బొంగులో బిర్యానీ: ఈ వీడియో చూస్తే ‘బొంగులో బిర్యానీ’ మీరే ఈజీగా తయారు చేసుకోవచ్చు
- రచయిత, శంకర్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు కనుమల్లో పుట్టిన బొంగు బిర్యానీ (బ్యాంబూ బిర్యానీ) రాష్ట్రమంతటా సంచలనం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని తమ రాష్ట్ర బ్రాండ్‌గానూ ప్రకటించింది.
పాత్రలేవీ ఉపయోగించకుండా తయారుచేసే ఈ వంటకం కొండ ప్రాంతాల నుంచి ప్రధాన భూభాగానికి ప్రయాణించి... భోజన ప్రియులకు ప్రీతిపాత్రంగా మారిపోయింది.

''మా పూర్వీకులు వంట పాత్రలు లేకపోవటం వల్ల ఈ బొంగుల్లో ఆహారం వండేవారు. అదే వంటకం 'బ్యాంబూ బిర్యానీ'గా విస్తృతంగా ప్రచారమైంది. దీనిని నేను నా తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్నాను'' అని వంట మాస్టర్ రఘు. సీహెచ్ వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమల్లి, అరకు ప్రాంతాల్లో నివసించే గిరిజనుల సంప్రదాయ వంటకం ఈ బొంగు బిర్యానీ.
విజయవాడలో 2018 ఆగస్టులో బ్యాంబూ బిర్యానీ రెస్టారెంట్‌ను ప్రారంభించారు.

''ఏదైనా భిన్నంగా చేయాలని అనుకునేవాడ్ని. జనం బ్యాంబూ బిర్యానీ తినాలనుకుంటే ఏజెన్సీ ప్రాంతాలకు ప్రయాణించాల్సి ఉంటుంది. అందుకే ఈ రెస్టారెంట్ ప్రారంభించాను'' అని రెస్టారెంట్ యజమాని సురేశ్ చెప్పారు.

ఈ రెస్టారెంట్ బొంగు బిర్యానీ వంటకు అవసరమైన ముడి సరుకులన్నిటినీ గిరిజన ప్రాంతాల నుంచి సేకరిస్తుంది.

''నేను మొదటిసారి ఈ బ్యాంబూ బిర్యానీ తింటున్నా. ఇందులో నూనె, మసాలాలు వాడకపోవటం వల్ల ఇది చాలా రుచిగా ఉంది'' అని పి.రమ అనే మహిళ పేర్కొన్నారు.
- ఇంతకూ బిర్యానీ హైదరాబాద్‌ది కాదా?
- ఈద్ ప్రత్యేకం: హలీం గురించి రుచికరమైన విషయాలు
- వడా పావ్: ఇది మెక్ డొనాల్డ్స్కే చుక్కలు చూపించిన 'ఇండియన్ బర్గర్'
- బ్రేక్‌ఫాస్ట్ నిజంగానే ఆరోగ్యానికి మేలు చేస్తుందా?
- అన్నం ఎక్కువగా తింటే ముందుగానే మెనోపాజ్..!
- వేరుసెనగ పప్పు తింటే చనిపోతారా?
- కేకులు, బన్నులు తింటే కేన్సర్ వస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









