకలాపాలు బైటపడతాయేమోననే భయంతోనే రైల్వే ట్రాక్ పక్కన చెట్లను నాటి, వాటిని ఆర్చి రూపంలో వంచారని అంటుంటారు.

ఇప్పడు కూడా టన్నెల్ మధ్య భాగంలో ట్రాక్ రెండుగా చీలిపోతుంది. ఒక దారి ప్లైవుడ్ ఫ్యాక్టరీకి వెళుతుంది. కానీ రెండోది ఎక్కడ ముగుస్తుందో ఎవరికీ తెలీదు.

టన్నెల్ ఆఫ్ లవ్, ఉక్రెయిన్

ఫొటో సోర్స్, ANDREW KRAVCHENKO

చరిత్ర ఏదైనప్పటికీ, ఇవాళ టన్నెల్ ఆఫ్ లవ్ ప్రేమికుల స్వర్గధామం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)