ఆడియన్స్ కళ్లలో ఆనందం కోసం.. ఒత్తిడిలోకి యూట్యూబ్ స్టార్స్
ఈ బాలిక పేరు జెస్సీ. వయసు 11 ఏళ్లు. మెక్సికోకు చెందిన జెస్సీ యూట్యూబ్‌లో చాలా పాపులర్.
ఈమె యూట్యూబ్ చానల్‌కు ఇప్పటివరకూ 13.5 కోట్ల వ్యూస్ వచ్చాయి.
వీడియోలు చేయడానికి, కెమెరా ముందు మాట్లాడటానికి ఆమెకు ఎలాంటి స్క్రిప్టూ అవసరం లేదు. కెమెరా ముందుకు రాగానే గలగలా సంతోషంగా మాట్లాడేస్తుంది. ఆ లక్షణమే ఆమెకు అంతటి ఆదరణను తీసుకొచ్చింది.
తన సోదరుడు పెపెతో కలసి జెస్సీ వీడియోలను రూపొందిస్తూ ఉంటుంది. డిస్నీ కోసం చేసిన ఓ వీడియోకు ఏకంగా 2.2 కోట్ల వ్యూస్ వచ్చాయి.
తన వీడియోలను చూసి ప్రజలంతా సంతోషించాలని, తనకు బాగా పేరు రావాలనేది జెస్సీ కోరిక. అయితే, కొన్ని వీడియోలకు తను ఆశించిన స్థాయిలో వ్యూస్ రాకపోతే ఆమె ఒక్కోసారి నిరాశకు గురయ్యేది.

ఉన్నట్లుండి జెస్సీ యూట్యూబ్‌లో వీడియోలను పోస్ట్ చేయడం ఆపేసింది. కానీ, కొద్ది రోజుల తర్వాత మళ్లీ ఓ వీడియో పోస్ట్ చేసింది. అదేంటంటే...
"హలో, నా పేరు జెస్సికా. మీ అందరికీ నేను జెస్సీగా తెలుసు. నా జీవితం ఎలా మారిపోయిందో ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నా" అంటూ ప్రారంభమైన ఆ వీడియోలో జెస్సీ తన జీవితంలో జరిగిన ఓ విషాద సంఘటనను వివరించింది.

జెస్సీ తల్లి పేరు అలైసియా. జెస్సీ, ఆమె సోదరుడు పెపెల జీవితంలో అమ్మ ఎంతో ముఖ్యమైన వ్యక్తి.
"ఓరోజు అమ్మకు ఆరోగ్యం బాగోలేదు. ఆమె చాలా బాధపడింది. ఆమెకు కేన్సర్ చివరి దశలో ఉందని తేలింది."
కొద్ది రోజుల్లోనే ఆమె చనిపోయారు.
తన తల్లిని ఎప్పటికీ గుర్తుంచుకోవాలని జెస్సీ భావించింది.
అమ్మవాళ్ల కవల సోదరితో ఓ వీడియోను రూపొందించింది. ఈ వీడియోకు ఇప్పటికే 60 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇంకా వస్తున్నాయి.
"కొంతకాలంగా జెస్సీ యూట్యూబ్‌కు దూరంగా ఉండడం వల్ల కొద్దిగా ఆదరణ తగ్గింది. కానీ అమ్మను మర్చిపోవడానికి ఇది సాయం చేస్తోందేమో అనిపిస్తోంది" అని సోదరుడు అంటున్నారు.
ఇలాంటి మరింత మంది స్టార్ల కథనాల కోసం పై వీడియో చూడండి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









