కరోనావైరస్: కేరళలో కోవిడ్-19ను జయించిన 93 ఏళ్ల వృద్ధుడు

ఫొటో సోర్స్, GETTY IMAGES
కేరళకి చెందిన 93 ఏళ్ల వృద్ధుడు కరోనావైరస్ బారి నుంచి కోలుకున్నట్లు డాక్టర్లు చెప్పారు. ఆయనతో పాటు ఆయన 88 సంవత్సరాల భార్యకు కూడా నెల క్రితం కరోనావైరస్ పాజిటివ్ అని గుర్తించారు.
అయితే, ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ప్రస్తుతం ఇద్దరూ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని మరి కొన్ని రోజుల్లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతారని చెప్పారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వృద్ధుల్లో ఈయనే తొలి వ్యక్తి .
ఇటలీ నుంచి వచ్చిన వారి కుమార్తె, అల్లుడి ద్వారా వీరికి కరోనావైరస్ సోకింది.
బుధవారం నాటికి భారతదేశంలో 1238 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
35 మంది ఇన్ఫెక్షన్ కి గురై మరణించగా, 123 మంది వ్యాధి నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
కేరళలోని ఈ వృద్ధులు వైరస్ బారి నుంచి కోలుకోవడం పట్ల చాలా మంది హర్షం వ్యక్తం చేశారు. వారికి వైద్యం అందించిన డాక్టర్లని ప్రశంసించారు.
ఆయనకి బీపీ, డయాబెటిస్ లక్షణాలు కూడా ఉన్నాయి. చాలా దేశాల్లో ఈ లక్షణాలున్న చాలా మందిపై వైరస్ తీవ్ర ప్రభావం చూపించింది.

- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ సోకితే మనిషి శరీరానికి ఏమవుతుంది?
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు

కేరళ వృద్ధుని పరిస్థితి కూడా విషమించి 24 గంటల పాటు వెంటిలేటర్ మీద పెట్టవలసి వచ్చిందని ఆయనకి వైద్యం అందించిన డాక్టర్లు బీబీసీతో చెప్పారు.
హాస్పిటల్లో చేరిన కొత్తలో వాళ్లకి వైద్యం చేయడం చాలా కష్టం అయిందని, వాళ్ళు కూడా చాలా విసిగించారని, వాళ్లకి వైద్యం అందించిన కొట్టాయం మెడికల్ కాలేజీ హాస్పిటల్ డాక్టర్ ఆర్పీ రెంజిన్ చెప్పారు.
ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వారిద్దరినీ విడివిడిగా ఉంచడంపై వారెక్కువ ఫిర్యాదు చేసేవారని తెలిపారు.
కానీ ఒక గ్లాస్ అడ్డుగా ఉన్న రెండు గదుల్లో వారిని పెట్టడంతో వారిద్దరూ ఒకరినొకరు చూసుకోవడం మొదలుపెట్టారని చెప్పారు.
అలా ఒకరినొకరు చూసుకునే వీలు కలిగేటట్లు హాస్పిటల్ గదులు ఇవ్వడంతో ఇద్దరూ చాలా సంతోషపడ్డారని డాక్టర్ చెప్పారు. హాస్పటల్ స్టాఫ్ కూడా వారి పట్ల అభిమానం పెంచుకుని అమ్మ, నాన్న అని పిలవడం మొదలు పెట్టినట్లు చెప్పారు.
వీరి పిల్లలు, ఇటలీ నుంచి వచ్చిన తర్వాత ఎయిర్ పోర్టు లో స్క్రీనింగ్ చేయించుకోకుండా వచ్చినందుకు ఇటలీ జంటగా వార్తల్లోకెక్కారు.
అధికారులు వాళ్ళని గుర్తించే సమయానికే వైరస్ వారి ద్వారా చాలా మందికి సోకింది.


ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








