పది నిమిషాల్లో ఆనందాన్ని పెంచుకోవడం ఎలా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డేవిడ్ రాబ్సన్
- హోదా, బీబీసీ న్యూస్
మనకు మానసిక సమస్యలేమీ లేకున్నా సరే.. రోజువారీగా ఎదురయ్యే కొన్ని ఒత్తిళ్ల వల్ల మనలో రోజంతా ఉన్న ఆనందం.. క్షణాల్లో ఆవిరైపోతుంది. అప్పటిదాకా చేసిన మంచి పనులు, ఆఫీసులో బాస్ నుంచి అందుకున్న ప్రశంసలు.. అన్నీ మరిచిపోయి చిరాకు మొదలవుతుంది.
అయితే, అలాంటి ఒత్తిళ్ల నుంచి బయట పడేందుకు శాస్త్రీయంగా అనేక మార్గాలు ఉన్నాయి. మానసిక ప్రశాంతతను ఎలా మెరుగుపరచుకోవచ్చో... 20 ఏళ్ల నాటి 'పాజిటివ్ సైకాలజీ' మనకు ఎన్నో పద్ధతులను సూచించింది.
కానీ, వాటిని ఆచరణలో పెట్టేందుకు రోజువారీ జీవితంలో సమయం దొరికేదెలా? అన్నదే అసలు సమస్య. దీనికి, ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ లాంకషైర్‌కి చెందిన అధ్యాపకురాలు శాండీ మాన్ ఓ సులువైన పరిష్కారం చూపిస్తున్నారు.
మానసిక వైద్యురాలిగా అనుభవమున్న ఆమె.. "టెన్ మినట్స్ టు హ్యాప్పీనెస్" పేరుతో ఒక పుస్తకం రాశారు. ఈ పుస్తంలోని సూచనలను రోజూ ఓ పది నిమిషాల పాటు చదివితే చాలు.. మీ జీవితం ఆనందంగా సాగిపోతుందని ఆమె అంటున్నారు.
రోజూవారీగా తమకు ఎదురయ్యే ఆరు సానుకూల అంశాల మీద దృష్టి పెడితే ఒత్తిడి నుంచి సులువుగా బయటపడొచ్చని సూచిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ ఆరు అంశాలు ఇవే:
1) సంతృప్తి: ఆ రోజు మీకు సంతృప్తినిచ్చిన విషయాలేంటి? మీరు బాగా ఆస్వాధించిన విషయం ఏంటి?
2) ప్రశంస: ఆ రోజు మీకు వేటి వల్ల ప్రశంసలు లేదా సానుకూల సూచనలు వచ్చాయి?
3) అదృష్టం: ఆ రోజు మీకు అదృష్టంగా లేదా యోగ్యంగా అనిపించిన సమయం ఏంటి?
4) విజయాలు: 'నేను బాగా చేశాను' అనిపించే పని ఏంటి? చిన్నదైనా సరే.
5) కృతజ్ఞత: ఆ రోజు కృతజ్ఞతా భావాన్ని కలిగించిన అంశమేంటి?
6) సేవా తత్వం: ఆ రోజు మీ సేవా తత్వాన్ని ఎలా ప్రదర్శించారు?
మాంచెస్టర్‌లోని తన క్లినిక్‌లో అనేక మందిపై ఈ అంశాలను పరీక్షించగా మంచి ఫలితాలు కనిపించాయని డాక్టర్. మాన్ చెప్పారు.
ప్రతికూల అంశాల గురించి ఆలోచిస్తూ బుర్రను బద్ధలు కొట్టుకోకుండా.. సానుకూల అంశాలపై దృష్టి పెడుతూ, తమను తాము ప్రశంసించుకుంటే.. ప్రశాంతత, సంతోషం ఎప్పుడూ మీ వెంటే ఉంటాయని ఆమె అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రతికూల ఆలోచనలు మొదలవ్వగానే.. ఈ పుస్తకంలోని విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకోండి. దాంతో క్రమంగా మీలో ఆనందం పెరుగుతుంది.
అన్నింటికన్నా, ఆరవ సూత్రం అత్యంత ప్రభావవంతమైనది.
స్వార్థం లేకుండా చేసే పనులతో మనకు నలుగురిలో మంచి పేరు రావడంతో పాటు, మనలోని సానుకూల భావాన్ని, సంతోషాన్ని కూడా మెరుగుపరుస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
"మీ జేబులో డబ్బులున్నాయి. అదే సమయంలో ఎదుటి వ్యక్తి సాయం కోసం చూస్తున్నారు. అప్పుడు మీకు చేతనైనంతలో అతనికి కొంత డబ్బు సాయం చేయండి. అప్పుడు అదే డబ్బును మీకోసమే ఖర్చు చేసుకున్నప్పుడు వచ్చేదానికి మించిన ఆనందం వస్తుంది." ఈ విషయం 130 దేశాల్లో నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది.
అయితే, ఈ 10 నిమిషాల పరిశీలన ద్వారా అందరిలో అద్భుతాలు జరిగే అవకాశం ఉండదని, ఎవరైనా తాము మానసికంగా కుంగుబాటుతో బాధపడుతున్నట్లు అనిపిస్తే.. తప్పకుండా వైద్యులను సంప్రదించాలని డాక్టర్. మాన్ సూచించారు.
ఇవి కూడా చదవండి:
- ఆన్లైన్లో అమ్మాయిలు.. ఈ ఒంటరితనానికి పరిష్కారమేంటి?
- రాయలసీమకు ఆ పేరు ఎలా.. ఎప్పుడు వచ్చింది? ఎవరు పెట్టారు?
- 1970ల్లో బ్రిటన్ను కుదిపేసిన భారత సంతతి మహిళల పోరాటం
- భారత్‌లో పెరుగుతున్న పోర్న్ వీక్షణ
- నమ్మకాలు-నిజాలు: కాపురాలు కూల్చేసే తెల్లబట్ట
- రియాలిటీ చెక్: బుల్లెట్ రైలు గడువులోగా పట్టాలెక్కుతుందా?
- ఏపీలో అత్యధిక సంఖ్యలో ఓటర్లు ఏ నియోజకవర్గంలో ఉన్నారో తెలుసా?
- వీవీపాట్ అంటే ఏమిటి? అదెలా పనిచేస్తుంది?
- ఇథియోపియా విమాన ప్రమాదంలో నలుగురు భారతీయులు మృతి
- మీరు ఎక్కే విమానం ఎంత వరకు సురక్షితం?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.








