టర్కీలోని ఈ పట్టణం మరికొన్ని రోజుల్లో అదృశ్యమైపోతుంది
టర్కీలోని ఈ పురాతన పట్టణం మరికొన్నిరోజుల్లో అదృశ్యం కానుంది. జలవిద్యుత్ ప్రాజెక్టు కోసం ఇక్కడ నిర్మించే ఓ జలాశయం కారణంగా 90 శాతానికి పైగా హసాన్‌కీఫ్ పట్టణం కనుమరుగు కానుంది.
ఆగ్నేయ టర్కీ ప్రాంతంలో వ్యవసాయ విద్యుత్ సరఫరాకు ఈ ప్రాజెక్టు నిర్మాణం తప్పనిసరని ప్రభుత్వం చెబుతోంది.
ఈ నిర్మాణం కారణంగా 600 ఏళ్ల నాటి అల్ రిజ్క్ మసీదు మినార్లు, 12 వేల ఏళ్ల నాటి నియోలిథిక్ గుహల వంటి సాంస్కృతిక, వారసత్వ కట్టడాలు కనుమరుగవుతాయని విమర్శలున్నాయి.
హసాన్‌కీఫ్‌ను పరిరక్షించాలంటూ కొందరు ఉద్యమాలు చేస్తున్నారు. వీరు చేస్తున్న ఉద్యమం కేవలం చరిత్రను కాపాడేందుకే కాదు, పర్యావరణ పరిరక్షణకు కూడా. ఎందుకంటే ఈ ప్రాజెక్టు వల్ల నీరు, జంతువులు, వృక్షాలు... ఇలా అన్నింటికీ సమస్యలు తప్పవంటున్నారు.

ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ నివసించే జంతువులతోపాటు, వేలాది వృక్షాలు నీటిలో మునిగిపోనున్నాయి.
ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం తగ్గించి ఈ పట్టణాన్ని రక్షిస్తారనుకుంటున్నామని కొందరు ఆశతో ఉన్నారు.

నిజానికి టైగ్రిస్ నదిపై 1950లోనే టర్కీ ఇలిసు డ్యాం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించింది. కానీ, ఎన్నో వివాదాల కారణంగా 2006 వరకూ ఇది ముందుకు కదలలేదు.
ఈ ప్రాజెక్టు నిర్వాసితులకోసం ఓ కొత్త పట్టణాన్ని కూడా అధికారులు నిర్మించారు. ఈ నిర్వాసితుల్లో ఎక్కువ మంది కుర్దులే.
ఈ నిర్వాసితుల కోసం నిర్మించిన కొత్త పట్టణంలోని పరిస్థితులకు, హసాన్‌కీఫ్‌లో పరిస్థితులకు చాలా తేడాలున్నాయని వారంటున్నారు. పర్యటకం, చరిత్ర కారణంగా ఎంతో మంది అక్కడకు వచ్చేవారు, కానీ ఇక్కడ అలాంటిదేమీ కనిపించడంలేదని వారు అభిప్రాయపడుతున్నారు.

"అక్కడ మేం చాలా దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్నాం. కానీ ఇక్కడ ఆధునిక ఇళ్లు నిర్మించారు. ఇక్కడకు త్వరగా రావాలనుకుంటున్నాం" అని హసాన్‌కీఫ్ కల్చర్ అసోసియేషన్ అధ్యక్షుడు అహ్మెట్ అక్డెనిజ్ అంటున్నారు.
మరికొద్దిరోజుల్లోనే హసాన్‌కీఫ్ నీటిలో మునిగిపోనుంది.
ఇవి కూడా చదవండి.
- బడ్జెట్ 2019: ఆదాయపు పన్ను పరిమితి పెరగలేదు...
- పక్షులను కాపాడే అమ్మాయి ప్రాణం మాంజాకు బలి
- 'ఫిమేల్ వయాగ్రా'ను అనుమతించిన తొలి అరబ్ దేశం ఈజిప్టు
- చంద్రగ్రహణం పేరులో తోడేలు ఎందుకు చేరింది
- వర్జినిటీ కోల్పోవడానికి సరైన వయసంటూ ఒకటి ఉంటుందా
- టర్కీ: ఇస్లాంను తిరస్కరిస్తున్న యువత
- 'రోజూ ఒక గుడ్డు తినండి.. ఇక డాక్టర్‌కు దూరంగా ఉండండి!'
- డస్టర్ క్లాత్ పసుపు రంగులోనే ఎందుకు ఉంటుంది?
- మహిళా రిపోర్టర్‌కు లైవ్‌లో ముద్దుపెట్టిన ఆటగాడు.. మహిళా రిపోర్టర్ల ఆగ్రహం
- "అమ్మాయిలు ఐస్‌క్రీమ్‌లను నాకుతూ తినొద్దు"
- కొత్త రాజధానిలో జనాలు కరవు
- గూగుల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్: భావి నగరాలకు నమూనా అవుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)










