కరోనావైరస్: వెంటిలేటర్లకు ప్రత్యామ్నాయం తయారుచేసిన మెర్సిడెస్ ఫార్ములా వన్ టీం

సీపీఏపీ పరికరం

ఫొటో సోర్స్, JAMES TYE/UCL

ఫొటో క్యాప్షన్, సీపీఏపీ పరికరం

కరోనావైరస్ రోగులకు ఉపయోగపడే శ్వాస పరికరం ఒకదాన్ని వైద్యులు, ఇంజినీర్లు, మెర్సెడెస్ ఫార్ములా వన్ బృందం కలిసి వారం రోజుల్లో తయారుచేశారు.

ఇది రోగులు శ్వాస పీల్చుకోవడంలో సహకరిస్తుంది. ఇది వాడితే రోగులు ఇంటెన్సివ్ కేర్‌లో ఉండాల్సిన అవసరం ఉండదని ఆ పరిశోధకులు చెబుతున్నారు.

కంటిన్యుయస్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెజర్(సీపీఏపీ) అనే ఈ పరికరాన్ని కరోనావైరస్ బాధితులకు చికిత్స కోసం ఇటలీ, చైనా ఆసుపత్రులలో ఉపయోగించారు కానీ సరిపడా ఉండేవి కావు.

లండన్ యూనివర్సిటీ కాలేజీ(యూసీఎల్) ఇంజినీర్లు, యూనివర్సిటీ కాలేజీ లండన్ హాస్పిటల్(యూసీఎల్‌హెచ్)‌ వైద్యులు.. మెర్సెడెస్ ఫార్ములా వన్ బృందంతో కలిసి ఈ సీపీఏపీని అభివృద్ధి చేశారు.

ఇవి వెంటిలేటర్ అవసరం లేకుండానే ఊపిరితిత్తులకు ఆక్సిజన్ సరఫరా అందేలా చేస్తాయి.

వీరు తయారుచేసిన వాటిలో 40 పరికరాలను యూఎల్‌సీహెచ్‌కు, మరో మూడింటిని లండన్ హాస్పిటళ్లకు అందజేశారు. వీటిని అక్కడ ప్రయోగాత్మకంగా ఉపయోగించాక ఫలితం ఉంది అనుకుంటే పెద్ద ఎత్తున తయారుచేస్తారు.

మెర్సెడెస్-ఏఎంజీ-హెచ్‌పీపీ వీటిని రోజుకు 1000 వరకు తయారుచేయగలదు.

యూకేలోని మెడిసన్స్, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ(ఎంహెచ్ఆర్ఏ) ఇప్పటికే ఈ పరికరాల వినియోగానికి అనుమతులిచ్చింది.

భారత్‌లో కరోనావైరస్ కేసులు

17656

మొత్తం కేసులు

2842

కోలుకున్నవారు

559

మరణాలు

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి
BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

వెంటిలేటర్ల తయారీకి..

మరోవైపు యూకేలోని పారిశ్రామిక, సాంకేతిక, వ్యాపార సంస్థలు కొన్ని కలిసి యూకే ఆరోగ్య సేవల సంస్థ ‘నేషనల్ హెల్త్ కేర్ సర్వీస్’ కోసం వెంటిలేటర్లు తయారుచేయడానికి ముందుకొచ్చాయి.

‘వెంటిలేటర్ చాలెంజ్ యూకే’ పేరిట ఏర్పడిన ఈ సంస్థల కూటమిలో ఎయిర్‌బస్, బీఏఈ సిస్టమ్స్, ఫోర్డ్, రోల్స్ రాయిస్, సీమన్స్ వంటి దిగ్గజ సంస్థలున్నాయి.

ఈ కూటమిలోని సంస్థలకు 10 వేల వెంటిలేటర్లు తయారుచేయడానికి ప్రభుత్వం నుంచి ఆర్డర్లు వచ్చాయి కానీ, ఎంహెచ్ఆర్ఏ అనుమతులు ఇంకా లభించలేదు.

ఎంహెచ్ఆర్ఏ నుంచి అనుమతులు వస్తే వచ్చే వారం నుంచి వీరు వెంటిలేటర్ల తయారీ ప్రారంభిస్తారు.

తయారీరంగ అధ్యయన కేంద్రాల సంస్థ ‘హై వేల్యూ మాన్యుఫాక్చరింగ్ కెటాపుల్ట్’ సీఈఓ డిక్ ఎల్సీ దీనిపై మాట్లాడుతూ.. ‘ప్రపంచంలోని వినూత్న ఆవిష్కరణల అనుభవమున్న సంస్థలను ఈ కూటమి ఏకతాటిపైకి తెచ్చింద’’న్నారు.

‘‘అనేక దేశాల ప్రజలపై ప్రభావం చూపుతున్న వైరస్‌తో సాగిస్తున్న పోరాటంలో ఉపయోగపడే అత్యావశ్యకమైన వెంటిలేటర్ల తయారీకి వారంతా కృతనిశ్చయం, శక్తితో కలిసికట్టుగా పనిచేస్తున్నార’’న్నారాయన.

పరికరాన్ని అభివృద్ధి చేసిన బృందంలోని శాస్త్రవేత్తలు

ఫొటో సోర్స్, JAMES TYE/UCL

ఫొటో క్యాప్షన్, పరికరాన్ని అభివృద్ధి చేసిన బృందంలోని శాస్త్రవేత్తలు

సత్వర స్పందన

యూసీఎల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ ఇంజినీరింగ్ డైరెక్టర్ రెబెకా షిప్లీ బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘సాధారణంగా వైద్య పరికరాల అభివృద్ధికి ఏళ్లు పడుతుంది. కానీ, మేం ఇప్పటికే ఉన్న ఓ పరికరాన్ని రివర్స్ ఇంజినీరింగ్‌తో మెరుగుపర్చి వేగంగా ఉత్పత్తి చేయగలిగేలా అభివృద్ధి చేశాం’’ అన్నారు.

పేటెంటు సమస్యలేమీ లేని సీపీఏపీని తీసుకుని దాని డిజైన్‌ను మార్చి పెద్దఎత్తున ఉత్పత్తి చేయడానికి వీలుగా మార్చినట్లు చెప్పారు.ఇటలీలోని లాంబర్డీలో 50 శాతం రోగులకు గొంతులోకి చొప్పించే వెంటిలేటర్లకు(ఇన్‌వేసివ్ మెకానికల్ వెంటిలేటర్లు) బదులు దీన్ని ఉపయోగించారు.

వెంటిలేటర్ల కొరత ఉండడం వల్ల బాగా విషమపరిస్థితుల్లో ఉన్న రోగులకు మాత్రమే వెంటిలేటర్లను ఉపయోగించి మిగతావారికి ప్రత్యామ్నాయంగా ఈ సీపీఏపీలు వాడుకోవచ్చని యూసీఎల్‌హెచ్ క్రిటికల్ కేర్ కన్సల్టెంట్ ప్రొఫెసర్ మెర్విన్ సింగర్ చెప్పారు.

ఇంతకీ సీపీఏపీ ఎలా పనిచేస్తుంది..

ఇది రోగుల ముక్కు, నోటి ద్వారా గాలి, ఆక్సిజన్‌ల మిశ్రమాన్ని స్థిరంగా పంపిస్తుంది. ఈ ప్రక్రియలో కలిగే పీడనం వల్ల ఊపిరితిత్తులు తెరుచుకుని ఉంటాయి.. దానివల్ల ఊపిరితిత్తుల్లోకి ఆక్సిజన్ ఎక్కువగా వెళ్తుంది.

అప్పుడు గాలి పీల్చుకోవడానికి ప్రయాస పడడం తగ్గుతుంది. ముఖ్యంగా కోవిడ్-19 కారణంగా ఊపిరితిత్తుల్లోని గాలి గదులు(అల్వియాలీ) నాశనమైనప్పుడు ఊపిరిపీల్చుకోవడం చాలా కష్టమైన సందర్భంలో ఆక్సిజన్ ఇలా చేరడమనేది ప్రయాస తగ్గిస్తుంది.

ఆక్సిజన్ సిలిండర్‌కు అనుసంధానించే సాధారణ ఫేస్ మాస్కులకు భిన్నంగా ఇది నిర్ణీత పీడనంతో గాలి, ఆక్సిజన్‌లను పంపిస్తుంది.మరోవైపు వెంటిలేటర్లు అయితే రోగుల శ్వాసనాళంలోకి గొట్టాలు పంపించాల్సిన అవసరం ఉండడమే కాకుండా మత్తుమందు కానీ, నిద్రపుచ్చే మందులు కానీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, సీపీఏపీకి ఆ అవసరం లేదు.

వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?

అభ్యంతరాలేమిటి?

అయితే.. సాంక్రమిక శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో బాధపడే రోగులకు వీటిని వాడడం వల్ల ఇబ్బందులున్నాయని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఇంటెన్సివ్ కేర్ మెడిసన్ ప్రొఫెసర్ డంకన్ యంగ్ అన్నారు.

వీటికుంటే ఫేస్ మాస్కుకు కనుక లీకులుంటే వాటిలోంచి అలాంటి రోగుల స్రావాలు క్లినికల్ స్టాఫ్‌పై పడే ప్రమాదముందన్నారు.

కాగా ఇటలీలోని లాంబర్డీలో జనరల్ వార్డుల్లో ఉంటున్న కోవిడ్ -19 రోగుల్లో 2 వేల మందికిపైగా ఈ సీపీఏపీలను వినియోగించనున్నారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)