కరోనావైరస్‌తో వణుకుతున్న స్టాక్ మార్కెట్... గంటలో రూ.10లక్షల కోట్లు ఆవిరి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దినేశ్ ఉప్రేతీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత స్టాక్ మార్కెట్‌పై కరోనావైరస్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సోమవారం షేర్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి.
బాంబే స్టాక్ ఎక్స్చేంజ్‌లోని సెన్సెక్స్ సూచీ 3,934.72 పాయింట్లు పతనమై 25,981.24 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్‌లోని నిఫ్టీ సూచీ 1,135.20 పాయింట్లు నష్టపోయి,7,610.25 పాయింట్ల వద్ద ముగిసింది.
కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రంతోపాటు వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్‌డౌన్ లాంటి చర్యలను ప్రకటించాయి. ఫలితంగా చాలా సంస్థల్లో ఉత్పత్తి ఆగిపోయింది. నడుస్తున్న కొన్ని సంస్థలు కూడా ఆగిపోయే దిశగానే సాగుతున్నాయి. ఫలితంగా స్టాక్ మార్కెట్లో షేర్లు పేక మేడల్లా కూలిపోతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
సోమవారం ఉదయం గందరగోళం మధ్య మార్కెట్ 10 శాతం పడిపోయి లోయర్ సర్క్యూట్‌లోకి వెళ్లింది. దీంతో ఉదయం 9.58కి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్‌లో 45 నిమిషాల పాటు ట్రేడింగ్ నిలిపివేశారు.మార్కెట్ ప్రారంభమైన గంటలోనే దాదాపు రూ.10 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైపోయింది.
మార్కెట్ లోయర్ సర్య్యూట్‌లోకి వెళ్లి, ట్రేడింగ్ నిలిచిపోవడం ఈ నెలలో ఇది రెండోసారి.
ఇదివరకు మార్చి 13న కూడా ఇలాగే జరిగింది.
భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒకే నెలలో రెండు సార్లు లోయర్ సర్క్యూట్‌ల్లోకి వెళ్లి, ట్రేడింగ్ నిలిపివేయాల్సి రావడం ఇదే మొదటిసారి.
ఇదివరకు హర్షద్ మెహతా కుంభకోణం బయటకు వచ్చినప్పుడు 1992 ఏప్రిల్ 28న, ఎన్నికల అనిశ్చితి వల్ల 2004 మే 17న, పీ-నోట్స్ కారణంగా 2007 అక్టోబర్ 17న, సబ్‌ప్రైమ్ సంక్షోభం వల్ల 2008 జనవరి 22న మార్కెట్ లోయర్ సర్క్యూట్‌లోకి వెళ్లింది.

- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ సోకితే మనిషి శరీరానికి ఏమవుతుంది?
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు

ప్రస్తుత సంకట పరిస్థితులను తట్టుకుని నిలబడుతున్న షేర్లను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. బ్యాంకింగ్ షేర్లు తీవ్రంగా కుదేలవుతున్నాయి.
ప్రైవేటు బ్యాంకులతోపాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు కూడా తీవ్ర నష్టాల్లో నడుస్తున్నాయి. సూచీలో అధిక వాటా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ షేర్ల విక్రయాలు కూడా పెద్ద ఎత్తున సాగుతున్నాయి.
గత నెల రోజులుగా చాలా వరకు బ్యాంకింగ్ షేర్లు 50 శాతం మేర పడిపోయాయి. సగం ధరకు కూడా వాటిని కొనుగోలు చేసేందుకు మదుపరులు ఆసక్తి చూపడం లేదు.

ప్రస్తుతం దేశంలో కరోనావైరస్ సంక్షోభం చాలా కీలకమైన, సున్నితమైన దశలో ఉందని దిల్లీలోని ఓ బ్రోకరేజ్ సంస్థకు చెందిన రీసెర్చ్ అనలిస్ట్ ఆసిఫ్ ఇక్బాల్ అన్నారు.
''కరోనావైరస్ విషయంలో చైనా, ఇటలీ తరహా పరిస్థితి భారత్‌లోనూ రావొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న షేర్ మార్కెట్లపై దీని ప్రభావం కనిపిస్తోంది. భారత్ కూడా దీన్ని తప్పించుకోలేదు. కరోనావైరస్ వ్యాప్తిపై నియంత్రణ సాధించి, ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడితేనే దలాల్ స్ట్రీట్‌ను కాపాడుకోగలం'' అని ఆయన అభిప్రాయపడ్డారు.
అంతర్జాతీయ కారణాలతోపాటు కరోనావైరస్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల ప్రభావం కూడా మార్కెట్‌పై కనిపిస్తోంది.
దిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, బిహార్, జమ్మూకశ్మీర్, చంఢీగడ్‍లు మార్చి 31 వరకూ లాక్‌డౌన్ ప్రకటించాయి.
మారుతీ సుజుకి ఇండియా, మాహీంద్రా అండ్ మహీంద్రా ఉత్పత్తి కార్యకలాపాలను ఆపేశాయి. ఎల్జీ సహా చాలా సంస్థలు ఉత్పత్తిని తగ్గించుకుంటున్నాయి.
షేర్ మార్కెట్‌లో గందరగోళం ఇప్పుడుప్పుడే తగ్గదని మార్కెట్ నిపుణుడు వివేక్ మిత్తల్ అంటున్నారు.
''ఈ పతనం వెనుక దేశీయ కారణాలు లేవు. అదే సమస్య. మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలను మనం తప్పుపట్టలేం. కరోనా మహమ్మారి దాదాపు 190 దేశాలకు పాకింది. కొరియా, జపాన్, భారత్, చైనా సహా ఆసియా మార్కెట్లను భయం కమ్మేసింది. అమెరికాలోని వాల్ స్ట్రీట్, యూరోపియన్ మార్కెట్లు కూడా కుదేలవుతున్నాయి'' అని ఆయన అన్నారు.
Sorry, your browser cannot display this map
పరిష్కారం ఏదైనా ఉందా...
డాలర్‌తో పోలిస్తే రూపాయి చరిత్రలోనే అత్యల్ప స్థాయికి చేరుకుంది. తయారీ కార్యకలాపాలు నిలిచిపోతున్నాయి. కరోనా విషయంలో అనిశ్చితితో కూడిన వాతావరణం నెలకొంది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు షేర్ల అమ్మకాలకు దిగుతున్నారు. వీటన్నింటి ప్రభావం కచ్చితంగా మార్కెట్‌పై ఉంటుంది.
మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ.. ఫ్యూచర్స్ మార్కెట్ విషయంలో కొన్ని కొత్త షరతులను తెచ్చింది. మార్కెట్లో భారీ హెచ్చుతగ్గులను అదుపు చేసేందుకు చాలా షేర్ల ఫ్యూచర్స్ ట్రేడింగ్‌పై నిషేధం విధించింది. అయితే, దీని తక్షణ ప్రభావమేదీ ఇంకా కనిపించడం లేదు.
ప్రమాదకరమైన కెరటాలను ఎదుర్కొని ఈదే సామర్థ్యం ఉన్నవాళ్లే స్టాక్ మార్కెట్ సముద్రాన్ని జయిస్తారని ఓ నానుడి ఉంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి ధైర్యం చూపించేవాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు.
''ఇంకా షేర్ మార్కెట్లో ఎన్ని హెచ్చుతగ్గులు చూడాల్సి వస్తుందో అంచనా వేయడం చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో మదుపరులు వాస్తవిక దృష్టితో ఉండకుండా, భావోద్వేగ వైఖరితో వ్యవహరిస్తుంటారు'' అని వివేక్ మిత్తల్ వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి.
- కరోనావైరస్: ప్రపంచ చరిత్రను మార్చేసిన అయిదు మహమ్మారులు
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఈ మహమ్మారి ఎప్పుడు ఆగుతుంది? జనజీవనం మళ్లీ మామూలుగా ఎప్పుడు మారుతుంది?
- కరోనావైరస్‌తో మన రోగనిరోధక వ్యవస్థ ఎలా పోరాడుతుందంటే..
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో లాక్ డౌన్: మీరు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- నిర్భయ కేసు హంతకుల ఉరితీత: ఆ నలుగురి చివరి కోరికలేంటి
- 90 ఏళ్ల క్రితం కులం గురించి భగత్‌సింగ్ ఏం చెప్పారు?
- ఈ కుర్రాడు రతన్ టాటాకు క్లోజ్ ఫ్రెండ్...
- ‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు: చనిపోయే దాకా దీక్షను కొనసాగించటానికి కారణాలేంటి?
- పీటీ ఉష: ఎలాంటి సదుపాయాలూ లేని పరిస్థితుల్లోనే దేశానికి 103 అంతర్జాతీయ పతకాలు సాధించిన అథ్లెట్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









